రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రపంచ రసాయనాలు మరియు ఎరువుల మార్కెట్‌కు నాయకత్వం వహించడానికి భారత్‌కు స్వంత నమూనాను రూపొందించాలని రసాయనాలు,ఎరువులశాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా పిలుపునిచ్చారు


'మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్' అనే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా కెమికల్స్ అండ్ మెట్రోకెమికల్స్ రంగం భారతదేశాన్ని ప్రపంచ తయారీ హబ్‌గా మార్చగలదు: డాక్టర్ మన్సుఖ్ మాండవియా

భారత రసాయన మరియు పెట్రోకెమికల్ పరిశ్రమ దేశ వృద్ధిని పెంచడంలో గణనీయమైన పాత్రను పోషించే భారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది: శ్రీ భగవంత్ ఖుబా

Posted On: 20 SEP 2022 3:42PM by PIB Hyderabad

'మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్' అనే ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికకు అనుగుణంగా  కెమికల్స్ మరియు పెట్రోకెమికల్స్ రంగం భారతదేశాన్ని గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా మార్చగలదని కెమికల్స్ అండ్ పెట్రోకెమికల్స్ అడ్వైజరీ ఫోరమ్ మూడో సమావేశంలో కేంద్ర రసాయనాలు, ఎరువులు మరియు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా తెలిపారు. ఈ కార్యక్రమంలో కెమికల్ & ఫెర్టిలైజర్స్ శాఖ సహాయ మంత్రి భగవంత్ ఖూబా కూడా పాల్గొన్నారు.

image.png


ఈ సందర్భంగా డాక్టర్ మన్సుఖ్ మాండవియా ప్రసంగిస్తూ..దేశ వృద్ధిని పెంచడంలో భారత రసాయన,పెట్రో రసాయన పరిశ్రమ గణనీయమైన పాత్రను పోషించగలదని పేర్కొన్నారు. ఈ రంగంలో ప్రపంచ మార్కెట్‌ను నడిపించడానికి భారతదేశం తన స్వంత నమూనాను రూపొందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ మేరకు  భవిష్యత్ వ్యూహాన్ని రూపొందించాలని కంపెనీలు మరియు అడ్వైజరీ ఫోరమ్‌ను ఆయన కోరారు. "ఇది ప్రపంచ డిమాండ్లు మరియు పరిశ్రమల అవసరాలతో సమకాలీకరించబడుతుంది. భారతదేశానికి సవాలును అధిగమించే సామర్థ్యం ఉంది; ఫలితాలపై దృష్టి కేంద్రీకరించే వ్యూహం అవసరం" అని చెప్పారు.
 

image.png

 

"స్వంత దేశీయ డిమాండ్‌ను మరియు గ్లోబల్ డిమాండ్‌ను కూడా తీర్చే దిశగా భారత్‌ను తీసుకెళ్లడానికి కార్యాచరణ పాయింట్‌లను గుర్తించడంతో పాటు సంప్రదింపులు, నిర్ణయాల తయారీలో మన స్వంత నమూనాను రూపొందించుకుందాం" అని డాక్టర్ మాండవ్య హైలైట్ చేశారు. ఈ రంగంలో దేశీయ అవసరాలను తీర్చే పరిశోధన, అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పరిశ్రమ మరియు విద్యాసంస్థలను కూడా ఆయన కోరారు.  ఎంఎస్ఎంఈ వంటి రంగాల సవాళ్లు మరియు అవసరాలను తీర్చడానికి ఆర్‌&డిని లక్ష్యంగా చేసుకున్నాము' అని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో శ్రీ భగవంత్ ఖూబా ప్రసంగిస్తూ..పరిశ్రమలకు అనుకూలమైన ప్రభుత్వ విధానాలను, దేశంలో సులభతరమైన వ్యాపారం కోసం చేపట్టిన పలు కార్యక్రమాలను హైలైట్ చేశారు. భారతదేశం ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ అని పేర్కొన్న ఆయన.. భారతీయ రసాయన మరియు పెట్రోకెమికల్ పరిశ్రమలకు  అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని అలాగే దేశ వృద్ధిని పెంచడంలో గణనీయమైన పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.

కార్యక్రమంలో అడ్వైజరీ ఫోరమ్ సమర్పించిన పెట్రోకెమికల్స్‌పై  ప్రణాళిక చర్చించబడింది. 'పరిశ్రమ ల్యాండ్‌స్కేప్‌ను అర్థం చేసుకోవడం'పై రూపొందించిన నివేదిక కూడా  విడుదల చేశారు..

దేశంలో కెమికల్, పెట్రోకెమికల్ రంగ వృద్ధిని ప్రభావితం చేసే అవరోధాలను గుర్తించడానికి, విధానపరమైన జోక్యాల ద్వారా పరిశ్రమ వృద్ధిని సులభతరం చేయడానికి 10 జూలై 2019న  రసాయనాలు&పెట్రోకెమికల్ రంగ సలహా ఫోరమ్ ఏర్పాటు చేయబడింది. ఇతర మంత్రిత్వ శాఖల సమన్వయంతో పరిష్కరించబడే సమస్యలను లేవనెత్తడానికి పరిశ్రమ సంఘాలకు ఒక వేదికను అందించడం ఈ అడ్వైజరీ ఫోరమ్ పాత్ర. పాలసీలను రూపొందించడానికి మరియు ఈ రంగంలో దేశాన్ని 'ఆత్మనిర్భర్‌'గా మార్చడానికి కొత్త చొరవలను తీసుకోవడానికి వాటాదారులకు వారి ఇన్‌పుట్‌లను అందించడానికి ఇది అవకాశాన్ని అందిస్తుంది. ఈ 'సలహాల వేదిక'లో పరిశ్రమ సంఘాలు, విద్యాసంస్థలు, సిఎస్‌ఐఆర్‌ ప్రయోగశాలలు, పిఎస్‌యులు, రాష్ట్రాల ప్రతినిధులు సభ్యులుగా ఉన్నారు. కేంద్ర రసాయనాలు,ఎరువుల శాఖ మంత్రి అధ్యక్షతన ఈ ఫోరమ్ పనిచేస్తుంది.


 

****


(Release ID: 1860992) Visitor Counter : 153