రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ

అక్టోబర్ 1, 2023 నుండి ప్యాసింజర్ కార్లలో (M-1 కేటగిరీ) కనీసం 6 ఎయిర్‌బ్యాగ్‌లను తప్పనిసరి చేసే ప్రతిపాదన అమలులోకి వస్తుందన్న కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ

Posted On: 29 SEP 2022 3:06PM by PIB Hyderabad

కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ ప్యాసింజర్ కార్లలో ప్రయాణించే ప్రయాణీకులందరికీ వారి ధర మరియు వేరియంట్‌లతో సంబంధం లేకుండా వారి భద్రతకు ప్రధాన ప్రాధాన్యత ఇస్తున్నట్లు ట్వీట్లలో తెలిపారు.

ఆటోమొబైల్ పరిశ్రమ ఎదుర్కొంటున్న గ్లోబల్ సప్లై చైన్ పరిమితుల కారణంగా, స్థూల ఆర్థికవ్యవస్థపై దాని ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకునిప్యాసింజర్ కార్లలో (M-1 కేటగిరీ) కనీసం 6 ఎయిర్‌బ్యాగ్‌లను తప్పనిసరి చేసే ప్రతిపాదనను అక్టోబర్ 01, 2023 నుండి అమలు చేయనున్నట్లు శ్రీ నితిన్ గడ్కరీ చెప్పారు.

మోటారు వాహనాలలో ప్రయాణించేవారి భద్రతను పెంపొందించడానికి, 1989 సెంట్రల్ మోటర్ వెహికల్స్ రూల్స్ (CMVR)ని సవరించడం ద్వారా భద్రతా నియమాలను మెరుగుపరచాలని నిర్ణయించారు. దీనిని అనుసరించి 14 జనవరి 2022న డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేయబడింది. 1 అక్టోబర్ 2022 తర్వాత తయారు చేయబడిన M1 కేటగిరీ వాహనాలకు రెండు సైడ్/సైడ్ టోర్సో ఎయిర్ బ్యాగ్‌లుముందు వరుస ఔట్‌బోర్డ్ సీటింగ్ పొజిషన్‌ల వద్ద ఉండే వ్యక్తులకు ఒక్కొక్కటి, రెండు అవుట్‌బోర్డ్ సీటింగ్ స్థానాల వద్ద కూర్చునే వ్యక్తుల సైడ్ కర్టెన్/ట్యూబ్ ఎయిర్ బ్యాగ్‌లుఒక్కొక్కటి అమర్చబడి ఉండాలి.

***



(Release ID: 1863578) Visitor Counter : 163