వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

లాస్ ఏంజిల్స్ లో ఇండో-పసిఫిక్ ఎకనామిక్ ఫోరమ్ మొదటి ఇన్ పర్సన్ మంత్రివర్గ సమావేశంలో పాల్గొన్న శ్రీ పీయూష్ గోయల్


జాతీయ ప్రయోజనాలను బట్టి ఐపిఎఫ్ ఫ్రేమ్ వర్క్ లకు సంబంధించిన వివిధ అంశాలపై భారత దేశం నిర్ణయాలు తీసుకుంటుంది: శ్రీ పియూష్ గోయల్

అరమరికలు లేని స్వేచ్ఛాయుత, సమ్మిళిత ఇండో-పసిఫిక్ కోసమే భారత్ ప్రయత్నాలు : గోయల్

లాస్ ఏంజిల్స్ లో ఐపిఇఎఫ్ మినిస్టీరియల్ సందర్భంగా యుఎస్, ఆస్ట్రేలియా, జపాన్ వియత్నాం దేశాల సహచర మంత్రులను కలవనున్న శ్రీ గోయల్

డేటా గోప్యతపై ప్రత్యేక దృష్టితో డిజిటల్ స్పేస్ లో భారతదేశం అనేక సమకాలీన, ఆధునిక చట్టాలను కలిగి ఉంటుంది: శ్రీ గోయల్

స్థితిస్థాపక సరఫరా గొలుసులను పెంపొందించడానికి , స్వావలంబన లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లడానికి భారతదేశంతో అమెరికా కలిసి పనిచేస్తుంది: శ్రీ గోయల్

భారతదేశంలోని 2,3వ శ్రేణి నగరాలు, మారుమూల ప్రాంతాల్లోని యువతకు కంపెనీలకు చౌకైన సాంకేతిక పరిష్కారాలను అందించేలా కృషి చేయడానికి కొత్త అవకాశాలు : శ్రీ పీయూష్ గోయల్

Posted On: 09 SEP 2022 11:04AM by PIB Hyderabad

లాస్ ఏంజిల్స్ లో జరిగిన ఇండియా-ఫసిఫిక్ ఎకనామిక్ ఫోరం (ఐపిఇఎఫ్) మొదటి ఇన్ పర్సన్ మంత్రివర్గ సమావేశానికి కేంద్ర వాణిజ్య పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్ర జా పంపిణీ,జౌళి శాఖల మంత్రి శ్రీ పియూష్ గోయల్ ఈ రోజు హాజరయ్యారు. ఇండో-పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్ వర్క్ (ఐపిఇఎఫ్) మినిస్టీరియల్ సమావేశం సందర్భంగా మీడియాతో మాట్లాడిన మంత్రి, మన జాతీయ ప్రయోజనాల ఆధారంగా ఐపిఇఎఫ్ ఫ్రేమ్ వర్క్ ల వివిధ అంశాలపై భారతదేశం నిర్ణయాలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు.

 

ఐపిఇఎఫ్ లోని 14 సభ్య దేశాలతో ఎంతో ఉపయోగవంతమైన ఒప్పందాలు జరిగాయని, ఇటువంటి ఫలవంతమైన

సమావేశాలకు రంగం సిద్ధం చేయడానికి సభ్య దేశాలకు చెందిన అధికారులు చాలా శ్రమించారని శ్రీ గోయల్ అన్నారు. ఒక రోజు వ్యవధిలో ఐపిఇఎఫ్ ఒక ఫ్రేమ్ వర్క్ ను ఖరారు చేస్తుందని, దీనిలో సభ్య దేశాలు పరస్పర ప్రయోజనకరమైన వివిధ రంగాలపై సంభాషించుకోవచ్చని ఆయన ఆశాభావం

వ్యక్తం చేశారు. ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్ వర్క్ ఫర్ ప్రాస్పెరిటీ మినిస్టీరియల్ సమావేశానికి ముందు, శ్రీ గోయల్ లాస్ ఏంజిల్స్ లో ఆస్ట్రేలియా వాణిజ్య మంత్రి హెచ్.ఇ. డాన్ ఫారెల్ తో సమావేశమయ్యారు.

లాస్ ఏంజిల్స్ లో ఐపిఇఎఫ్ మినిస్టీరియల్ సమావేశం సందర్భంగా అమెరికా వాణిజ్య మంత్రి గినా రైమోండోతో కూడా శ్రీ గోయల్

సమావేశం అయ్యారు

 

 

 

"స్థితిస్థాపక ప్రపంచ సరఫరా గొలుసులను నిర్మించడానికి చూస్తున్న భారతదేశం-యుఎస్ తో వాణిజ్యం ,పెట్టుబడుల సంబంధాలను మరింత లోతుగా పెంచుకోవడం గురించి చర్చించాము" అని మంత్రి ట్వీట్ చేశారు.

లాస్ ఏంజిల్స్ లో ఐపిఇఎఫ్ మినిస్టీరియల్ నేపథ్యం లో యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ అంబాసిడర్ కేథరీన్ తాయ్ తో కూడా మంత్రి సమావేశమయ్యారు.

"ఇండో-పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్ వర్క్ ఫర్ ప్రాస్పెరిటీ మినిస్టీరియల్ సమావేశానికి హాజరవుతున్న సందర్భంగా స్వేచ్ఛాయుత, బహిరంగ ,సమ్మిళిత ఇండో-పసిఫిక్ కోసం భారతదేశం తన ప్రయత్నాలను

పునరుద్ఘాటిస్తుంది‘‘అని శ్రీ గోయల్ ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

మీడియా ఇంటరాక్షన్ లో తన అమెరికా సహచరులతో జరిగిన సమావేశాల గురించి మంత్రి మాట్లాడుతూ, యుఎస్ లోని తన సహచరులతో సమావేశం చాలా సుహృద్భావంగా ఉందని, యుఎస్ భారతదేశం మధ్య జరుగుతున్న మంచి పని గురించి వారు ఉత్సాహంగా ఉన్నారని అన్నారు. హైటెక్ రంగాలతో సహా మన వాణిజ్యం ,పెట్టుబడులను విస్తరించడానికి వారు చాలా అనుకూలంగా ఉన్నారని, రెండు దేశాల మధ్య స్థితిస్థాపక సరఫరా గొలుసులను మరింత పెంచాలని కోరుకుంటున్నారని ఆయన అన్నారు.

 

జపాన్ ఆర్థిక,వాణిజ్యం,పరిశ్రమల శాఖ మంత్రి యసుతోషి నిషిమురాతో కూడా

శ్రీ గోయల్ సమావేశమయ్యారు.

 

"భారతదేశం-జపాన్ ఆర్థిక సహకారానికి మరింత ఉత్తేజాన్ని ఇవ్వడానికి వాణిజ్యం, ఉద్యోగ వృద్ధి ,పరస్పర ప్రయోజనకర రంగాలను విస్తరించడం గురించి చర్చ జరిగింది‘‘ అని శ్రీ గోయల్ ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

 

ఇండో-పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్ వర్క్ ఫర్ ప్రాస్పెరిటీ సందర్భంగా వియత్నాం పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి గుయెన్ హాంగ్ డైన్ తో శ్రీ గోయల్ భేటీ అయ్యారు. పరస్పర ఆసక్తి ఉన్న రంగాలలో సహకారం విస్తరణ  గురించి చర్చించారు.

 

యుఎస్ తో జ రిగిన చర్చలను గురించి

మరింత వివరిస్తూ, స్వావలంబన ను ఒక కీలకమైన తత్త్వంగా మార్చుకోవాల్సిన అవసరాన్ని రెండు దేశాలు గుర్తించాయని, పారదర్శక ఆర్థిక వ్యవస్థలు , పరిమితుల ఆధారిత ట్రేడింగ్ వ్యవస్థలను విశ్వసించే విశ్వసనీయ భాగస్వాముల మధ్య సరఫరా గొలుసులు ఉండాలని రెండు దేశాలు భావిస్తున్నాయని శ్రీ గోయ ల్ అన్నారు. భారతదేశంతో కలిసి పనిచేయడానికి అమెరికా చాలా ఆసక్తిగా ఉందని, తద్వారా ఇతర దేశాలపై, ముఖ్యంగా గత రెండు, మూడు సంవత్సరాలుగా మనం తీవ్రమైన సమస్యలను ఎదుర్కొన్న దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించవచ్చని ఆయన అన్నారు.

 

మార్కెట్ యాక్సెస్ సమస్యలపై ఒక ప్రశ్నకు శ్రీ గోయల్ సమాధానమిస్తూ, త్వరలో ఇండియా-యుఎస్ ట్రేడ్ పాలసీ ఫోరమ్ నిర్వహించబడుతుందని, ఈ సమయంలో మరిన్ని సేవలు, భాగస్వామ్యాలు కొత్త ప్రాంతాలతో ముందుకు వస్తామని చెప్పారు.

 

డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై ఒక ప్రశ్న కు మంత్రి, సమాధానం ఇస్తూ, భారతదేశం డిజిటల్ రంగం లో  చాలా సమకాలీన , ఆధునిక చట్టాలను కలిగి ఉండాలని చూస్తోందని, డేటా గోప్యత అధిక స్థాయిలను, ముఖ్యంగా మన పౌరుల వ్యక్తిగత డేటాను నిర్వహించాలని చూస్తున్నట్లు అమెరికాలోని తన సహచరులకు తెలియజేసినట్లు చెప్పారు.

ఆ స్ఫూర్తితో, భారతదేశం త్వరలో పార్లమెంటుకు సమర్పించడానికి మరింత బలమైన ఫ్రేమ్ వర్క్ పై పని చేస్తోందని, దీనిని యుఎస్ , భారతదేశంలోని వాణిజ్య సంస్థలు స్వాగతించాయని. తెలిపారు. భారతదేశం టెక్నాలజీ సేవలను పెద్ద ప్రొవైడర్ గా కలిగి ఉందని, చట్టాలపై మంచి అవగాహన కలిగి ఉండటానికి ఉమ్మడి ఆసక్తి ఉందని, అలాగే సేవల ఎగుమతిలో కూడా మనకు గొప్ప ఆసక్తి ఉందని ఆయన అన్నారు.

 

ఇంటి నుండి పని చేసే ఈ రోజుల్లో మన యువతకు, ముఖ్యంగా టైర్ 2 , 3 నగరాలు,   మారుమూల ప్రాంతాల్లోని యువత యుఎస్ కంపెనీలకు చౌకైన పరిష్కారాలను అందించడానికి కొత్త అవకాశాలు తెరుచుకున్నాయని, దీనిని యుఎస్ వాణిజ్య సంస్థలు ఎంతో ఉత్సాహభరితంగా స్వీకరించాయని శ్రీ గోయల్ అన్నారు.

 

డబ్ల్యుటిఒ సమావేశం ఇంకా  బే ప్రాంతంలో సమావేశాల సందర్భంగా భారతదేశం, దావోస్ ల లోని యుఎస్ కంపెనీలతో తాము జరిపిన వరుస సమావేశాలను శ్రీ గోయల్ ప్రస్తావిస్తూ,

యుఎస్ కంపెనీలు భారతదేశంలో ఉద్యోగాలను విస్తరించడానికి,  వారి పరిశోధన- అభివృద్ధి, సాంకేతిక మద్దతు వ్యవస్థలు ,బ్యాక్ ఆఫీసులను విస్తరించడానికి చూస్తుండడం ఎంతో ప్రోత్సాహకరంగా ఉందని చెప్పారు. హైరింగ్ ప్రణాళికల పరంగా వారు సూచించే సంఖ్యలు నిజంగా అబ్బురపరుస్తాయని ఆయన అన్నారు.

 

శాన్ఫ్రాన్సిస్కో, సెటులో తాను ప్రారంభించిన అప్ స్కిల్లింగ్ చొరవపై అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ, ఈ చొరవలో భాగమైన ప్రఖ్యాత సంస్థలు అందించే శిక్షణ ,అప్ స్కిల్లింగ్ నుండి గొప్ప సామర్థ్యాన్ని కలిగి ఉన్న మన యువకులు, ముఖ్యంగా బాలికలతో భారతదేశం కూడా దాని లబ్ధిదారులుగా ఉంటుందని అన్నారు. చౌకైన పరిష్కారాలను అందించడానికి భారతదేశంలో కొన్ని అద్భుతమైన ఎడ్-టెక్ కంపెనీలు ,నైపుణ్య చొరవలు ఉన్నందున భారతదేశం కూడా ఈ చొరవకు తన మద్దతును అందించింది. దీనిని అమెరికా స్వాగతించిందని మంత్రి తెలిపారు.

 

***(Release ID: 1858170) Visitor Counter : 104