రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

మరణించిన సాయుధ దళ సిబ్బంది కుటుంబాలను హిమాచల్ ప్రదేశ్ లోని బడోలీలో సన్మానించిన రక్షణ శాఖ మంత్రి


వీరులకు దేశం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుంది..రక్షణ శాఖ మంత్రి

ఎల్లపుడూ శాంతి కోరుకునే భారతదేశం యుద్దానికి భయపడుతుందని భావించడం పొరపాటు... శ్రీ రాజ్‌నాథ్ సింగ్

"స్నేహపూర్వక దేశాలకు భద్రతా భావాన్ని అందించడానికి, హద్దు మీరిన తగిన సమాధానం ఇవ్వడానికి ప్రభుత్వం 'నవ భారత 'ని నిర్మాణం జరుగుతోంది

Posted On: 26 SEP 2022 3:39PM by PIB Hyderabad

సాయుధ దళాల్లో పనిచేస్తూ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సిబ్బంది కుటుంబ సభ్యులను  రక్షణ శాఖ మంత్రి  శ్రీ రాజ్‌నాథ్ సింగ్ 2022 సెప్టెంబర్ 26న సన్మానించారు. హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్ర జిల్లా బడోలీలో సన్మాన కార్యక్రమం జరిగింది. విధి నిర్వహణలో అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించి ప్రతి భారతీయుని హృదయాల్లో సుస్థిర స్థానం సాధించి పరమ వీర చక్ర మొదటి గ్రహీత  మేజర్ సోమనాథ్ శర్మ (1947), మహా వీర్ చక్ర (1948) గ్రహీత  బ్రిగేడియర్ షేర్ జంగ్ థాపా,  లెఫ్టినెంట్ కల్నల్ ధన్ సింగ్ థాపా,   పరమ వీర చక్ర   (1962) గ్రహీత  కెప్టెన్ విక్రమ్ బాత్రా,   పరమ వీర చక్ర   (1999) గ్రహీత  సుబేదార్ మేజర్ సంజయ్ కుమార్ లకు రక్షణ శాఖ మంత్రి నివాళులు అర్పించారు. 

యుద్ధ వీరుల కుటుంబాలకు అంజలి ఘటించిన శ్రీ రాజ్‌నాథ్ సింగ్ వీర జవాన్ల త్యాగాలకు దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుందని అన్నారు. క్రమశిక్షణఅంకితభావందేశభక్తిత్యాగాలకు మారుపేరుగా నిలిచిన సాయుధ దళాలు ప్రజలకు ముఖ్యంగా యువతకు స్ఫూర్తిదాయకం గా ఉంటాయని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. సాయుధ దళాలకు నేపథ్యంమతం మత సిద్ధాంతాలు కాకుండా  త్రివర్ణ జాతీయ పతాకం గౌరవం ముఖ్యమైనది ," అని రక్షణ శాఖ మంత్రి పేర్కొన్నారు. 

ప్రపంచానికి శాంతి సందేశం ఇచ్చిన ఏకైక దేశం భారతదేశమని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. మన సాయుధ దళాల ధైర్య సాహసాలు ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందాయని అన్నారు. భారతదేశం ఏ దేశం పైన తనకు తాను  దాడి చేయలేదని పేర్కొన్న  శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అంగుళం  విదేశీ భూమిని స్వాధీనం చేసుకోలేదని స్పష్టం చేశారు. అయితేదేశంలో  సామరస్యానికి విఘాతం కలిగించే ప్రయత్నం చేసే వారికి  తగిన సమాధానం ఇస్తామని హెచ్చరించారు. భారతదేశం శాంతిని ప్రేమించే దేశం. అయితే అది పిరికితనంతో వ్యవహరిస్తుందని  లేదా యుద్ధానికి భయపడుతుందని తప్పుగా అర్ధం చేసుకోవద్దు.  మొత్తం ప్రపంచంతో పాటు కోవిడ్ -19 ని ఎదుర్కోవడానికి భారతదేశం ప్రయత్నిస్తున్న  సమయంలో చైనాతో ఉత్తర సరిహద్దులో ఉద్రిక్తత ఎదుర్కోవలసి వచ్చింది.అవతల ఉన్నది ఎంత పెద్ద శక్తి అయినా భారతదేశం ఎన్నటికీ తలవంచదు అన్న అంశాన్ని  గాల్వాన్ ఘటన వెల్లడించింది. మన సైనికుల ధైర్యం ముందు ఎంత పెద్ద శక్తి అయినా తలవంచాలి అని గాల్వాన్ ఘటన నిరూపించింది; ' అని ఆయన అన్నారు.

భారతదేశ ఐక్యత,సమగ్రతను దెబ్బ తీసేందుకు ప్రయత్నించే వారికి బుద్ధి చెప్పడానికి భారతదేశం ఉగ్రవాద నిరోధానికి  సరికొత్త వ్యూహం అనుసరిస్తుందని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఈ సందర్బంగా   శ్రీ రాజ్‌నాథ్ సింగ్ 2016 సర్జికల్ స్ట్రైక్స్ , 2019 బాలాకోట్ వైమానిక దాడులను ప్రస్తావించారు. “ఒక ప్రణాళిక ప్రకారం  పాకిస్తాన్‌లోని సరిహద్దు ఆవల నుంచి ఉగ్రవాద కార్యకలాపాలు ప్రారంభించింది. యూరి  మరియు పుల్వామా దాడుల తర్వాత మన ప్రభుత్వం మరియు సాయుధ దళాలు 2016 సర్జికల్ స్ట్రైక్స్ , 2019 బాలాకోట్ వైమానిక దాడులు నిర్వహించి  ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి భారతదేశం కట్టుబడి ఉందని ప్రపంచానికి స్పష్టం చేశాయి.  మన బలగాలు  ఇటువైపు మరియు అవసరమైతే  సరిహద్దుకు అవతలి వైపున పనిచేసే సామర్థ్యం ఉందని నిరూపించాయి. భారతదేశం వైఖరి మారింది.   అంతర్జాతీయ వేదికలపై భారతదేశ స్వరం గట్టిగా  వినబడుతుంది, ”అని రక్షణ శాఖ మంత్రి పేర్కొన్నారు. 

భారత దేశాన్ని బలోపేతం చేసి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆశిస్తున్న   ఆత్మ నిర్భర్ భారత్ సాధన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న చర్యలను  శ్రీ రాజ్‌నాథ్ సింగ్  ." ఇదివరకు భారతదేశం రక్షణ అవసరాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకునేది. ప్రస్తుతం రక్షణ ఎగుమతుల్లో ప్రపంచంలో మొదటి 25 దేశాల జాబితాలో భారతదేశం ఉంది. ఎనిమిది సంవత్సరాల కిందట 900 కోట్ల రూపాయలుగా ఉన్న రక్షణ ఎగుమతులు ప్రస్తుతం 13,000 కోట్ల రూపాయలకు చేరాయి. 2025  నాటికి రక్షణ ఎగుమతులు 35,000 కోట్ల రూపాయలకు చేరుతాయి. 2047  నాటికి 2.7 లక్షల కోట్ల రూపాయల విలువ చేసే రక్షణ ఎగుమతులు సాధించాలని లక్ష్యంగా నిర్ణయించుకుని పనిచేస్తున్నాము." అని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ వివరించారు. 

జాతీయ జాతీయ భద్రతను బలోపేతం చేయడానికి సంస్కరణలు అమలు జరుగుతున్నాయని  శ్రీ రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. దీనిలో భాగంగా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ పదవిని ఏర్పాటు చేసి,  మిలిటరీ వ్యవహారాల శాఖను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. “నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్‌డిఎ) లో  బాలికలను చేర్చుకోవడం ప్రారంభమయ్యింది. సాయుధ దళాల్లో మహిళలకు శాశ్వత కమిషన్ కల్పించాము. . యుద్ధనౌకలలో పనిచేయడానికి మహిళలకు అవకాశం వచ్చింది  ”అని ఆయన అన్నారుప్రభుత్వం 'నవ భారతదేశం 'నిర్మాణం దిశలో సాగుతున్నదని మంత్రి అన్నారు. ఇది మన శాంతిని ప్రేమించే పొరుగు దేశాలకు స్నేహ హస్తాన్ని అందిస్తుందని పేర్కొన్న శ్రీ రాజ్‌నాథ్ సింగ్ భారతదేశాన్ని చిన్న చూపు చూసే దేశాలకు బుద్ధి చెబుతుందని అన్నారు. 

సాయుధ దళాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగుతున్న భారతదేశం అభివృద్ధి పథంలో నడుస్తున్నదని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. యుద్ధ మేఘాలు కమ్ముకున్న సమయంలో దేశ రక్షణ కోసం సైనికులు దాడిని తిప్పి కొట్టి దేశ ప్రయోజనాలు రక్షిస్తారని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. సైనికులు ప్రదర్శించే ధైర్య సాహసాలుత్యాగాలు దేశ ప్రజల ప్రాణాలను రక్షిస్తాయని ఆయన వ్యాఖ్యానించారు. 

సరిహద్దు పరంగా హిమాచల్ ప్రదేశ్ భారతదేశానికి అతి ముఖ్యమైన ప్రాంతమని  శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. సరిహద్దు ప్రాంతాలలో నివసించే ప్రజలను వ్యూహాత్మక ఆస్తులుగా పేర్కొన్నారు. సరిహద్దు ప్రజల జీవన స్థితిగతులు  మెరుగుపరచడం  ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు.  సరిహద్దు మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంతోపాటు దేశంలో ఇంటెలిజెన్స్ మరియు కమ్యూనికేషన్ సామర్థ్యానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని  పేర్కొన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో వందల కిలోమీటర్ల మేర నిర్మించిన  రోడ్లువంతెనలుసొరంగాలుహిమాచల్‌ప్రదేశ్‌లోని అటల్‌ టన్నెల్‌ మెగా ప్రాజెక్టు దేనికి నిదర్శనమని   ఆయన వివరించారు. 

మాజీ సైనికులు దేశానికి అత్యంత విలువైన ఆస్తులని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అభివర్ణించారు.    మాతృభూమి సేవ చేసిన సైనికులు  త్యాగాలకు ఏ మాత్రం వెల కట్టలేమని రక్షణ  మంత్రి వర్ణించారు. అనుభవజ్ఞుల సంక్షేమం మరియు సంక్షేమం పట్ల ప్రభుత్వ నిబద్ధతతో పని చేస్తూ తన విధిని నిర్వర్తిస్తున్నదని  ఆయన అన్నారు.మాజీ సైనికుల  జీవన సౌలభ్యాన్ని పెంచేందుకు 'డిజిటల్ ఇండియాకింద ఆన్‌లైన్ సేవలతో సహా రక్షణ మంత్రిత్వ శాఖ తీసుకున్న చర్యలను ఆయన వివరించారు. స్మార్ట్ క్యాంటీన్ కార్డ్ఎక్స్-సర్వీస్‌మెన్ ఐడెంటిటీ కార్డ్,  కేంద్రీయ సైనిక్ బోర్డ్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ రీసెటిల్‌మెంట్ సర్వీసెస్‌కు ఆన్‌లైన్ సేవలు అందుబాటులో తేవడం,   సిస్టమ్ ఫర్ పెన్షన్ అడ్మినిస్ట్రేషన్ (రక్ష) (స్పర్ష్) లాంటి కార్యక్రమాలను ప్రభుత్వం ప్రారంభించిందని మంత్రి తెలిపారు. 

1971 యుద్ధంలో భారతదేశం సాధించిన విజయాన్ని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ గుర్తు  చేసుకున్నారు. ఆస్తిహక్కులు లేదా అధికారం కోసం కాకుండా  మానవత్వం కోసం జరిగిన యుద్ధంగా 1971 యుద్ధం చరిత్రలో గుర్తుండిపోతుంది అని  అన్నారు. . భారత్‌ను అద్భుత విజయాన్నీ అందించిన జనరల్ సామ్ మానెక్షాజనరల్ జగ్జిత్ సింగ్ అరోరాజనరల్ జాకబ్జనరల్ సుజన్ సింగ్ ఉబాన్ మరియు జనరల్ ఆఫీసర్ ఇన్ కమాండ్ ఎయిర్ మార్షల్ లతీఫ్‌ల పేర్లు ఎప్పటికీ మరచిపోలేను. యుద్ధంలో భారతీయ సైనికులుగా  హిందువులుముస్లింలుపార్సీలుసిక్కులు మరియు ఒక పాల్గొన్నారు.సర్వధర్మ సంభవం (అన్ని మతాల పట్ల గౌరవం) పట్ల భారతదేశానికి ఉన్న నమ్మకానికి ఇది నిదర్శనం. వీరందరూ వివిధ మాతృ భాషలతో వివిధ రాష్ట్రాలకు చెందిన వారు. అయితేభారతీయత అనే బలమైన భావనకు కట్టుబడి పని చేశారు అని  శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. 

 ***



(Release ID: 1862310) Visitor Counter : 135