యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ

దేశవ్యాప్తంగా నెల రోజుల పాటు జరిగే స్వచ్ఛ భారత్ 2022 ప్రచారాన్ని ప్రయాగ్‌రాజ్ నుండి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ రేపు ప్రారంభించనున్నారు.

స్వచ్ఛ భారత్ 2022 కేవలం ఒక కార్యక్రమం మాత్రమే కాదు, పరిశుభ్రత యొక్క ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయడానికి ఇది ఉద్యమ ప్రయత్నం: శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్

Posted On: 30 SEP 2022 2:06PM by PIB Hyderabad

కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ 1 అక్టోబర్ 2022 నుండి ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా జరిగే  స్వచ్ఛ భారత్ 2022ను ప్రారంభించనున్నారు.

 

నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ (NYKS) అనుబంధ యూత్ క్లబ్‌లు & నేషనల్ సర్వీస్ స్కీమ్ అనుబంధ సంస్థల నెట్‌వర్క్ ద్వారా దేశవ్యాప్తంగా 744 జిల్లాల్లోని 6 లక్షల గ్రామాల్లో స్వచ్ఛ భారత్ 2022 కార్యక్రమం నిర్వహించబడుతోంది. యువజన వ్యవహారాల శాఖ స్వచ్ఛ భారత్ 2022 ద్వారా కోటి కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి పారవేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

 

స్వచ్చ భారత్ 2022 గురించి వీడియో సందేశంలో శ్రీ అనురాగ్ ఠాకూర్ ముందుగా తెలియజేస్తూ, పరిశుభ్రత పై అవగాహన పెంచడం, ప్రజలను చైతన్యం చేయడం మరియు భారతదేశాన్ని పరిశుభ్రంగా మార్చడంలో వారి భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో స్వచ్ఛ భారత్ 2022 ప్రారంభించబడుతుందని చెప్పారు. ఈ చొరవలో, వివిధ ప్రాంతాలు, భాషలు మరియు నేపథ్యాల ప్రజలు కలిసి పని చేస్తారు మరియు వ్యర్థాలను పూర్తిగా స్వచ్ఛంద సేవా ప్రాతిపదికన ఈ వ్యక్తులు పారవేస్తారు. స్వచ్ఛ్ భారత్ 2022 అనేది కేవలం ఒక కార్యక్రమం మాత్రమే కాదు, పరిశుభ్రత యొక్క ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయడానికి ఒక ఉద్యమ ప్రయత్నం. ఇది దేశంలోని ఆనంద సూచిక (హ్యాపీనెస్ ఇండెక్స్‌) కు కూడా దోహదపడుతుంది. యువజన వ్యవహారాల శాఖ ఈ ప్రచారాన్ని దేశంలోనే ప్రజలు నిర్వహించే అతిపెద్ద స్వచ్ఛతా ప్రచారంగా మార్చడానికి ప్రయత్నిస్తోంది.

 

01 అక్టోబర్ నుండి 31 అక్టోబర్ 2022 వరకు దేశంలోని అన్ని జిల్లాల వ్యాప్తంగా జరిగే ఈ కార్యక్రమం లో భాగంగా  బహిరంగ ప్రదేశాలు అంతటా మరియు గృహాలను శుభ్రపరచడం తమ పరిసరాలను పరిశుభ్రంగా మరియు వ్యర్థాలు లేకుండా ఉంచుకోవడం పట్ల పౌరులలో అవగాహన మరియు గర్వ భావన కలిగేలా సమాజంలోని అన్ని విభాగాలు, పంచాయతీ రాజ్ సంస్థలు మరియు ప్రభుత్వేతర సంస్థలతో సహా ప్రభుత్వ సంస్థలు పాల్గొనేలా చేయడం స్వచ్ఛ భారత్ 2022 కార్యక్రమం యొక్క లక్ష్యాలు.  ఈ ప్రచారంతో పాటు “స్వచ్ఛ్ కాల్: అమృత్ కాల్” అనే స్ఫూర్తి మంత్రాన్ని అందించి, ఈ కార్యక్రమాన్ని ప్రజా భాగస్వామ్యాన్ని బలోపేతం ద్వారా ప్రజా ఉద్యమంగా మారుస్తుంది.

 

***



(Release ID: 1863829) Visitor Counter : 143