ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

ఆయుష్మాన్ భారత్-పిఎంజేఎవై 4 సంవత్సరాలు మరియు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్‌ ఏడాది పూర్తి చేసుకున్న నేపథ్యాన్ని పురస్కరించుకుని ఆరోగ్య మంథన్ 2022ను ప్రారంభించనున్న డాక్టర్ మన్సుఖ్ మాండవియా


దేశవ్యాప్తంగా ఉన్న పిఎంజేఏవై లబ్ధిదారులతో కూడా సంభాషించనున్న డాక్టర్ మన్సుఖ్ మాండవియా

Posted On: 23 SEP 2022 1:43PM by PIB Hyderabad

ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి– జన్ ఆరోగ్య యోజన (ఏబి పిఎం-జేఎవై) అమలులోకి వచ్చి నాలుగు సంవత్సరాలు మరియు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ఎబిడిఎం) ఒక సంవత్సరం అమలును పురస్కరించుకుని సెప్టెంబర్ 25, 2022న “ఆరోగ్య మంథన్ 2022”ను కేంద్ర ఆరోగ్య & కుటుంబ సంక్షేమ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ మరియు నీతి ఆయోగ్ సభ్యులు (హెల్త్) డాక్టర్ వి. కె. పాల్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే రాష్ట్రాలు/యుటిల నుండి సీనియర్ ప్రభుత్వ అధికారులు కూడా హాజరవుతారు. రెండు రోజుల కార్యక్రమంలో అకాడెమియా, థింక్-ట్యాంక్‌లు, పరిశ్రమలు మరియు మీడియా ప్రతినిధులతో పాటు హెల్త్‌కేర్ సెక్టార్‌కు చెందిన గ్లోబల్ మరియు నేషనల్ ఎక్స్‌పర్ట్స్ పాల్పంచుకుంటారు.

 

దేశవ్యాప్తంగా ఉన్న ఎబి-పిఎంజెఎవై లబ్ధిదారులతో సంభాషించడం ద్వారా 23 సెప్టెంబర్ 2022న కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి వేడుకలను ప్రారంభిస్తారు.

 

23 సెప్టెంబర్ 2022 నాటికి ఏబి పిఎం-జేఎవై అమలులోకి వచ్చి నాలుగు సంవత్సరాలు పూర్తవుతుంది. అలాగే ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ఎబిడిఎం) మొదటి వార్షికోత్సవాన్ని 27 సెప్టెంబర్ 2022న జరుపుకోనుంది. వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 2022 సెప్టెంబర్ 15 నుండి 30వ తేదీ వరకు అన్ని రాష్ట్రాల్లో 'ఆయుష్మాన్ పఖ్వారా' రూపంలో పక్షం రోజుల పాటు జరుపుకుంటున్నారు. 'ఆయుష్మాన్ పఖ్వారా' కింద ఏబి పిఎం-జేఎవైలో పాల్గొనే 33 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు, ఆరోగ్య తనిఖీ శిబిరాలు మరియు పథకం లబ్ధిదారులకు ఆయుష్మాన్ కార్డుల పంపిణీకి మాస్ డ్రైవ్‌లను నిర్వహిస్తున్నాయి.

 

వినూత్న డిజిటల్ హెల్త్ సొల్యూషన్‌లకు సంబంధించి ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగానికి చెందిన ఆవిష్కర్తలను డిజి హెల్త్ ఎక్స్‌పో తీసుకువస్తుంది.

 

రెండు రోజుల కార్యక్రమంలో మొత్తం పన్నెండు సెషన్‌లు ఉంటాయి. అవి ఎజెండాకు చెందిన సమగ్ర జాబితాను కలిగి ఉంటాయి. మొదిటి రోజు భారత్‌ యూనివర్సల్ హెల్త్ కవరేజ్, డిజిటల్ హెల్త్‌లో ఇంటర్‌ఆపరబిలిటీని ప్రోత్సహించడం, పిఎం-జెఏవై సామర్థ్యాన్ని పెంపొందించడం, డిజిటల్ హెల్త్ అడాప్షన్, హెల్త్ టెక్నాలజీ అసెస్‌మెంట్ ఆఫ్ ఎవిడెన్స్ గురించి సమాచారం ఇవ్వబడిన పిఎం-జెఎవై నిర్ణయాలు మరియు డిజిటల్‌కు సంబంధించిన గోప్యత మరియు భద్రతా సమస్యలపై సెషన్‌లు ఉంటాయి. హెల్త్, ఎబిడీఎంని అమలు చేస్తున్న రాష్ట్రాల్లో ఉత్తమమైన పద్ధతులు, భారతదేశంలో డిజిటల్ ఆరోగ్య బీమా, రాష్ట్రాలవారీగా పిఎం-జెఏవై ఉత్తమ పద్ధతులు, డిజిటల్ ఆరోగ్యంలో అంతర్జాతీయ ఉత్తమ పద్ధతులు, పిఎం-జెఎవై, ఆరోగ్య సంరక్షణలో ప్రాప్యత, స్థోమత మరియు నాణ్యతను నిర్ధారించడం వంటి సెషన్‌లు రెండవరోజు ఉంటాయి.

 

ఎన్‌హెచ్‌ఏ ఆయుష్మాన్ ఉత్కృష్టత పురస్కార్ 2022 (ఆయుష్మాన్ ఎక్సలెన్స్ అవార్డ్స్)ను కూడా అందజేస్తుంది. ఎబి పిఎం-జెఏవైలో అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న రాష్ట్రాలు, పిఎంఏఎంలు(ప్రధాన మంత్రి ఆరోగ్య మిత్ర) మరియు ప్రభుత్వ ఆసుపత్రులు, ఉత్తమ పనితీరు కనబరుస్తున్న రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు,జిల్లాలో ఏబిడిఎం క్రింద ప్రైవేట్ & ప్రభుత్వ ఆరోగ్యం రంగంలో సౌకర్యాలు మరియు డిజిటల్ ఆరోగ్య పరిష్కారాలను సత్కరిస్తారు. ఏబిడిఎం హ్యాకథాన్ సిరీస్ రౌండ్ 1 విజేతలకు కూడా ఈ వేడుకలో బహుమతులు అందజేయబడతాయి.

 

****



(Release ID: 1861805) Visitor Counter : 222