రక్షణ మంత్రిత్వ శాఖ
వైడి 12653 (తరగిరి) ప్రారంభం
Posted On:
12 SEP 2022 9:12AM by PIB Hyderabad
ఎండిఎల్ నిర్మిస్తున్న పి 17 ఎకు చెందిన ఐదవ స్టెల్త్ ఫ్రిగేట్ ( రహస్య యుద్ధనౌక)ను ఆదివారం నాడు ఎన్‌డబ్ల్యుడబ్ల్యు (పశ్చిమ ప్రాంతం) అధ్యక్షురాలు శ్రీమతి చారు సింగ్ ప్రారంభించారు. ఈ నౌకకు తరగిరి అని నామకరణం చేశారు. కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ 11 సెప్టెంబర్ 2022ను అధికారిక సంతాపదినంగా జారీ చేసిన నోటిఫికేషన్‌కు అనుగుణంగా ఈ కార్యక్రమం కేవలం సాంకేతిక ప్రారంభంగా ప్రారంభించారు. ఇది సముద్రపు ఆటుపోట్లపై ఆధారపడిన అంశం కావడంతో ఈ కార్యక్రమంలో మార్పు సాధ్యం కాదు. ఈ కార్యక్రమానికి పశ్చిమ నావల్ కమాండ్‌కు చెందిన ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ వైస్ అడ్మిరల్ అజేంద్ర బహదూర్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరవ్వగా, యుద్ధనౌకల ఉత్పత్తి& ఆర్జన కంట్రోలర్ వైస్ అడ్మిరల్ కిరణ్ దేశ్‌ముఖ్, భారతీయ నావికా దళానికి చెందిన ఇతర సీనియర్ అధికారులు, రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులు ఈ ప్రారంభ కార్యక్రమానికి హాజరైన విశిష్ట అతిథుల్లో ఉన్నారు.
వార్‌షిప్ డిజైన్ బ్యూరో (డబ్ల్యుడిబి - యుద్ధనౌకల రూపకల్పన బ్యూరో), ఎండిఎల్ బృందాలు గతంలో అనేక సంప్రదాయక నౌకలను ప్రారంభించి, తమ నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకుని, తమదైన శైలిలో మరొక పాంటూన్ (బల్లకట్టు) తోడ్పాటుతో మరొక ప్రారంభకార్యక్రమాన్ని నిర్వహించారు. తరగిరిని భారతీయ నావికాదళానికి బట్వాడా చేయడానికి ముందు యంత్రసామాను అమర్చే కార్యకలాపాల కోసం ఎండిఎల్ వద్దనున్న తన రెండు సోదర నౌకలను చేరుకోనుంది.
ఎండిఎల్, జిఆర్ఎస్ఇ వద్ద ఏడు పి 17ఎ యుద్ధనౌకల నిర్మాణం వివిధ దశల్లో ఉంది. స్టెల్త్ ఫ్రిగేట్ల (రహస్య యుద్ధనౌకల) వంటి ముఖ్యమైన, సంక్లిష్టమైన నౌకలను దేశీయంగా నిర్మించడం అనది నౌకా నిర్మాణ రంగంలో దేశాన్ని ఉన్నత పీఠానికి చేర్చింది. ఇది ఆర్ధికాభివృద్ధి, భారతీయ ఓడరేవులకు ఉపాధికల్పనకు, వాటి ఉప- కాంట్రాక్టర్లు, అనుబంధ పరిశ్రమకు పనిని కల్పించే అదనపు ప్రయోజనాలను అందిస్తుంది. అదనంగా, ప్రాజెక్టు 17 ఎ ఆర్డర్లలో 75 శాతాన్ని ఎంఎస్ఎంఇలు సహా దేశీయ సంస్థలకు ఇవ్వడం ద్వారా ఆత్మనిర్భర్ భారత్ కోసం దేశ ఆశయాన్ని బలోపేతం చేస్తోంది.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, యుద్ధనౌకల నిర్మాణంలో స్వావలంబన అన్న జాతి ఆశయాన్ని సాకారం చసిన మజాగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్‌ను, వార్‌షిప్ డిజైన్ బ్యూరోను, ఇతర నావిదళాలను పశ్చిమ నావల్ కమాండ్ ఎఫ్ఒసి-ఐఎన్-సి అయిన వైస్ అడ్మిరల్ అజేంద్ర బహదూర్ సింగ్ కొనియాడారు. నీలి సముద్రపు జలాల్లోకి ప్రవేశించినప్పుడు తరగిరి ఖచ్చితంగా భారత నావికాదళానికి విశిష్ఠ బలాన్ని జోడిస్తుందని ఆయన అన్నారు.
***
(Release ID: 1858699)
Visitor Counter : 196