వ్యవసాయ మంత్రిత్వ శాఖ

2022-23 రబీ సీజన్ కు పప్పుధాన్యాలు, నూనెగింజల విత్తన మినీకిట్లను సకాలంలో పంపిణీ చేయడం ద్వారా పప్పుధాన్యాలు, నూనెగింజల ఉత్పత్తిని పెంచడానికి కేంద్రం చర్యలు


2022 ఖరీఫ్ లో తక్కువ/లోటు వర్షపాతం ఉన్న ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్ తో పాటు మధ్యప్రదేశ్ ,పశ్చిమ బెంగాల్ లో కొన్ని

ప్రాంతాలకు అందనున్న విత్తన కిట్ లు

Posted On: 22 SEP 2022 4:06PM by PIB Hyderabad

విత్తనం అనేది సంపూర్ణ సాంకేతిక పరిజ్ఞానం. పంటల ఉత్పాదకతను 20-25% పెంచే సామర్థ్యాన్ని కలిగి ఉంది. వ్యవసాయానికి మంచి విత్తనాల లభ్యత ఉత్పత్తి, ఉత్పాదకతను పెంచుతుంది, దీని ఫలితంగా రైతులకు అధిక ఆదాయం లభిస్తుంది, తద్వారా వ్యవసాయ పర్యావరణ వ్యవస్థకు,  దేశ ఆర్థిక వ్యవస్థకు మొత్తం మీద ప్రయోజనం చేకూరుతుంది. కొన్ని రాష్ట్రాలలో అస్తవ్యస్తమైన, లోటు వర్షపాతం కారణంగా, రబీ పంటలను ముఖ్యంగా పప్పుధాన్యాలు,  నూనెగింజలను ముందస్తుగా నాటాల్సిన అవసరం ఏర్పడింది.

2022-23 రబీలో, విత్తనాలను యధావిధిగా పంపిణీ చేయడమే కాకుండా, రాష్ట్రాల్లోని వర్షపాత లోటు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని పప్పుధాన్యాలు ,నూనెగింజల విత్తన మినీ కిట్లను అందించడంపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ మినీ కిట్లను నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ (ఎన్ ఎస్ సి), నాఫెడ్ వంటి కేంద్ర సంస్థలు అందిస్తున్నాయి వీటికి పూర్తిగా నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ ద్వారా భారత ప్రభుత్వం నిధులు సమకూరుస్తోంది.

ఈ క్రింది లక్ష్యాలతో కొత్తగా విడుదల చేసిన అధిక దిగుబడినిచ్చే వంగడాల విత్తనాలను రైతులకు పంపిణీ చేయడానికి భారీ విత్తన మినికిట్ కార్యక్రమానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది:

ఉత్పత్తి , ఉత్పాదకతను పెంచడానికి రైతులలో తాజా పంట రకాలను ప్రాచుర్యంలోకి తీసుకురావడం;

ఖరీఫ్, 2022లో వర్షపాతం తక్కువగా/లోటు ఉన్న ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాలతో పాటు  మధ్యప్రదేశ్ , పశ్చిమ బెంగాల్ లో కొన్ని ప్రాంతాలకు పప్పుధాన్యాలు నూనెగింజల విత్తన మినీకిట్ లను పంపిణీ చేయడం;

మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో రేప్ సీడ్,  ఆవాలు (ఆర్ అండ్ ఎం) పంటల కోసం సంప్రదాయేతర ప్రాంతాన్ని కవర్ చేయడం;

తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక వంటి దక్షిణాది రాష్ట్రాల కోసం ప్రధాన రబీ నూనెగింజలు -   వేరుశెనగ ను,  ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్ , రాజస్థాన్ లలో అవిసె గింజలు , మహారాష్ట్ర, కర్ణాటక తెలంగాణల్లో కుసుమ వంటి చిన్న నూనెగింజలను పంపిణీ చేయడం.

పప్పుధాన్యాల ఉత్పత్తిని  ప్రోత్సహించడానికి, 2022-23లో 11 రాష్ట్రాలకు ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్ (1,11,563), జార్ఖండ్ (12,500) , బీహార్ (12,500) వంటి రాష్ట్రాల్లోని వర్షపాత లోటు ప్రాంతాలలో ముందస్తుగా నాటాలనే లక్ష్యంతో 4.54 లక్షల పప్పులు, ఉర్ద్ మినీకిట్లను, 4.04 లక్షల పప్పు విత్తన మినీ కిట్ లను కేటాయించింది, ఇది మొత్తం కేటాయింపుల్లో 33.8%, ఈ మూడు వర్షపాత లోటు రాష్ట్రాలకు గత ఏడాది కంటే 39.4% అధికం.

ప్రభుత్వం 2022-23 నుంచి ' తుర్ మసూర్  ఉరద్ - 370' ((టి  ఎం  యు-370) అనే ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా అమలు చేస్తోంది, దీని ద్వారా మసూర్ పరిధిలోని 120 జిల్లాలు ఉరద్ పరిధిలోని 150 జిల్లాలను పప్పుధాన్యాల పంటల ఉత్పత్తి ,ఉత్పాదకతను పెంచడానికి లక్ష్యంగా

 పెట్టుకుంది.  ఈ జిల్లాలలో గరిష్ట

ప్రాంతాల ఏకీకరణను ధృవీకరించడం ద్వారా.

కార్యక్రమం అమలు జరుగుతుంది.

రూ.39.22 కోట్ల విలువ చేసే 8.3 లక్షల విత్తన మినీకిట్లను పంపిణీ చేయడం ద్వారా నూనెగింజల పంటలు  ప్రోత్సహించ బడుతున్నాయి. అవి రూ. 10.93 కోట్ల విలువ కలిగిన 575000 మినీకిట్లు, వేరుశనగ (రూ. 16.07 కోట్ల విలువ కలిగిన 70500 మినీకిట్లు), సోయాబీన్ (రూ. 11.00 కోట్ల విలువ కలిగిన 125,000 మినీకిట్లు), పొద్దు తిరుగుడు (రూ. 0.65 కోట్ల విలువ గల 32500 మినీకిట్లు) , అవిసె గింజలు (రూ. 0.57 కోట్ల విలువ కలిగిన 26000 మినీకిట్లు) రైతులకు నేరుగా ఉచితంగా అందుతాయి.

రబీ 2021-22 ప్రత్యేక ఆవాల మిషన్ ను ప్రభుత్వం అమలు చేసింది, దీని ఫలితంగా పంట విస్తీర్ణం 20% , ఉత్పత్తి 15% పెరిగింది.

ఈ ఏడాది (2022-23) ప్రత్యేక కార్యక్రమంగా 18 రాష్ట్రాల్లోని 301 జిల్లాల్లో రూ.50.41 కోట్ల విలువ చేసే 2653183 రాప్సీడ్, ఆవాలు మినీకిట్లను పంపిణీ చేసేందుకు ఆమోదం తెలిపింది.

2014-15 సంవత్సరం నుండి నూనెగింజలు, పప్పుధాన్యాల ఉత్పత్తిని పెంచడంపై దృష్టి p

పెంచారు. ఈ ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇచ్చాయి. నూనెగింజల ఉత్పత్తి 2014-15లో 27.51 మిలియన్ టన్నుల నుంచి 2021-22 నాటికి 37.70 మిలియన్ టన్నులకు (4వ ముందస్తు అంచనా) పెరిగింది. పప్పుధాన్యాల ఉత్పత్తి కూడా ఇదే విధమైన పెరుగుదల తున్న ధోరణిని చూపించింది. విత్తన మినీకిట్స్ కార్యక్రమం రైతుల పొలాల్లో కొత్త రకాల విత్తనాలను ప్రవేశపెట్టడానికి ఒక ప్రధాన సాధనం . విత్తన మార్పిడి రేటును పెంచడానికి కూడా ఇది కీలక పాత్ర పోషిస్తుంది.

పప్పుధాన్యాలు ,నూనెగింజల ఉత్పాదకత గత మూడు సంవత్సరాలలో గణనీయంగా పెరిగింది. పప్పుధాన్యాల విషయంలో ఉత్పాదకత హెక్టారుకు 727 కిలోలు /హెక్టారు (2018-19) నుండి హెక్టారుకు 980 కిలోలకు ( 4వ ముందస్తు అంచనా2021-22) అంటే 34.8% పెరిగింది. అదేవిధంగా, నూనెగింజల పంటల్లో ఉత్పాదకత హెక్టారుకు 1271 కిలోలు (2018-19) నుండి హెక్టారుకు 1292 కిలోలకు ( 4వ ముందస్తు అంచనా2021-22) పెరిగింది.

నూనెగింజలు ,పప్పుధాన్యాల ఉత్పత్తిని పెంచడం ,తద్వారా ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని నెరవేర్చడంపై ప్రభుత్వం ప్రాధాన్యత గా ఉంది. ఇందుకు ఏరియా విస్తరణ, హెచ్ వై వి ల ద్వారా ఉత్పాదకత,  ఎం  ఎస్  పి మద్దతు, సేకరణ ద్వారా ఉత్పత్తిని పెంచడం అనే వ్యూహాలను రూపొందించింది.

<><><><><>



(Release ID: 1861617) Visitor Counter : 180