నీతి ఆయోగ్
డెన్మార్క్‌లోని కోపెన్ హాగన్ లో ఐడిఎ ప్రపంచ వాటర్ కాంగ్రెస్ లో ఇండో -డానిష్ మంత్రుల సమావేశంలో
ఇండియాలో నగర వ్యర్థ జలాల పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల
Posted On:
14 SEP 2022 12:42PM by PIB Hyderabad
కేంద్ర జలశక్తి శాఖమంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్, డెన్మార్క్ పర్యావరణ శాఖ మంత్రి లీ వెర్మెలిన్, డవలప్‌మెంట్ కో ఆపరేషన్ మంత్రి ఫ్లెమింగ్ మోలర్ మోర్టన్‌సన్ , భారత ప్రతినిధి వర్గంతో కలసి సెప్టెంబర్ 12న డెన్మార్క్ లోని కోపెన్‌హాగన్‌లో ఇండియా ఇంటర్నేషనల్ వాటర్ అసోసియేషన్ (ఐడబ్ల్యుఎ) వరల్డ్ వాటర్ కాంగ్రెస్ , ఎగ్జిబిషన్ 2022 లో నగర వ్యర్ధ జలాల పరిస్తితిపై శ్వేతపత్రం విడుదల చేశారు.
భారతప్రభుత్వానికి సంబంధించి అటల్ ఇన్నొవేషన్ మిషన్ (ఎఐఎం), నీతి ఆయోగ్, జలశక్తి మంత్రిత్వశాఖ, నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా (ఎన్ ఎం సిజి), ఇంటర్నేషనల్ ఏజెనసీ ఇన్నొవేషన్ సెంటర్ డెన్మార్క్ (ఐసిడికె) అకాడెమియా ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆప్ టెక్నాలజీ బొంబాయి (ఐఐటిబి)లు నగర వ్యర్థజలాల నిర్వహణపై శ్వేతపత్రం రూపొందించేందుకు వివిధ విభాగాలతో ఒక బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వ్యర్థజలాల నిర్వహణకు సంబంధించి అన్ని విభాగాల ఆందోళనలను పరిగణనలోకి తీసుకున్న మీదట ఈ శ్వేతపత్రం రూపొందించడం జరిగింది. ఇది దేశంలో వ్యర్థ జలాల శుద్ధికి సంబంధించిన మొత్తం పరిస్థితిని వివరిస్తోంది. అలాగే భవిష్యత్తులో వ్యర్థ జలాల శుద్ధికి సంబంధించిన నిర్మాణాలు, కొలాబరేషన్ల గురించి చర్చిస్తోంది.
ఎఐఎం, నీతిఆయోగ్, ఐసిడికె, ఎన్‌సిఎంజి, ఐఐటి బొంబాయికి చెందిన నిపుణులు ఈ సమాచారాన్ని పరిశీలించి రూపొందించిన శ్వేతపత్రంలో కొన్ని విజయగాథలను కూడా ముఖ్యంగా పేర్కొన్నారు. వ్యర్థజలాల శుద్ధి, వ్యర్థజలాల మెరుగుకు అవకాశం, ప్రస్తుత మౌలిక సదుపాయాలు, సాంకేతికత మెరుగుదల, పబ్లిక్ పార్టిసిపేటరీ విధానాలు, ఫైనాన్సింగ్, సహ ఫైనాన్సింగ్ అవకాశాలు, సత్వర డాటా సేకరణకు స్మార్ట్ టెక్నాలజీలు, సామర్ధ్యాల నిర్వహణ , శిక్షణ, ఇండియాలో నగర వ్యర్థజలాల శుద్ధికి సంబంధించి ఉన్నత స్థాయి సంస్థల సామర్ధ్యం పెంపు వంటి అంశాలను ఈ శ్వేతపత్రంలో ప్రస్తావించారు.
ఈ శ్వేతపత్రం హరిత వ్యూహాత్మక భాగస్వామ్యం ఫలితంగా రూపుదిద్దుకున్నది. గ్రీన్ హైడ్రోజన్, పునరుత్పాదక ఇంధనం, ఇండియా, డెన్మార్క్ ల మధ్య వ్యర్థజలాల నిర్వహణ,ద్వైపాక్షిక సంబంధాలపై దృష్టితో ఈ శ్వేతపత్రం రూపుదిద్దుకుంది.
ఈ శ్వేతపత్రం విడుదల సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర జలశక్తి శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ , సంపూర్ణ నీటి యాజమాన్యానికి సంబంధించిన ప్రాధాన్యతను గుర్తించిన మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ , నీటికి సంబంధించిన వివిధ కార్యకలాపాలను జలశక్తి మంత్రిత్వశాఖ పేరుతో 2019లో ఒకే గొడుగుకిందికి తీసుకువచ్చారు. ఇది దేశంలో నీటి యాజమాన్యానికి సంబంధించి గొప్ప సమన్వయానికి వీలుకల్పించిందని నీటి రంగంలో 2024నాటికి 140 బిలియన్ అమెరికన్‌డాలర్లు అంతకంటే ఎక్కువ పెట్టుబడులను పెట్టేందుకుతాము కట్టుబడి ఉన్నామని మంత్రి చెప్పారు. ప్రభుత్వం పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడంతోపాటు కమ్యూనిటీ ఆధారిత విధానాన్ని కూడా తాము చేపట్టినట్టు ఆయన చెప్పారు. దీనిద్వారా ప్రతి కార్యక్రమంలో కనీసం పదిశాతం నిధులను కమ్యూనిటీ ద్వారా సమకూర్చుకుంటారు. దీనివల్ల కమ్యూనిటీ యాజమాన్యం, భాగస్వామ్యానికి వీలు కలుగుతుంది.ఇదిలా ఉండగా, నీతిఆయోగ్ వాటర్ వర్టికల్ సలహాదారు, శ్రీ అవినాశ్‌మిశ్ర ఇండియాలో నగరాల వ్యర్థ జలాల పరిస్థితిపై విడుదలైన శ్వేతపత్రంపై చర్చిస్తూ, ఈ శ్వేతపత్రం భారతదేశంలోని వ్యర్థజలాల రంగంలో పరిస్థితిని స్పష్టంగా ఆవిష్కరిస్తోందని అన్నారు. అయితే ఇది ప్రపంచవ్యాప్తంగా సమాంతర పరిస్థితిలో ఉంది. భారతదేశ ప్రాచీన నాగరికత ప్రపంచమంతా ఒకే కుటుంబమన్న భావన కలిగిఉంది. ఉమ్మడి అంశాలకు సంబంధించి పరిష్కారాన్ని కనుగొనడంలో మనిషి నిర్మించిన అడ్డుగోడలను అధిగమించి ముందుకు పోవాలని సూచిస్తోంది. ఈ సమస్యకు ఉమ్మడి అంతర్జాతీయ ఆలోచనలు, స్థానికంగా తీసుకునే చర్యలు ఈ సమస్యను వ్యూహాత్మకంగా ఎ దుర్కొనడానికి పనికి వస్తాయి. లేదా ఇది నగర వ్యర్థజలాల నిర్వహణలో ఒక అవకాశాన్ని కలిగిస్తుంది. నగరాలు స్మార్ట్ నగరాలుగా మారుతున్నవేళ నీటి నిర్వహణకు సంబంధించిన అంశాలు వెనకపట్టు పట్టడానికి వీలులేదని అన్నారు.
***
(Release ID: 1861804)
Visitor Counter : 163