ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ

5జీ ప్రారంభంతో పాటు రాష్ట్ర ఐటీ మంత్రుల డిజిటల్ ఇండియా సదస్సు


12 రాష్ట్రాలు మరియు కేంద్రపాలతి ప్రాంతాల నుండి ఐటీ మంత్రులు ఈ సమావేశానికి హాజరయ్యారు. 5జీ జాతీయ రోల్ అవుట్‌ను మంత్రులు స్వాగతించారు. డిజిటల్ ఇండియా కార్యక్రమాల తాజా పురోగతిని మరియు అమలు కోసం ఉత్తమ పద్ధతులను పంచుకున్నారు

దేశవ్యాప్తంగా సమ్మిళిత డిజిటల్, సామాజిక, ఆర్థిక మరియు స్థిరమైన అభివృద్ధిపై దృష్టి సారించి డిజిటల్ ఇండియాను మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు టీమ్ ఇండియా

Posted On: 03 OCT 2022 1:10PM by PIB Hyderabad

ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ 2022)ఆరవ ఎడిషన్‌తో పాటు రాష్ట్ర ఐటీ మంత్రుల డిజిటల్ ఇండియా కాన్ఫరెన్స్ అక్టోబర్ 1న జరిగింది. ఈ సదస్సును ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ నుండి ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ ముఖేష్ అంబానీ, భారతీ ఎంటర్‌ప్రైజెస్ నుండి శ్రీ సునీల్ భారతి మిట్టల్, ఆదిత్య బిర్లా గ్రూప్ నుండి శ్రీ కుమార్ మంగళం బిర్లా మరియు పలువురు ఇతర ప్రముఖులు ప్రారంభోత్సవానికి విచ్చేశారు. ఇందులో 5జీ జాతీయ ప్రారంభంతో పాటు ప్రదర్శనలు,విద్య, ఆరోగ్యం, కార్మికుల భద్రత, స్మార్ట్ వ్యవసాయం మొదలైన వాటిలో అనేక 5జీ  వినియోగ అవసరాలను ఆవిష్కరించింది.

 

image.png

 

ఐఎంసీ-2022 ప్రారంభ సెషన్ అనంతరం కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు రైల్వేల మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ అధ్యక్షతన "రాష్ట్ర ఐటి మంత్రుల డిజిటల్ ఇండియా కాన్ఫరెన్స్" ఎలక్ట్రానిక్స్ & మంత్రిత్వ శాఖ మంత్రి సమక్షంలో జరిగింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు స్కిల్ డెవలప్‌మెంట్ & ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ మరియు కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి శ్రీ దేవుసిన్హ చౌహాన్ మరియు ఆంధ్రప్రదేశ్, అస్సాం, బీహార్, మధ్యప్రదేశ్, గుజరాత్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్, తెలంగాణ , మిజోరాం, సిక్కిం మరియు పుదుచ్చేరి నుండి ఐటిశాఖ మంత్రులు పాల్గొన్నారు. అలాగే అన్ని రాష్ట్రాలు మరియు యుటిల నుండి రాష్ట్ర ఐటి కార్యదర్శులు మరియు రాష్ట్ర అధికారులు మరియు ఎంఇఐటివై మరియు డాట్ నుండి సీనియర్ అధికారులు కూడా హాజరయ్యారు.

మహమ్మారి సమయంలో డిజిటల్ ఇండియా తన స్థితిస్థాపకతను ఎలా నిరూపించుకుందనే విషయాన్ని తన స్వాగత ప్రసంగంలో ఎంఇఐటివై కార్యదర్శి శ్రీ అల్కేష్ కుమార్ శర్మ పంచుకున్నారు. మై స్కీమ్, మేరీ పెహ్‌చాన్, డిజిటల్ భాషినీ మరియు పిఎల్‌ఐ వంటి తాజా కార్యక్రమాలను పంచుకున్నారు. వీటిని రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలు సులభతర జీవనం మరియు వ్యాపార సౌలభ్యాన్ని పెంపొందించడం కోసం ఉపయోగించుకోవచ్చన్నారు. ఈ దశాబ్దాన్ని భారతదేశ టెక్‌ఏడ్‌గా మార్చేందుకు అన్ని ప్రయత్నాలూ చేయాలని ఆయన ఉద్ఘాటించారు.

శ్రీ దేవుసిన్హ చౌహాన్ తన ప్రసంగంలో ఈ రోజు భారతదేశంలో 5జీ సేవలను ప్రవేశపెట్టడం చారిత్రాత్మకమైన రోజు అని పేర్కొన్నారు.ఆర్‌ఓడబ్ల్యూ అనుమతి పొందేందుకు పట్టే సమయాన్ని 3 నెలల నుంచి 6 రోజులకు తగ్గించినట్లు ఆయన పేర్కొన్నారు.

శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ వృద్ధికి అపూర్వమైన అవకాశం ఉందని ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ రంగంలో విశ్వసనీయ సరఫరా గొలుసు భాగస్వామిగా ప్రపంచం భారతదేశం వైపు చూస్తోందని అన్నారు. డిజిటల్ పరికరం, డిజిటల్ డేటా, లోతైన సాంకేతికతలు మరియు సరఫరా గొలుసులో భారీ వైవిధ్యం గురించి ప్రస్తావించారు. టీమ్ ఇండియాగా అన్ని రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలు కంపెనీలను ఆకర్షించడానికి పిఎల్‌ఐ స్కీమ్‌లను ఉపయోగించాలని, స్టార్టప్ సంస్కృతిని 2/3 శ్రేణి నగరాలకు తీసుకెళ్లడానికి విధానాలను రూపొందించాలని, ఇండియా స్టాక్ సొల్యూషన్‌లను ప్రభావితం చేయాలని మరియు పౌర కేంద్రీకృత మరియు వ్యాపారాన్ని ప్రామాణీకరించడానికి దాని చుట్టూ నిర్మించిన డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించాలని ఆయన ఉద్ఘాటించారు.

 

image.png

 

శ్రీ అశ్విని వైష్ణవ్ తన ప్రారంభ ప్రసంగంలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలతో కూడిన టీమ్ డిజిటల్ఇండియా..యువత మరియు 1.3 బిలియన్ల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని పేర్కొన్నారు. ఉపాధి కల్పనపై దృష్టి సారించామని 2026 నాటికి 1 ట్రిలియన్ డాలర్ డిజిటల్ ఎకానమీ మరియు 1 కోటి డిజిటల్ ఉద్యోగాల లక్ష్యాన్ని సాధించాలని ఆయన అన్నారు. టెలికాం బిల్లు మరియు డిజిటల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు అనే కొత్త విధానాలతో ముందుకు వస్తున్నామని మరియు రాష్ట్రాలను భాగస్వామ్యం చేయడానికి ప్రోత్సహిస్తున్నామని ఆయన అన్నారు.
 
ఆ తర్వాత, రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల మంత్రులు తమ తమ రాష్ట్రాల్లో డిజిటల్ ఇండియా కింద చేపట్టిన కనెక్టివిటీ, ఎలక్ట్రానిక్ తయారీ ప్రయత్నాలు, ఇ-గవర్నెన్స్ కార్యక్రమాల పురోగతిని వివరించారు. కనెక్టివిటీకి సంబంధించిన సమస్యలు, ఎన్‌ఐఈఎల్‌ఐటీ, సిడిఏసి, ఎస్‌టిపిఐకి మరిన్ని కేంద్రాలను తెరవడం, అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలలో సిఓఈ ప్రారంభించడంతో పాటు విధానపరమైన విషయాలను కూడా వారు పంచుకున్నారు.

ఎంఈఐటీ తన ముగింపు వ్యాఖ్యలలో..డిజిటల్ ఇండియా దేశంలోని ప్రతి మూలకు చేరుకోవడానికి కనెక్టివిటీ చాలా ముఖ్యమైనదని పేర్కొన్నారు. రానున్న 500 రోజుల్లో కొత్తగా 25 వేల టవర్లను ఏర్పాటు చేసేందుకు రూ.36 వేల కోట్లకు ఆమోదం తెలిపినట్లు ప్రకటించారు. రాష్ట్రాలు/ప్రధాన కార్యదర్శులతో సంప్రదింపులు జరిపి టవర్లను ఏర్పాటు చేయడానికి స్థలాల జాబితాను తయారు చేస్తారు. రాష్ట్రాలు జాబితాను మరింత సమీక్షించవచ్చు. 1.64 లక్షల కోట్ల రూపాయలను సమగ్ర పద్ధతిలో బిఎస్‌ఎన్‌ఎల్ పునరుద్ధరణకు వినియోగిస్తామని, వచ్చే 18 నెలల్లో దీనిని అందుబాటులోకి తెస్తామని ఆయన ప్రకటించారు. భారతదేశంలో డిజైన్ మరియు మేక్-ఇన్-ఇండియా పెద్ద ప్రయోజనం పొందుతాయన్నారు. ప్రధానమంత్రి గతి శక్తిలో వేగంగా ఆన్‌బోర్డింగ్ చేసినందుకు అన్ని రాష్ట్రాలు మరియు యూటీలను ఆయన అభినందించారు. ఫైబర్ నెట్‌వర్క్‌ను ఉమ్మడి పోర్టల్‌లో ఉంచుతామని ఇది రాష్ట్రాలు మరియు యుటిలకు లేఅవుట్ ఆధారిత మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు మరియు డిజిటల్ పరివర్తన ప్రాజెక్టులను ప్లాన్ చేయడానికి సహాయపడుతుందని ఆయన ప్రకటించారు. విధానానికి సంబంధించిన అంశాలు రాష్ట్రాలతో తగు సంప్రదింపుల ద్వారా నిర్ణయించబడతాయని ఆయన తెలియజేశారు.

రూ. 2000 కోట్ల విలువైన మూలధన వ్యయం రాష్ట్రాలకు ప్రత్యేక సహాయంగా అందించబడింది. రాష్ట్రాలు తమ రాష్ట్రాల్లో వ్యాపారాలను ఆకర్షించేందుకు చురుగ్గా వ్యవహరించాలని మరియు వ్యాపార అనుకూల విధానాలను రూపొందించాలని ఆయన ప్రోత్సహించారు. సబ్‌కా సాత్ మరియు సబ్‌కా వికాస్ యొక్క నినాదాన్ని నొక్కిచెప్పిన ఆయన.. డిజిటల్ ఇండియాను ఉన్నత స్థాయికి తీసుకెళ్లడంలో మరియు ఆత్మనిర్భర్ భారత్ మరియు ట్రిలియన్ డాలర్ల డిజిటల్ ఎకానమీని సాకారం చేయడంలో అన్ని రాష్ట్రాలు మరియు యుటిలు, పెద్ద మరియు చిన్న రాష్ట్రాల విధానాలు చాలా ముఖ్యమైనవి అని ఆయన పేర్కొన్నారు.

***



(Release ID: 1864871) Visitor Counter : 121