ప్రధాన మంత్రి కార్యాలయం
జపాన్ ప్రధాని తో సమావేశమైన ప్రధాన మంత్రి
Posted On:
27 SEP 2022 10:13AM by PIB Hyderabad
జపాన్ ప్రధాని శ్రీ ఫుమియో కిశిదా తో జరిగిన ఒక ద్వైపాక్షిక సమావేశం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాలుపంచుకొన్నారు. పూర్వ ప్రధాని శ్రీ శింజో ఆబే కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. కీర్తిశేషుడైన ప్రధాని భారతదేశం-జపాన్ భాగస్వామ్యాన్ని బలపరచడం తో పాటు గా ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి, అరమరికల కు తావు ఉండనటువంటి మరియు అన్ని వర్గాల ను కలుపుకొని పోయేటటువంటి ఇండో-పసిఫిక్ రీజియన్ తాలూకు దార్శనికత ను రూపుదిద్దడం లో కూడా అందించిన తోడ్పాటుల ను ప్రధాన మంత్రి ఈ సందర్భం లో ప్రస్తావించారు.
ద్వైపాక్షిక సంబంధాల ను మరింత గాఢతరం గా తీర్చిదిద్దుకోవడం లో నేత లు ఇరువురు వారి వారి నిర్మాణాత్మకమైనటువంటి ఆలోచనల ను ఒకరికి మరొకరు వెల్లడించుకొన్నారు. వారు అనేక ప్రాంతీయ అంశాల ను గురించి మరియు ప్రపంచ అంశాల ను గురించి కూడా చర్చించారు. భారతదేశం-జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక మరియు ప్రపంచ భాగస్వామ్యాన్ని మరింత గా బలోపేతం చేసే దిశ లోను, ప్రాంతీయ సమూహాల లో, వివిధ అంతర్జాతీయ సమూహాలు మరియు సంస్థల లో కలసి కృషి చేయడం లో నేత లు వారి యొక్క వచనబద్ధత ను పునరుద్ఘాటించారు.
***
(Release ID: 1862468)
Visitor Counter : 232
Read this release in:
Bengali
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam