పర్యటక మంత్రిత్వ శాఖ

మన్ కీ బాత్ తాజా ఎడిషన్ లో, ప్రజలను ఏకం చేయడంలో అమృత్ మహోత్సవ్, హర్ ఘర్ తిరంగ ప్రచారాల ప్రాముఖ్యతను ప్రస్తావించిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ



అమృత్ మహోత్సవ్, స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ సమిష్టి శక్తిని మనం చూశాం: శ్రీ నరేంద్ర మోదీ

Posted On: 06 SEP 2022 12:30PM by PIB Hyderabad

 

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ  ఆగస్టు 28, 2022న 'మన్ కీ బాత్' 92వ ఎడిషన్ సందర్భంగా ప్రజలను ఏకం చేయడంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, హర్ ఘర్ తిరంగా ప్రచార కార్యక్రమాలు పోషించిన పాత్రను, ప్రాముఖ్యాన్ని  ప్రశంసించారు. ఈ ప్రచారాలు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని ప్రతిబింబిస్తాయని తెలిపారు.

 

మన్ కీ బాత్ ప్ర సంగంలో ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ఈ ప్రత్యేక సందర్భంగా అమృత్ మహోత్సవ్, స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ సమిష్టి శక్తిని మనం చూశామని, సాక్షాత్కార భావన కలిగిందని అన్నారు. ఇంత పెద్ద దేశం, ఇన్ని వైవిధ్యాలు, కానీ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసేటప్పుడు అందరూ ఒకే స్ఫూర్తితో ఏకమై, నదిలా ప్రవహించినట్లు అనిపించిందని అన్నారు. ప్రజలు స్వయంగా ముందుకు వచ్చి, త్రివర్ణ పతాకం చేతబూనినప్పుడు వచ్చే గర్వానికి నాయకత్వం వహించారు. పరిశుభ్రత ప్రచారం, వ్యాక్సినేషన్ ప్రచారంలో దేశ స్ఫూర్తిని కూడా మనం చూశాము. అమృత్ మహోత్సవ్ లో మళ్ళీ అదే దేశభక్తి స్ఫూర్తిని మనం చూడబోతున్నాము. మన సైనికులు ఎత్తైన పర్వతాల శిఖరాలపై, దేశ సరిహద్దులలో, సముద్రం మధ్యలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.

 

అమృత్ మహోత్సవ్ గురించి ప్రధాని మోదీ మాట్లాడుతూ, అమృత్ మహోత్సవ్ ఈ రంగులు భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోని ఇతర దేశాలలో కూడా కనిపించాయని అన్నారు. బోట్స్వానాలో నివసిస్తున్న స్థానిక గాయకులు భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 75 దేశభక్తి గీతాలను ఆలపించారు. ఇందులోని ప్రత్యేకత ఏంటంటే ఈ 75 పాటలను హిందీ, పంజాబీ, గుజరాతీ, బంగ్లా, అస్సామీ, తమిళం, తెలుగు, కన్నడ, సంస్కృతం వంటి భాషల్లో పాడారు. అదేవిధంగా నమీబియాలో ఇండో-నమీబియా సాంస్కృతిక-సంప్రదాయ సంబంధాలపై ఒక ప్రత్యేక స్టాంపును విడుదల చేశారని చెప్పారు.

 

స్వాతంత్ర్య సమరయోధులు, ముఖ్యంగా అజ్ఞాత వీరుల త్యాగాలను ప్రముఖంగా ప్రస్తావించే  స్వరాజ్య సీరియల్ దూరదర్శన్ లో వీక్షించాలని ప్రధాని ప్రజలను కోరారు. స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్న అజ్ఞాత వీరుల కృషిని, త్యాగాలను దేశంలోని యువతరానికి పరిచయం చేయడం గొప్ప చొరవ అని ఆయన అన్నారు. ఆగస్టు 15 న స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోవడానికి భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో వివిధ వ్యక్తిగత ప్రయత్నాలను కూడా ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించారు.

 

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మన్ కీ బాత్ లోని వివిధ ఎడిషన్లలో (సంపుటాల్లో) ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కు సగర్వ మైన స్థానం ఇచ్చారు.

 

 

 

 



(Release ID: 1857124) Visitor Counter : 111