రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భాగ‌స్వామ్య ప‌క్షాల మధ్య సహకారం, సమన్వయం, కమ్యూనికేషన్ ద్వారా లాజిస్టిక్స్ వ్య‌యాన్ని 14 - 16% నుండి 10% వరకు తగ్గించాలి: శ్రీ నితిన్ గడ్కరీ

Posted On: 20 SEP 2022 4:25PM by PIB Hyderabad

భాగ‌స్వామ్య ప‌క్షాల మధ్య సహకారం, సమన్వయం మరియు కమ్యూనికేషన్‌తో లాజిస్టిక్స్  వ్య‌యాన్ని14 - 16% నుండి 10% వరకు తగ్గించాలని కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ ఉద్ఘాటించారు. ‘క్లైమేట్ గోల్స్: టెక్నలాజికల్ రోడ్‌మ్యాప్ టు నెట్ జీరో’ కార్యక్రమంలో ప్రసంగించిన ఆయ‌న‌ లాజిస్టిక్స్ వ్యయాన్ని తగ్గించడం ద్వారా వ్య‌యాన్ని గొప్పగా ఆదా చేయ‌వ‌చ్చ‌ని తెలిపారు, దీని ద్వారా ఎగుమతుల్లో 50% పెరుగుదల సాధించవచ్చని, ఇది మన ఆర్థిక వ్యవస్థకు చాలా ముఖ్యమైనదని అన్నారు. ఇంధ‌న కాలుష్యం గురించి మాట్లాడుతూ మనం 16 లక్షల కోట్ల శిలాజ ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటున్నామని, దీని వల్ల చాలా కాలుష్యం ఏర్పడుతోందన్నారు. ప్రయాణ సమయాన్ని తగ్గించడానికి డిసెంబ‌రు చివరి నాటికి 27 గ్రీన్ ఎక్స్‌ప్రెస్ హైవేలను రూపొందించడానికి నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు డిసెంబరు నెల‌లో ఢిల్లీ నుండి చండీగఢ్‌కు 2 1/2 గంటలు, ఢిల్లీ నుండి అమృత్‌సర్‌కు 4 గంటలు, ఢిల్లీ నుండి కత్రా 6 గంటలు, ఢిల్లీ నుండి శ్రీనగర్‌కు 8 గంటలు మరియు ఢిల్లీ నుండి ముంబైకి 12 గంటలు, ఢిల్లీ నుండి జైపూర్ మరియు ఢిల్లీ నుండి జైపూర్ వరకు కు 12 గంటల‌లో ప్ర‌యాణం చేసేలా  కొత్త రహదారులు అందుబాటులోకి రానున్నాయ‌ని వివ‌రించారు. భారతదేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడానికి ప్రధానమంత్రి దృష్టిని సాధించడానికి సాంకేతికత, ఆవిష్కరణలు మరియు పరిశోధనలు చాలా ముఖ్యమైనవి అని మంత్రి వివ‌రించారు. ఏఐఎంఏ యొక్క 49వ జాతీయ మేనేజ్‌మెంట్ కన్వెన్షన్ - 'అడ్వాంటేజ్ ఇండియా: న్యూ వరల్డ్ ఆర్డర్‌లో వృద్ధి చెందుతోందిస‌ అని  శ్రీ నితిన్ గడ్కరీ ప్రసంగిస్తూ కేంద్రం, రాష్ట్రాలు ఒక బృందంగా కలిసి పని చేస్తూ ప్రజా రవాణా విష‌యం గాను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అన్నారు. యువ మరియు ప్రతిభావంతులైన ఇంజినీరింగ్ సిబ్బంది, నైపుణ్యం కలిగిన మేటి శ్రామిక శక్తి మరియు తక్కువ కార్మిక వ్యయంతో భారతదేశానికి భారీ దేశీయ మార్కెట్ ఉందని మంత్రి అన్నారు. వ్యవసాయాన్ని ఇంధనం మరియు విద్యుత్తు రంగంలో వైవిధ్యపరచడం మరియు బయో ఇథనాల్, ఎల్‌ఎన్‌టీ మరియు బయో సీఎన్‌జీ వంటి ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగం ఆవ‌శ్య‌క‌త‌ను ఆయన నొక్కి చెప్పారు. నైతికత, ఆర్థిక వ్యవస్థ, జీవావరణ శాస్త్రం మరియు పర్యావరణం ఈ మూడు సమాజానికి ముఖ్యమైన మూలస్తంభాలని మంత్రి అన్నారు.
                                                                               

****


(Release ID: 1861106) Visitor Counter : 120