వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
శాన్‌ఫ్రాన్సిస్కో బే ఏరియాలోని వెంచర్ కాపిటలిస్ట్‌లతో సమావేశమైన కేంద్ర మంత్రి శ్రీపియూష్ గోయల్
భారత్, భారతీయ వ్యాపారవేత్తలు,స్టార్టప్‌లు ఆఫర్ చేసే వాటిపై బే ఏరియా ఆశాజనకంగా ఉంది : శ్రీ పియూష్ గోయల్
సెమి కండక్టర్ పరిశ్రమను ప్రోత్సహించాలని ఇండియా దృఢసంకల్పంతో ఉంది: శ్రీగోయల్
భారతదేశపు సైబర్ రంగం భద్రత, మరింత పటిష్టపరిచేందుకు సైబర్ సెక్యూరిటీ కంపెనీలతో భాగస్వామ్యానికి పిలుపునిచ్చిన కేంద్ర మంత్రి
శాన్‌ఫ్రాన్సిస్కోలోని జెడ్ స్కేలర్ సిఇఒను కలుసుకున్న మంత్రి
సర్వీస్ నౌ సిఇఒ శ్రీ బిల్ మెక్‌డెర్‌మాట్ సమావేశమైన మంత్రి
Posted On:
07 SEP 2022 10:42AM by PIB Hyderabad
కేంద్ర వాణిజ్య పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు,ఆహారం , ప్రజాపంపిణీ, టెక్స్‌టైల్స్ శాఖ యమంత్రి శ్రీ పియూష్ గోయల్ ఈరోజు శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియాలోని వెంచర్ కాపిటలిస్టులతో సమావేశమయ్యారు.
శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియాలోని వెంచర్ కాపిటలిస్ట్‌లతో అర్ధవంతమైన సమావేశం జరిగింది. అద్భుతమైన భారత స్టార్టప్ వ్యవస్థలో మరింత లోతైన చర్చలకు, విస్తృత భాగస్వామ్యానికి వారిని ప్రోత్సహించడం జరిగిందని కేంద్ర మంత్రి తమ సమావేశం గురించి ఒక ట్వీట్ లో తెలిపారు. భారతదేశంలో ప్రాథమిక దశలోని స్టార్టప్‌లకు మెంటార్ షిప్ అందించేందుకు తద్వారా అవి విజయం సాధించి ఉన్నత స్థాయికి తీసుకువెళ్లేందుకు సహాయపడేవిధంగా వారిని ఆయన ప్రోత్సహించారు.
"శాన్‌ఫ్రాన్సిస్కో బే ఏరియాలోని వెంచర్ కాపిటలిస్టులతో అర్ధవంతమైన సమావేశం జరరిగింది. భారతీయ అద్భుత స్టార్టప్ వ్యవస్థతో మరింత లోతైన, విస్తృత సంప్రదింపులు, భాగస్వామ్యానికి వారిని ప్రోత్సహించడం జరిగింది"
- పియూష్ గోయల్ , సెప్టెంబర్ 7,2022
శాన్‌ఫ్రాన్సిస్కో బే ఏరియాలోని భారతీయ ఇన్వెస్టర్లతో లంచ్ సమావేశంలో విస్తృత చర్చలు నిర్వహించాను ప్రాథమిక దశలోని భారతీయ స్టార్టప్‌లు మరింత ఉన్నత స్థాయికి చేరుకుని విజయం సాధించేందుకు మెంటార్‌షిప్ అందించే అంశం పరిశీలించాల్సిందిగా వారిని ప్రోత్సహించడం జరిగింది .
--పియూష్ గోయల్, సెప్టెంబర్ 6,2022
శ్రీ గోయల్ శాన్ ఫ్రాన్సిస్కోలో జెడ్ స్కేలర్ సిఇఒ శ్రీ జె చౌదురిని కూడా కలిశారు.
ఇండియా ప్రస్తుతం డిజిటల్ రంగంలో తన వృద్ధిని కొనసాగిస్తున్నందున దేశంలో సైబర్ సెక్యూరిటీని మరింత విస్తృతపరిచేందుకు , సురక్షితమైన, భద్రమైన డిజిటల్ ఇండియాను సాధించేందుకు మార్గాలపై చర్చించడం జరిగిందని మంత్రి ట్వీట్‌చేశారు.
జెడ్ స్కేలర్ సిఇఒతో సమావేశమైన కేంద్ర మంత్రి పియూష్ గోయల్
ఇండియా డిజిటల్‌రంగంలో ముందుకు పోతున్నందున దేశంలో సైబర్ సెక్యూరిటీ ని మరింత విస్తృతపరచి సురక్షితమైన,భద్రమైన డిజిటల్ ఇండియాకు వీలుకల్పించడం జరుగుతుంది. --పియూష్ గోయల్ ,సెప్టెంబర్ 7,2022
శ్రీ పియూష్ గోయల్ సర్వీస్ నౌ సిఇఒ బిల్ మెక్ డెర్మాట్‌తో సమావేశమయ్యారు.
ఇండియా డిజిటల్ టెక్నాలజీ రంగంలో దూసుకుపోతున్నందున కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్ సాఫ్ట్‌వేర్‌ను సర్వీస్ మార్కెట్‌గా శరవేగంతో పరివర్తన చెందిస్తున్నది. ఇది ఇండియాను 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ దిశగా ఎదిగే క్రమాన్ని వేగవంతం చేస్తున్నదని కేంద్రమంత్రి పియూష్ గోయల్ ట్వీట్ చేశారు.
ఇండియా డిజిటల్ టెక్నాలజీ రంగంలో దూసుకుపోతున్నందున కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్ సాఫ్ట్‌వేర్‌ను సర్వీస్ మార్కెట్‌గా శరవేగంతో పరివర్తన చెందిస్తున్నది. ఇది ఇండియాను 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ దిశగా ఎదిగే క్రమాన్ని వేగవంతం చేస్తున్నది:
--- కేంద్రమంత్రి పియూష్ గోయల్ , సెప్టెంబర్ ,07,2022.
కేంద్రమంత్రి పియూష్ గోయల్ స్టాన్‌ఫోర్డ్ గ్రాడ్యుయేట్‌స్కూల్ ఆఫ్ బిజినెస్‌లోని విద్యార్థులు, ఫాకల్టీ సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు. టిఐఇ సిలికాన్ వ్యాలీ , ఐఐటి స్టార్టప్లు, ఇండియన్ కమ్యూనిటీ సెంటర్ తో కలిసి కాన్సులేట్ ఏర్పాటు చేసిన ఇండియన్ కమ్యూనిటీ ఈవెంట్‌కు మంత్రి హాజరయ్యారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ శ్రీ పియూష్ గోయల్, బే ఏరియా , ఇండియా, ఇండియన్ బిజినెస్ ,స్టార్టప్‌లు ఆఫర్ చేసే సేవల విషయంలో ఎంతో ఆశాజనకంగా ఉందన్నారు. భారతదేశపు 1.3 బిలియన్ ప్రజలకు సంబంధించిన భారీ మార్కెట్ లో ఎన్నో అవకాశాలను వారు చూస్తున్నారు..
సెల్ప్ ఎంప్లాయిమెంట్, టాలెంట్ యుటిలైజేషన్ (ఎస్.ఇ.టు.యు) పథకం గురించి , మెంటార్ షిప్ ను మెరుగుపరచడం గురించి ప్రభుత్వం తీసుకున్న పలు చర్యలను ఆయన వివరించారు. అలాగే స్టార్టప్ అడ్వయిజరీ కౌన్సిల్ ఆధ్వర్యంలో చేపట్టిన నైపుణ్యాల పెంపు, ఇతర పరివర్తనాత్మక చర్యలను వివరించారు. ద్వితీయ , తృతీయ శ్రేణి నగరాలలో మెంటార్‌షిప్ పై దృష్టిపెడుతున్న విషయాన్ని తెలిపారు.
సైబర్ సెక్యూరిటీ కంపెనీ జెడ్ స్కేలర్ సిఇఒతో తన సమావేశం గురించి మాట్లాడుతూ , మంత్రి, సైబర్ సెక్యూరిటీ రంగంలో సవాళ్లతో ప్రపంచం కొట్టుమిట్టాడుతున్నదని పియూష్ గోయల్ అన్నారు. భారతదేశపు సైబర్ భద్రతకు చేస్తున్న కృషి గురించి ఆయన వివరించారు. బే ఏరియాలోని సైబర్ సెక్యూరిటీ సంస్థలతో భాగస్వామ్యం ఈ దిశగా సత్వర విజయానికి వీలుకల్పిస్తుందన్నారు..
సెమీ కండక్టర్ పాలసీ గురించి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ శ్రీ పియూష్ గోయల్, కొద్ది నెలల క్రితమే ఇండియా సెమీ కండక్టర్ విధానాన్ని తీసుకువచ్చిందని చెప్పారు. దీనికింద కంపెనీలకు ఉదారంగా ప్రోత్సాహకాలు ఇస్తున్నట్టు తెలిపారు. అందువల్ల ఇండియాలో ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు ముందుకు రావలసిందిగా పిలుపునిచ్చారు. సెమీ కండక్టర్ చెయిన్ కింద దేశంలో సరైన వాతావరణం ఉందన్నారు. తాము ఎన్నో కంపెనీలతో చర్చలు జరిపామన్నారు. వీరిలో చాలామంది భారతదేశంలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చారన్నారు.దేశీయంగా సెమీ కండక్టర్ పరిశ్రమ ను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు.
మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, శ్రీ గోయల్ భారతీయ ప్రాడక్టుల అవసరం గురించి ప్రస్తావించారు. ప్రపంచవ్యాప్తంగా వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోగ్రాం (ఒడిఒపి) కార్యక్రమం కింద భారతీయ ఉత్పత్తులను ప్రోత్సహించాల్సి ఉందన్నారు.
ప్రభుత్వం మెంటార్‌షిప్‌ను మెరుగుపరిచేందుకు తీసుకున్న చర్యలను మంత్రి వివరించారు. సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ , టాలెంట్ యుటిలైజేషన్ (ఎస్ ఇ టి యు) పథకం, పరివర్తనాత్మకత, నైపుణ్యాల పెంపు నకు తీసుకున్న చర్యలను వివరించారు. స్టార్టప్ అడ్వయిజరీ కౌన్సిల్ కింద ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలలో మెంటార్‌షిప్‌పై దృష్టిపెట్టడం జరుగుతోందన్నారు.
పాకేజింగ్ ఒడిఒపి ప్రాడక్టులను మెరుగుపరిచే చర్యలను మంత్రి ప్రస్తావించారు. నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్ ఐడి) , నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫాషన్ టెక్నాలజీ (ఎన్ ఐ ఎఫ్.టి) తదితర సంస్థలను పాకేజింగ్ ను మెరుగుపరిచేందుకు వారి సేవలను వినియోగించుకోవడం జరుగుతుంది. ఒడిఒపి తయారీదారులను ఉచితంగా జిఇఎం లో ఉంచడం జరుగుతుంది. ప్రభుత్వ సంస్థలు సహకార సంఘాలు, ఒడిఒపి ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
ఒడిఒపి, ఓపెన్ నెట్ వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఒఎన్‌డిసి) అనుసంధానం అవకాశాలపై మంత్రిమాట్లాడారు. ఒఎన్‌డిసి, కొనుగోలుదారు, అమ్మకం దారు వ్యవస్థను ప్రజాస్వామీకరిస్తుందన్నారు.
త్వరలో ఒకటి లేదా రెండు నగరాల్లో ఒఎన్‌డిసి ని అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఒఎన్ డిసి ప్రజలకు మంచి ఆఫర్‌గా ఉండేలా అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన తెలిపారు.
****
(Release ID: 1857750)
Visitor Counter : 154