సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
పౌరులతో పాటు వివిధ రంగాల అవసరాలను పరిష్కరించడానికి శాస్త్ర, సాంకేతికాభివృధి ని ఏకీకృతం చేయగల "సైన్స్ లీడర్లు" అవసరమని పేర్కొన్న - కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
న్యూఢిల్లీలో జరిగిన “బిల్డింగ్-సైన్స్-లీడర్స్-ప్రోగ్రామ్” ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రసంగించిన - కేంద్ర మంత్రి
ప్రజా ప్రయోజనాల కోసం సైన్స్ ను అందించడానికి శాస్త్రవేత్తలు తమ కార్యాలయాలతో పాటు, ఇంటి సామర్థ్యాలలో ముందంజలో ఉండటం చాలా ముఖ్యం: డాక్టర్ జితేంద్ర సింగ్
Posted On:
29 SEP 2022 3:38PM by PIB Hyderabad
కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా); భూ విజ్ఞాన శాస్త్రాల శాఖ మంత్రి (స్వతంత్ర హోదా); ప్రధానమంత్రి కార్యాలయం, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్లు, అణు విద్యుత్, అంతరిక్ష శాఖల సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ రోజు న్యూ ఢిల్లీ లో మాట్లాడుతూ, పౌరులతో పాటు వివిధ రంగాల అవసరాలను పరిష్కరించడానికి సమాజంలోని శాస్త్ర, సాంకేతికాభివృధిని ఏకీకృతం చేయగల, "సైన్స్ లీడర్లు" అవసరమని అన్నారు.
"బిల్డింగ్-సైన్స్-లీడర్స్-ప్రోగ్రాం" ప్రారంభించిన అనంతరం డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, ప్రభుత్వ సేవలు అందించడంతోపాటు, తమ కార్యాలయాలు, గృహ సామర్థ్యాలలో ప్రజల ప్రయోజనాల కోసం సైన్స్ ను అందించడానికి, శాస్త్రవేత్తలు ముందంజలో ఉండటం చాలా ముఖ్యమని పేర్కొన్నారు.
భారతదేశంలోని శాస్త్ర, సాంకేతిక రంగం సామాజిక అవసరాలు తీర్చడంలో మరింత ప్రాధాన్యతనిస్తోందని తెలియజేస్తూ, దీనికి ఒక మంచి ఉదాహరణ గా తీర ప్రాంతాల్లో తుఫాను అంచనాల కోసం రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీని ఉపయోగించడాన్ని పేర్కొనవచ్చునని, డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. అదేవిధంగా, ఇండియా స్టాక్ పై నిర్మించిన యునైటెడ్-పేమెంట్-ఇంటర్-ఫేస్ (యు.పి.ఐ) వంటి సాంకేతికత ప్రతి ఒక్కరికీ చెల్లింపులు చేయడం లో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. యు.పి.ఐ. అనేది "మొబైల్-మాత్రమే-ప్రపంచం" కోసం రూపొందించబడిన ప్రపంచంలోని ఏకైక ఏ.పి.ఐ-ఆధారిత పరస్పరం పనిచేసే వాస్తవ-సమయ డబ్బు బదిలీ వేదిక అని కూడా కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
'బిల్డింగ్-సైన్స్-లీడర్స్-ఇన్-ఇండియా' ప్రోగ్రామ్‌ను అభివృద్ధి చేయడానికి, అందించడానికి, కెపాసిటీ-బిల్డింగ్-కమిషన్, భారత ప్రభుత్వ ప్రధాన సాంకేతిక సలహాదారు (పి.ఎస్.ఏ) కార్యాలయం, సెంటర్-ఫర్-టెక్నాలజీ, ఇన్నోవేషన్-అండ్-ఎకనామిక్-రీసెర్చ్ (సి.టి.ఐ.ఈ.ఆర్) మరియు అహ్మదాబాద్ విశ్వవిద్యాలయం భాగస్వామ్యం కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఐ.ఎస్.ఆర్.ఓ) పాత్రను డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రశంసించారు.
'బిల్డింగ్-సైన్స్-లీడర్స్-ఇన్-ఇండియా' అనేది ల్యాబ్ లకు నాయకత్వం వహిస్తున్న లేదా నాయకత్వ పాత్రలు మరియు పరిశోధనా సంస్థల భవిష్యత్ డైరెక్టర్ పదవులను చేపట్టే అవకాశం ఉన్న శాస్త్రవేత్తల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన సహకార కార్యనిర్వాహక అభివృద్ధి కార్యక్రమం అని కేంద్ర మంత్రి చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా శాస్త్రవేత్తలలో కమ్యూనికేషన్, డిజైన్ థింకింగ్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ వంటి కీలక సామర్థ్యాలు మెరుగుపడతాయని, ఆయన తెలియజేశారు.
ఈ కార్యక్రమం మొదటి బ్యాచ్ లో భారత ప్రభుత్వంలోని 7 శాస్త్రీయ విభాగాలు – డి.ఎస్.టి., డి.బి.టి., ఐ.ఎస్.ఆర్.ఓ., డి.ఏ.ఈ., సి.ఎస్.ఐ.ఆర్., ఎం.ఓ.ఈ.ఎస్., ఎం.ఓ.ఈ.ఎఫ్.సి.సి. భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయి. విభాగాల్లోని శాస్త్రవేత్తలు ఒకరితో ఒకరు కలిసి పనిచేసేలా చూసుకోవడం కూడా ఈ సమన్వయ విధానం లక్ష్యం.
ఈ కార్యక్రమం రెండు దశల్లో రూపొందించబడింది. మొదటి దశ- (ఆన్‌లైన్): సెప్టెంబర్ 7, 8 తేదీల్లో రెండు రోజుల ఆన్-లైన్ కార్యక్రమం కాగా, రెండవ దశ (వ్యక్తిగతంగా): సెప్టెంబర్, 27వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఇస్రో, బెంగుళూరు లో నాలుగు రోజుల ప్రత్యక్ష కార్యక్రమం.
<><><>
(Release ID: 1863548)
Visitor Counter : 172