ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
నేటితో ముగిసిన 75 రోజుల పాటు సాగిన ‘కోవిడ్ వ్యాక్సినేషన్ అమృత్ మహోత్సవ్’
18 సంవత్సరాల వయస్సు గల అర్హులైన జనాభాకు 15.92 కోట్లకు పైగా ప్రికాషన్ డోసుల అందజేత; 8% నుండి 27% వరకు పెరిగిన టీకాల కవరేజీ
75 రోజుల్లో 13.01 లక్షలకు పైగా ప్రత్యేక కోవిడ్ వ్యాక్సినేషన్ క్యాంపుల నిర్వహణ
Posted On:
30 SEP 2022 5:33PM by PIB Hyderabad
75 రోజుల పాటు సాగిన ‘కోవిడ్ వ్యాక్సినేషన్ అమృత్ మహోత్సవ్’ నేటితో ముగిసింది. ఈ ప్రచారం 15 జూలై 2022న 'మిషన్ మోడ్'లో ప్రారంభించబడింది. దీనిలో అర్హత ఉన్న వయోజన జనాభాలో (2వ డోసు తర్వాత 6 నెలలు లేదా 26 వారాలు పూర్తైన 18 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు వారికి ) కోవిడ్ టీకా ప్రికాషన్ డోసు కోసం అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాయి.
ఈ 75 రోజుల్లో, అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో, బస్ స్టేషన్లలో 11,104 శిబిరాలు, రైల్వే స్టేషన్లలో 5,664 శిబిరాలు, విమానాశ్రయాలలో 511 శిబిరాలు, వివిధ పాఠశాలలు మరియు కళాశాలలలో 1,50,004 పైగా శిబిరాలు, తీర్థ యాత్రల మార్గాలలో 4,451 శిబిరాలు నిర్వహించబడ్డాయి. వివిధ ప్రైవేట్ మరియు ప్రభుత్వ కార్యాలయాలు మరియు పారిశ్రామిక సంస్థలలో 11,30,044 శిబిరాలు నిర్వహించబడ్డాయి.
ఈ 75 రోజుల వ్యవధిలో 76.18 లక్షలకు పైగా మొదటి డోసు, 2.35 కోట్లకు పైగా రెండవ డోసు, 15.92 కోట్ల ప్రికాషన్ డోసులను అందించారు. రోజుకు 20.68 లక్షల డోస్‌ల ముందుజాగ్రత్త మోతాదుతో సహా రోజుకు 24.73 లక్షల డోసులు ఇవ్వబడ్డాయి.
కోవిడ్ వ్యాక్సినేషన్ అమృత్ మహోత్సవ్ కింద, అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు క్యాంపు విధానం ద్వారా భారీ జన సమీకరణతో 'జన్ అభియాన్'గా ప్రచారాన్ని నిర్వహించాలని కోరడం జరిగింది. చార్ ధామ్ యాత్ర (ఉత్తరాఖండ్), అమర్‌నాథ్ యాత్ర (జమ్మూ & కాశ్మీర్), కన్వర్ యాత్ర (ఉత్తర భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు/యూటీలు) అలాగే ప్రధాన మేళాలు, సమ్మేళనాల మార్గాలలో బహుళ ప్రత్యేక టీకా శిబిరాలు నిర్వహించబడ్డాయి. ఇంకా, కార్యాలయ సముదాయాలు, పారిశ్రామిక సంస్థలు, రైల్వే స్టేషన్లు, అంతర్రాష్ట్ర బస్ స్టేషన్లు, పాఠశాలలు మరియు కళాశాలలలో ప్రత్యేక టీకా శిబిరాలు నిర్వహించబడ్డాయి. ఉచిత కోవిడ్ వ్యాక్సినేషన్ కోసం మొత్తం 13,01,778 క్యాంపులు నిర్వహించబడ్డాయి.
15 జూలై 2022న కోవిడ్ వ్యాక్సినేషన్ అమృత్ మహోత్సవ ప్రారంభంలో, 18 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న అర్హతగల జనాభాలో 8% మంది మాత్రమే ముందు జాగ్రత్త మోతాదును పొందారు. 75 రోజుల ఉచిత టీకా కార్యక్రమం ద్వారా, అర్హులైన జనాభాలో 27% మంది వారి ముందు జాగ్రత్త మోతాదును పొందారు.
కోవిడ్-19 మహమ్మారికి వ్యతిరేకంగా లబ్ధిదారులకు పూర్తి/విస్తరించిన రక్షణను అందించడానికి ప్రికాషనరి డోసు నిర్వహణ కీలకమైనది. ఇది కోవిడ్-19 వ్యాధి తీవ్రతను, ఆసుపత్రిలో చేరే ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. తద్వారా మరణాలను తగ్గిస్తుంది.
***
(Release ID: 1864077)
Visitor Counter : 132