పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
ఆత్మనిర్భర్ భారత్ దిశగా కొత్త అడుగు
పిస్టన్ ఇంజిన్ విమానాల కోసం ఉద్దేశించిన ప్రత్యేక ఏవియేషన్ ఇంధనం ఏ వి జి ఎ ఎస్ 100 ఎల్ ఎల్, మానవరహిత ఏరియల్ వెహికల్స్ ప్రారంభం
స్వదేశీ ఎవిజిఎఎస్ 100 ఎల్ ఎల్ తో దేశానికి విలువైన విదేశీ మారక ద్రవ్యం ఆదా
దేశంలో ఎవిజిఎఎస్ 100 ఎల్ ఎల్ ను ఉత్పత్తి చేసి మార్కెట్ చేసిన మొట్టమొదటి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీగా ఇండియన్ ఆయిల్ ఆవిర్భావం
Posted On:
26 SEP 2022 4:04PM by PIB Hyderabad
“మనం గణనీయమైన మార్పు కు లోనవుతున్నాం, ఇది దాదాపు విప్లవాత్మకమైనది. జీవ ఇంధన బ్లెండింగ్, గ్రీన్ హైడ్రోజన్ , ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టడం ద్వారా దిగుమతి చేసుకున్న ఇంధనాలపై ఆధారపడటాన్ని మనంతగ్గిస్తున్నాం." అని ఎ.వి.జి.ఎ.ఎస్ 100 ఎల్.ఎల్ ను ప్రారంభించిన సందర్భంగా కేంద్ర పెట్రోలియం, సహజవాయువు , గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పురి అన్నారు.
జనరల్ (డాక్టర్) వి.కె.సింగ్ (రిటైర్డ్) పౌర విమానయాన , రోడ్డు రవాణా , రహదారుల శాఖ సహాయ మంత్రి జనరల్ (డాక్టర్) వి.కె.సింగ్ (రిటైర్డ్) సమక్షంలో , పిస్టన్ ఇంజిన్ ఎయిర్ క్రాఫ్ట్ ల కోసం ఉద్దేశించిన ఎ.వి.జి.ఎ.ఎస్ 100 ఎల్.ఎల్, ప్రత్యేక ఏవియేషన్ ఫ్యూయల్ ను, మానవరహిత ఏరియల్ వెహికల్స్ ను శ్రీ హర్దీప్ సింగ్ పూరీ ప్రారంభించారు.
ప్రస్తుతం భారతదేశం ఈ ఉత్పత్తిని ఐరోపా దేశాల నుండి దిగుమతి చేసుకుంటోంది. హిందన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లోఇండియన్ ఆయిల్ నిర్వహించిన ఈ లాంచ్ ఈవెంట్లో భారత వైమానిక దళానికి చెందిన సీనియర్ అధికారులు, ఎం ఓ పి ఎన్ జి , ఎంఓసిఎకు చెందిన సీనియర్ అధికారులు ,ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్స్ (ఎఫ్ టి ఓ ) అధికారులు పాల్గొన్నారు.
స్వదేశీ ఎవి గ్యాస్ 100 ఎల్ఎల్ ను ప్రారంభించడం ప్రాముఖ్యతను పెట్రోలియం సహజ వాయువుల మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరీ వివరిస్తూ, ఎయిర్ పోర్టు లలో రద్దీ పెరగడం, విమానాల సంఖ్య పెరగడం, పైలట్ శిక్షణ కోసం ఎయిర్‌క్రాఫ్ట్‌ల సంఖ్య పెరగడం, ట్రైనీ ఎయిర్‌క్రాఫ్ట్‌లలో ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ (ఎఫ్ టి ఓ) ల పెరుగుదలతో అభివృద్ధి చెందుతున్న విమానయాన పరిశ్రమ అవసరాలను తీర్చడానికి స్వదేశీ ఎవి గ్యాస్ 100 ఎల్ఎల్ ను ప్రారంభించడం చాలా ముఖ్యం అని అన్నారు. భారతదేశంలో విమాన రవాణాకు డిమాండ్ భవిష్యత్తులో అనేక రెట్లు పెరుగుతుందని అంచనా వేస్తున్నందున, శిక్షణ పొందిన పైలట్లకు కూడా భారీ డిమాండ్ ఉంటుందని, ఇందుకోసం ఎఫ్టీవోల సంఖ్య కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉందని ఆయన తెలిపారు.
పౌర విమానయాన, రోడ్డు రవాణా, రహదారుల శాఖ సహాయ మంత్రి జనరల్ (డాక్టర్) వి.కె. సింగ్ (రిటైర్డ్) మాట్లాడుతూ, శ్రీ హర్దీప్ పూరి నాయకత్వంలో పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ మనం ఇప్పటివరకు దిగుమతి చేసుకున్న స్వదేశీ ఎవి గ్యాస్ 100 ఎల్ఎల్ ను దేశీయంగా ప్రారంభించడానికి ప్రయత్నాలు చేసిందని అన్నారు. ‘’ప్రధాన మంత్రి ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతలో భాగంగా ఐఒసిఎల్ ఎవి గ్యాస్ 100 ఫ్యూయెల్ తో ముందుకు వచ్చింది, దీనిని ఇప్పటి వరకు భారీ ఖర్చుతో దిగుమతి చేసుకున్నారు. మన అన్ని ఫ్లైట్ స్కూళ్లు, ఎవి గ్యాస్ 100 ఎల్ఎల్ ఉపయోగించే అన్ని ఇతర చిన్న విమానాలు దీనిని స్వదేశీ వనరుల నుండి కొనుగోలు చేయడం ద్వారా . డబ్బు ఆదా కు దోహద పడుతుంది. ఎ.వి. గ్యాస్ 100 ఎల్ఎల్ ఇంధనం అవసరమైన ప్రాంతాలకు, దేశాలకు ఎగుమతి చేసే విషయంలో ఇది మనకు చాలా వ్యత్యాసాన్ని కలిగిస్తుంది’’ అని ఆయన అన్నారు.
శ్రీ శ్రీకాంత్ మాధవ్ వైద్య, ఛైర్మన్, ఇండియన్ ఆయిల్ మాట్లాడుతూ, " రిఫైనింగ్ సామర్ధ్యం, అంతర్గత నైపుణ్యాన్ని ఉపయోగించుకోవడం ద్వారా ఈ ప్రత్యేకమైన ఇంధనాన్ని పరిచయం చేయడం ఇండియన్ ఆయిల్ కు గర్వకారణం
వాస్తవానికి దిగుమతి చేసుకున్న గ్రేడ్ లతో పోలిస్తే స్వదేశీ ఇంధనం మెరుగైనది. ఎ.వి. గ్యాస్ మార్కెట్ ప్రస్తుత 1.92 బిలియన్ డాలర్ల నుండి 2029 నాటికి 2.71 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా. దేశీయ డిమాండ్ ను తీర్చడంతో పాటు, ఎగుమతి అవకాశాలను లక్ష్యంగా చేసుకోవడానికి త్వరలో కొత్త సదుపాయాన్ని ఏర్పాటు చేయాలని మేము యోచిస్తున్నాము. మేము అందించే మెరుగైన నాణ్యత, పోటీ ధరలతో కలిపి, ప్రపంచ మార్కెట్లో మనకు గణనీయమైన స్థాయిని ఇస్తుందని , ఇంకా భారతదేశ స్వావలంబన ప్రయాణంలో ఒక కొత్త అధ్యాయాన్ని తెరుస్తుందని నేను విశ్వసిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.
ఆత్మనిర్భర్ భారత్ దిశగా అడుగు:
ప్రస్తుతం ఎవి గ్యాస్ 100 ఎల్ఎల్ పూర్తిగా దిగుమతి చేసుకుంటున్న ఉత్పత్తి. ఇండియన్ ఆయిల్ తన గుజరాత్ రిఫైనరీలో చేపట్టిన ఎవి గ్యాస్ 100 ఎల్ఎల్ ఉత్పత్తి భారతదేశంలో విమాన శిక్షణ లో వ్యయ భారాన్ని తగ్గిస్తుంది. ఎఫ్ టిఒలు ,రక్షణ దళాలు నడుపుతున్న విమానాలకు ఇంధనం అందించే ఈ ఉత్పత్తిని భారతదేశం దశాబ్దాలుగా దిగుమతి చేసుకుంటోంది. ఇండియన్ ఆయిల్ ఆర్ అండ్ డి , రిఫైనరీస్, మార్కెటింగ్ బృందాలు ఈ స్వదేశీ ఉత్పత్తి ఘనతను సాధించాయి. పరిశ్రమకు ధర ప్రయోజనాన్ని అందించాయి.
ఇండియన్ ఆయిల్: మార్పు కు సారధ్యం:
ఏవియేషన్ గ్యాసోలిన్ ప్రిన్సిపల్ గ్రేడ్, ఎవి గ్యాస్ 100 ఎల్ఎల్ అనేది టర్బో ఛార్జ్డ్ రిసిప్రొకేటింగ్ పిస్టన్ ఇంజిన్ల ఎయిర్ క్రాఫ్ట్ ల్లో ఉపయోగించడం కోసం డిజైన్ చేయబడింది, ఇది ప్రధానంగా పైలట్ లకు ట్రైనింగ్ ఇవ్వడం కోసం ఎఫ్ టి ఓలు , రక్షణ దళాల ద్వారా ఉపయోగించబడుతుంది.
వడోదరలోని ఇండియన్ ఆయిల్ ఫ్లాగ్ షిప్ రిఫైనరీ ద్వారా ఉత్పత్తి అయిన ఎవి గ్యాస్ 100 ఎల్ఎల్ ను భారతదేశంలో పౌర విమానయానాన్ని నియంత్రించే భారత ప్రభుత్వ చట్టబద్ధమైన సంస్థ అయిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) పరీక్షించి , ధృవీకరించింది. దిగుమతి చేసుకున్న గ్రేడ్ లతో పోలిస్తే, మెరుగైన పనితీరు నాణ్యతా ప్రమాణాలతో ఉత్పాదక ప్రామాణికాలను (ప్రొడక్ట్ స్పెసిఫికేషన్) చేరుకునే అధిక శక్తి గల విమాన ఇంధనం ఇది.
ఎవి గ్యాస్ 100 ఎల్ఎల్ దేశీయ లభ్యత దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి , సంబంధిత లాజిస్టిక్ సవాళ్లను పరిష్కరించడానికి సహాయపడుతుంది. ఈ ఉత్పత్తి స్థానిక లభ్యతతో దేశం విలువైన విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేయగలదు.
ఇది భారతదేశం అంతటా 35 కి పైగా ఎఫ్ టిఓ లకు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ ఉత్పత్తి దేశీయంగా అందుబాటులో ఉండటంతో, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ దేశంలో మరిన్ని శిక్షణా సంస్థలను తెరవాలని భావిస్తోంది. ఏవియేషన్ ట్రాఫిక్ లో పెరుగుదలతో శిక్షణ పొందిన పైలట్ల ఆవశ్యకత పెరుగుతుందని భావిస్తున్నారు.
*******
(Release ID: 1862314)
Visitor Counter : 209