సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
12 సెప్టెంబర్ 2022న ఎన్‌సిసి క్యాడెట్లతో సమావేశం, మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ ఈ సమావేశానికి సంయుక్తంగా అధ్యక్షత వహించనున్న కేంద్ర రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర సామాజిక న్యాయం & సాధికారత మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్
దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 17 ఎన్‌సిసి రాష్ట్ర డైరెక్టొరేట్లతో పాటు, ఎన్‌సిసి క్యాడెట్లు, యువత ఈ కార్యక్రమంలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొంటారని అంచనా
Posted On:
11 SEP 2022 2:57PM by PIB Hyderabad
యువతకు మాదక ద్రవ్యాల ప్రమాదకరమైన దుష్ప్రభావాలను తెలియ చేయడంతో పాటుగా యువతలో ఎన్‌సిసి చూపుతున్న విస్త్రత ప్రభావాన్ని గుర్తించాల్సిన తక్షణ అవసరాన్ని పరిగణనలోకి తీసుకుని, ఎన్‌సిసి కేబెట్‌లతో భేటీ, మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా సామూహిక ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని 12 సెప్టెంబర్ 2022న న్యూఢిల్లీలోని డాక్టర్ అంబేడ్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ (డిఎఐసి)లోని భీమ్ ఆడిటోరియంలో సామాజిక న్యాయం & సాధికారత మంత్రిత్వ శాఖ నిర్వహించనుంది.
ఈ చర్చా కార్యక్రమానికి కేంద్ర రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర సామాజిక న్యాయం & సాధికారత మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ సంయుక్తంగా అధ్యక్షత వహించనున్నారు. దేశంలోని ఎన్‌సిసి 17 రాష్ట్ర డైరెక్టొరేట్‌లు ఈ కార్యక్రమంలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొననున్నాయి.
రాష్ట్రాల సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శులు, డాక్టర్ అంబేడ్కర్ చైర్ విద్యా సంస్థలు, విద్యా సంస్థలకు చెందిన విద్యార్ధులను ఈ కార్యక్రమానికి ఆన్‌లైన్‌లో హాజరుకావలసిందిగా కోరారు. తమ తమ జిల్లాలలోని ఎన్‌సిసి క్యాడెట్లు, యువత ఈ భేటీలో పాల్గొనడం, కార్యక్రమాన్ని వీక్షించడం, ప్రతిజ్ఞ చేయడం వంటి కార్యక్రమాలను సులభతరం చేయాలని జిల్లా కలెక్టర్లందరూ చర్యలు తీసుకోవాలని కోరారు. దేశవ్యాప్తంగా ఉన్న వేలమంది ఎన్‌సిసి కడెట్లు, యువత ఈ కార్యక్రమంలో పాల్గొంటారని అంచనా.
మాదక ద్రవ్యాల డిమాండ్‌ను తగ్గించేందుకు భారత ప్రభుత్వంలో సామాజిక న్యాయం & సాధికారత విభాగం నోడల్ విభాగం. యువత, పిల్లలు, సమాజంలో అవగాహనను సృష్టించేందుకు నషా ముక్త భారత్ అభియాన్ (ఎన్ఎంబిఎ)ను గుర్తించిన 272 జిల్లాలలో 15 ఆగస్టు 2020న భారత ప్రభుత్వం ప్రారంభించింది. ఇప్పటి వరకూ 3 కోట్ల మంది యువత, 2 కోట్లమంది మహిళలు, 1.59 లక్షల విద్యా సంస్థలు సహా 8 కోట్లమందికి పైగా ఇప్పటివరకూ ఎన్ఎంబిఎలో భాగం అయ్యాయి.
ఎన్‌సిసి కేడెట్ల చురుకైన భాగస్వామ్యంతో నషా ముక్త్ భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు సామజిక న్యాయం & సాధికారత విభాగం ఈ అభియాన్‌ను నూతన శిఖరాలకు తీసుకువెడుతుందని భావిస్తున్నారు.
***
(Release ID: 1858645)
Visitor Counter : 111