సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీకి అందించిన 1200కు పైగా ప్రతిష్టాత్మకమైన, చిరస్మరణీయమైన జ్ఞాపికలు మరియు బహుమతుల ఇ-వేలం రేపటి నుండి ప్రారంభం;
అక్టోబర్ 2, 2022 వరకు కొనసాగనున్న ఇ-వేలం పాట
నమామి గంగే ప్రాజెక్టు కోసం తనకు అందిచిన జ్ఞాపికలు అన్నివేలం వేయాలని నిర్ణయించుకున్న భారతదేశ మొట్టమొదటి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ: శ్రీ జి.కిషన్ రెడ్డి
Posted On:
16 SEP 2022 2:43PM by PIB Hyderabad
సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీకి అందిన ప్రతిష్టాత్మక, చిరస్మరణీయ జ్ఞాపికలు/ బహుమతుల ఇ-వేలం నాలుగో ఎడిషన్‌ను నిర్వహిస్తోంది. ఇది 17 సెప్టెంబర్ న ప్రారంభమై అక్టోబర్ 2, 2022 వరకు ఆన్‌లైన్ వేదికగా కొనసాగనుంది.
కేంద్ర సాంస్కృతిక, పర్యాటక మరియు ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి 17వ తేదీన ప్రారంభం కానున్న ఇ- వేలం గురించి వివరించారు. సాంస్కృతిక, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ అర్జున్ రామ్ మేఘవాల్ మరియు సాంస్కృతిక, విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీమతి మీనాక్షి లేఖి ఈ సమావేశంలో ఉన్నారు.
కేంద్ర సాంస్కృతిక, పర్యాటక మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి మాట్లాడుతూ, “2019లో ఈ వస్తువులను ప్రజల కోసం బహిరంగ వేలం వేయడం జరిగింది. ఆ సమయంలో మొదటి రౌండ్‌లో 1805 బహుమతులు, రెండవ రౌండ్‌లో 2772 బహుమతి వస్తువులను వేలానికి ఉంచారు. 2021లో, సెప్టెంబర్‌లో 1348 వస్తువులతో ఇ-వేలం నిర్వహించబడింది. ఈ ఏడాది సుమారు 1200 జ్ఞాపికలు, బహుమతి వస్తువులను ఈ-వేలంలో ఉంచారు. దిల్లీలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్‌లో మెమెంటోల ప్రదర్శన జరిగింది. ఈ వస్తువులను వెబ్‌సైట్‌లో కూడా చూడవచ్చు”.
వేలంలో ఉన్న జ్ఞాపికల్లో సృజనాత్మక పెయింటింగ్‌లు, శిల్పాలు, హస్తకళలు మరియు జానపద కళాఖండాలు ఉన్నట్లు కేంద్రమంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి తెలిపారు. వీటిలో సంప్రదాయ అంగవస్త్రాలు, శాలువాలు, తలపాగాలు, ఉత్సవ కత్తులు వంటి బహుమతులుగా అందించబడే వస్తువులు కూడా ఉన్నట్లు తెలిపారు. అయోధ్యలోని శ్రీరామ మందిరం మరియు వారణాసిలోని కాశీ-విశ్వనాథ దేవాలయం యొక్క ప్రతిరూపాలు మరియు నమూనాలు ఆసక్తిని కలిగించే ఇతర జ్ఞాపికల్లో ఉన్నట్లు తెలిపారు. వివిధ క్రీడాకారులు గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి అందించిన పలు ఉత్తేజకరమైన జ్ఞాపికలు ఈ వేలంలో ఉన్నట్లు తెలిపారు. 2022 లో నిర్వహించిన కామన్వెల్త్ క్రీడలు, డెఫ్లింపిక్స్ 2022 మరియు థామస్ కప్ ఛాంపియన్‌షిప్ 2022లో భారత జట్టు అద్భుత ప్రదర్శన చేసి చరిత్రలో స్థానం సాధించిపెట్టిందని కేంద్ర మంత్రి అన్నారు. క్రీడా జట్లు మరియు క్రీడా కార్యక్రమాల విజేతలు సమర్పించిన జ్ఞాపికలు వేలంలో ఉన్నయని ఆయన అన్నారు. ఈ వేలంలో 25 కొత్త క్రీడా జ్ఞాపికలు ఉన్నాయని మంత్రి వెల్లడించారు.
నమామి గంగే ద్వారా దేశం యొక్క జీవనాడి అయిన గంగా నదిని పరిరక్షించే గొప్ప ఉద్దేశ్యం కోసం గౌరవ ప్రధానమంత్రి తనకు లభించే బహుమతులన్నింటినీ వేలం వేయాలని నిర్ణయించట్లు కేంద్రమంత్రి తెలిపారు. ఇలాంటి నిర్ణయం తీసుకున్న భారత మొట్టమొదటి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ప్రతి ఒక్కరూ వేలంలో పాల్గొని గొప్ప మిషన్‌కు సహకరించాలని ఆయన ప్రజలను కోరారు.
"గత వేలంపాటలో దేశంలోని ప్రతి ప్రాంతం నుండి ప్రజలు చురుకుగా పాల్గొన్నట్లు ఈ సందర్భంగా శ్రీ అర్జున్ రామ్ మేఘ్‌వాల్ తెలిపారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీకి అందజేసిన ప్రతిష్టాత్మకమైన, చిరస్మరణీయమైన జ్ఞాపికల వేలంలో ఈ ఏడాది కూడా పాల్గొనాలని ప్రజలను మంత్రి కోరారు.
కేంద్రమంత్రి శ్రీమతి మీనాక్షి లేఖి మాట్లాడుతూ, ప్రధానమంత్రికి అందించిన వివిధ జ్ఞాపికల ప్రాముఖ్యతను, నమామి గంగే ప్రాజెక్టుకు ఈ వేలం పాటలో పాల్గొనడం ద్వారా అందించే సహకారాన్ని వివరించారు.
సందర్శనను మరింత సులభతరంగా మార్చేందుకు, సాధారణంగా గైడెడ్ టూర్లు మరియు వినికిడి లోపం ఉన్నవారి కోసం సంకేత భాషలో గైడెడ్ టూర్లు ఏర్పాటు చేయబడ్డాయి. దృష్టిలోపం ఉన్నవారి కోసం బ్రెయిలీలో కేటలాగ్‌లు కూడా అందుబాటులో ఉంచబడ్డాయి. ప్రదర్శన ప్రాంతం 17 సెప్టెంబర్ నుండి అక్టోబర్ 2 వరకు ప్రజలందరికీ ఉచితంగా అందుబాటులో ఉంటుంది. వేలం ద్వారా సేకరించిన మొత్తాన్ని జాతీయ నది అయిన గంగా నదిని పరిరక్షించడానికి, పునరుజ్జీవింపజేయడానికి ఉద్దేశించిన ప్రతిష్టాత్మక కార్యక్రమం అయిన నమామి గంగే కార్యక్రమానికి ఉపయోగించనున్నారు.
సాధారణ ప్రజలు ఇ-వేలంలో కింది లింక్‌లో లాగిన్ అవ్వడం/ నమోదు చేసుకోవడం ద్వారా పాల్గొనవచ్చు-
https://pmmementos.gov.in
******
(Release ID: 1859860)
Visitor Counter : 207