వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
శాన్‌ఫ్రాన్సిస్కోలో మహాత్మా గాంధీకి నివాళులు అర్పించిన శ్రీ గోయెల్
శాన్‌ఫ్రాన్సిస్కోలోని గదార్ మెమోరియల్ హాల్‌ను సందర్శించి; మన పూర్వీకులు చేసిన త్యాగాలను గుర్తు చేసుకున్నారు
Posted On:
06 SEP 2022 8:52AM by PIB Hyderabad
కేంద్ర వాణిజ్య, పరిశ్రమల, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ, జౌళి శాఖల మంత్రి శ్రీ పీయూష్ గోయెల్ మంగళవారంనాడు శాన్‌ఫ్రాన్సిస్కోలో మహాత్మా గాంధీకి పుష్ప నివాళులను అర్పించారు.
మనం చేసేదానికి, మనం చేయగల సామర్ధ్యం ఉన్నదానికి మధ్య ఉన్నవ్యత్యాసం చాలు ప్రపంచ సమస్యలను పరిష్కరించడానికి అని ఆయన ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు.
నేను శాన్‌ఫ్రాన్సిస్కోలో మహాత్మా గాంధీకి నివాళులు అర్పిస్తున్న ఈ సమయంలో, మరింత సమానమైన, సంపన్నమైన ప్రపంచాన్ని రూపొందించడానికి భారతదేశానికి గల ప్రయత్నాలు, సామర్ద్యాలకు నేను గర్విస్తున్నాను.
అనంతరం మంత్రి శాన్‌ఫ్రాన్సిస్కో లోని గదార్ మెమోరియల్ హాల్‌ను సందర్శించారు. మన పూర్వీకుల త్యాగాలను గుర్తు చేసుకుంటటూ, మన ప్రియమైన మాతృభూమి కోసం అన్నింటినీ త్యాగం చేసిన మన పూర్వీకుల పట్ల లోతైన కృతజ్ఞతతో నేను నేడు గదార్ మెమోరియల్ వద్ద నిలబడ్డాను.
ఈ అమృత్ కాలంలో భారత దేశం అభివృద్ధి చెందిన & సుసంపన్నమైన దేశంగా అవతరించేందుకు నా సేవలను అందిస్తున్నాని ప్రతిజ్ఞ చేస్తున్నాను.
జైహింద్!
కేంద్ర మంత్రి భారత్- యుఎస్ వ్యూహాత్మక భాస్వామ్య ఫోరం సదస్సు, ఇండో పసిఫిక్ ఎకనమిక్ ఫ్రేమ్‌వర్క్ (ఐపిఇఎఫ్) మినిస్టీరియల్ సమావేశంలో పాల్గొనేందుకు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో, లాస్ ఎంజెలీస్ ను 5 నుంచి 10 సెప్టెంబర్ 2022 వరకు విదేశీ పర్యటనలో ఉన్నారు.
***
(Release ID: 1857361)
Visitor Counter : 108