వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
లాస్ ఏంజిల్స్ లోని శ్రీ స్వామి నారాయణ్ ఆలయాన్ని దర్శించిన శ్రీ పియూష్ గోయల్
శ్రీ స్వామినారాయణ్ ఆలయం ప్రపంచవ్యాప్తంగా సమాజానికి గొప్ప సేవ చేస్తోంది: శ్రీ పియూష్ గోయల్
స్వామినారాయణ్ భగవాన్ బోధించిన, ప్రముఖ్ స్వామి మహరాజ్ ప్రచారం చేసిన మానవత్వం, ఆథ్యాత్మికత, సమాజానికి సేవ వంటి ఆదర్శాలు మనకు మార్గదర్శకంగా నిలిచి మనకు ప్రేరణనివ్వనున్నాయి : శ్రీ గోయల్
प्रविष्टि तिथि:
11 SEP 2022 11:56AM by PIB Hyderabad
కేంద్ర వాణిజ్య, పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ, టెక్స్‌టైల్స్ శాఖ మంత్రి శ్రీ పియూష్ గోయల్ లాస్ ఏంజిల్స్ లోని స్వామి నారాయణ్ ఆలయాన్ని దర్శించారు. బిఎపిఎస్ స్వామినారాయణ్ ఆలయం ప్రపంచవ్యాప్తంగా సమాజానికి గొప్ప సేవచేస్తున్నదని అన్నారు. లాస్ ఏంజిల్స్‌లోని శ్రీస్వామినారాయణ్ ఆలయాన్ని దర్శించిన అనంతరం మంత్రి భారత సంతతి ప్రజలనుద్దేశించి మాట్లాడారు.
లాస్ ఏంజిల్స్ లోని శ్రీ స్వామినారాయణ్ ఆలయ కాంప్లెక్స్ అందం తనను ముగ్ధుడిని చేసిందని ఆయన అన్నారు. ఈ ఆలయం నెలకొల్పి దశాబ్ద కాలం పూర్తి చేసుకున్నందుకు అభినందనలు తెలిపారు. ఈప్రాంతంలో చెప్పుకోదగిన స్థాయిలో భారతీయలు ఉండడం, ఈ ప్రాంత అభివృద్ధి, పురోగతికి వారు చేసిన కృషికి ఈ ఆలయం ఇక్కడ ఉండడం ఎంతో సముచితమని ఆయన అన్నారు.
ప్రముఖ్ స్వామి మహరాజ్‌శత జయంతి వార్షకోత్సవం సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తూ మంత్రి, ఇది మనందరికీ ఎంతో ప్రత్యే సందర్భమని, ప్రపంచవ్యాప్తంగా గల ఎంతో మంది వారి ఆశీస్సులు అందుకుని, వారి నుంచి మంచిని నేర్చుకున్నారని అన్నారు.ప్రముఖ్ స్వామి మహారాజ్ జితో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని ఎన్నో సంవత్సరాలుగా వారితో కలిసిపలు కార్యక్రమాలలో పాల్గొన్నవిషయాన్ని వారు గుర్తుచేసుకున్నారు. చాలా ఏళ్ల క్రితం ముంబాయిలో జరిగిన ప్రముఖ్ స్వామీ మహరాజ్ గారి 75 వ జన్మదినోత్సవాలలో క్రియాశీలంగా పాల్గొనే అవకాశం తనకు దక్కినట్టు ఆయన తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా గల శ్రీ స్వామి నారాయణ్ ఆలయాలను ఎప్పుడూ దర్శించే అవకాశం తనకు దక్కుతూ వస్తొందని శ్రీ గోయల్ అన్నారు. లాస్ ఏంజిల్స్ లోని ఆలయాలు ఎంతో ప్రత్యేకమైనవని, అందంగా ఉన్నాయని, ఒక ప్రణాళిక ప్రకారం వీటి నిర్మాణం చేపట్టి అమలు చేశారని ఆయన అన్నారు. ఈ ఆలయాలను దర్శించినపుడు అద్భుతమైన ఆధ్యాత్మిక భావన కలగడం ఇక్కడి ప్రత్యేకత అని ఆయన అన్నారు.
హిందువుల ఐక్యత,హిందూత్వ స్ఫూర్తిని మరింత ప్రకాశవంతం చేయడంలో , హిందూత్వం ప్రపంచవ్యాప్తంగా ప్రకాశమానం కావడంలో బిఎపిఎస్ కృషి వెలలేనిదని మంత్రి అన్నారు.
ప్రజలు భారతదేశం నుండి వెళ్లి, జీవితంలోని భౌతిక కోణాన్ని గమనించి నపుడు తరువాతి తరం మాతృభూమితో అనుబంధాన్ని కోల్పోయే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. అయితే స్వామినారాయణ దేవాలయం ఎక్కడ ఏర్పడిందో అక్కడ ఆధ్యాత్మికత వర్ధిల్లుతుందని, తరువాతి తరం మాతృభూమితో దాని అనుబంధాన్ని నిలుపుకుంటుందని వారు చాలా మంచి అలవాట్లు అలవరచుకుంటారని అన్నారు.. ఈ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా సమాజానికి ఎంతో సేవ చేస్తోందని మంత్రిఅన్నారు.
స్వామినారాయణ్ భగవాన్ ఎల్లప్పుడూ మానవత్వం, ఆధ్యాత్మికత, సమాజ సేవను విశ్వసించేవారని శ్రీ గోయల్ అన్నారు. వారి బోధనలు మానవజాతికి మొత్తంగా మనం తిరిగి ఇవ్వవలసిన దానిపైనే ప్రధానంగా దృష్టిపెట్టేవని తెలిపారు. జ్ఞానం, భక్తి, శ్రద్ధ వంటి వాటిని స్వామి నారాయణ్ మనకు బోధించారని, ప్రముఖ్ స్వామి మహరాజ్ వాటిని ప్రచారం చేశారని, ఇవి ఎన్నటికీ మనతో ఉంటాయని అన్నారు. వారి బోధనలు తనకు నిరంతరం ప్రేరణనిచ్చి మార్గనిర్దేశం చేస్తుంటాయని శ్రీ గోయల్ అన్నారు.
***
(रिलीज़ आईडी: 1858572)
आगंतुक पटल : 182