ఆర్థిక మంత్రిత్వ శాఖ
కర్ణాటక, త్రిపుర, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, గుజరాత్‌లోని గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.4,189.58 కోట్లు గ్రాంట్-ఇన్-ఎయిడ్ విడుదల
మొత్తం గ్రాంట్ లో 2022-23లో ఇప్పటివరకు గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.15,705.65 కోట్లు విడుదల
Posted On:
31 AUG 2022 4:17PM by PIB Hyderabad
ఆర్థిక మంత్రిత్వ శాఖ వ్యయ విభాగం బుధవారం గ్రామీణ ప్రాంతాలకు గ్రాంట్లు అందించడానికి కర్ణాటక (రూ. 628.07 కోట్లు), త్రిపుర (రూ. 44.10 కోట్లు), ఉత్తరప్రదేశ్ (రూ. 2239.80 కోట్లు), ఆంధ్రప్రదేశ్ (రూ. 569.01 కోట్లు), గుజరాత్ (రూ. 708.60 కోట్లు) స్థానిక సంస్థలకు రూ.4,189.58 కోట్లు విడుదల చేసింది. ఈ గ్రాంట్-ఇన్-ఎయిడ్ కర్ణాటక, త్రిపుర, ఉత్తరప్రదేశ్‌లకు విడుదల అయిన 2022-23 సంవత్సరానికి సంబంధించిన టైడ్ గ్రాంట్లలో 1వ విడత, అలాగే ఆంధ్రప్రదేశ్, గుజరాత్‌లకు విడుదల అయిన 2021-22 సంవత్సరపు టైడ్ గ్రాంట్ల 2వ విడత.
15వ ఆర్థిక సంఘం (ఎఫ్ సి -15) సిఫార్సు చేసిన (ఎ) (ఓడీఎఫ్) స్థితి పారిశుద్ధ్యం, బహిరంగ మలవిసర్జన రహిత నిర్వహణ, (బి) తాగునీటి సరఫరా, వర్షపు నీటి సేకరణ, నీటి రీసైక్లింగ్ అనే రెండు కీలకమైన సేవలను మెరుగుపరిచేందుకు తాగునీరు & పారిశుద్ధ్య శాఖ సిఫార్సుల మేరకు గ్రామీణ స్థానిక సంస్థలకు (ఆర్ ఎల్ బిలు) టైడ్ గ్రాంట్లు విడుదల అయ్యాయి.
పంచాయితీ రాజ్ సంస్థలకు కేటాయించిన మొత్తం గ్రాంట్-ఇన్-ఎయిడ్‌లో 60 శాతం జాతీయ ప్రాధాన్యతలైన తాగునీటి సరఫరా, వర్షపు నీటి సంరక్షణ, పారిశుధ్యం (టైడ్ గ్రాంట్‌లుగా సూచిస్తారు) కోసం కేటాయించారు, అయితే 40 శాతం అన్ టైడ్ నిధులు స్థానిక నిర్దిష్ట అవసరాల కోసం పంచాయతీ రాజ్ సంస్థల విచక్షణ ప్రకారం వినియోగిస్తారు. .
స్థానిక సంస్థల గ్రాంట్లు గ్రామీణ స్థానిక సంస్థలకు కేంద్ర ప్రాయోజిత పథకాల కింద పారిశుధ్యం, తాగునీటి కోసం కేంద్రం.. రాష్ట్రం కేటాయించిన నిధుల కంటే అదనపు నిధులను నిర్ధారించడానికి ఉద్దేశించారు.
2021-22, 2022-23 సంవత్సరాలలో గ్రాంట్‌లకు అర్హత పొందాలంటే, గ్రామీణ స్థానిక సంస్థలు కొన్ని షరతులను నెరవేర్చాలి. పారదర్శకతను పెంపొందించడానికి, స్థానిక సంస్థలకు ఎన్నికలను సక్రమంగా నిర్వహించడానికి, స్థానిక సంస్థల వార్షిక అభివృద్ధి ప్రణాళికలను సిద్ధం చేయడానికి ఈ షరతులు నిర్దేశించారు.
టైడ్, అన్‌టైడ్ గ్రాంట్‌లు రెండింటినీ స్వీకరించడానికి, పబ్లిక్ డొమైన్‌లో కనీసం 25 శాతం స్థానిక సంస్థల ద్వారా ఆన్‌లైన్‌లో సిద్ధం చేయడం, అందుబాటులో ఉంచడం తప్పనిసరి, గత సంవత్సరం తాత్కాలిక ఖాతాలు, మునుపటి సంవత్సరం ఆడిట్ చేసిన ఖాతాలు రెండూ ఉండాలి. అంతేకాకుండా, ఖాతాలు తప్పనిసరిగా ఈ-గ్రామస్వరాజ్ ఆడిట్ ఆన్‌లైన్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలి. సక్రమంగా ఎన్నికైన స్థానిక సంస్థలకు మాత్రమే గ్రాంట్ విడుదలవుతుంది.
అదనంగా, టైడ్ గ్రాంట్‌ను స్వీకరించడానికి అర్హత పొందేందుకు, గ్రామీణ స్థానిక సంస్థలు పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా కోసం వార్షిక కార్యాచరణ ప్రణాళిక వివరాలను కలిగి ఉన్న అభివృద్ధి ప్రణాళికలను ఈ-గ్రామస్వరాజ్ లో అప్‌లోడ్ చేయాలి. తాగునీటి సరఫరా కోసం వార్షిక కార్యాచరణ ప్రణాళికలో తాగునీటి సరఫరా, వర్షపు నీటి నిల్వ, నీటి రీసైక్లింగ్ గురించిన వివరాలు ఉంటాయి. పారిశుధ్యం కోసం వార్షిక కార్యాచరణ ప్రణాళిక ఓడీఎఫ్ స్థితి, నిర్వహణ, స్థానిక సంస్థలో ఎస్ ఏ డబ్ల్యూ ఎం జోక్యాల ప్రణాళిక, అమలును కలిగి ఉంటుంది. స్థానిక సంస్థలు తప్పనిసరిగా వినియోగ వివరాలను 15వ ఆర్థిక సంఘం వెబ్ సైట్ లో కూడా అప్‌లోడ్ చేయాలి.
కేంద్ర ప్రభుత్వం నుండి అందిన 10 పని దినాలలోగా రాష్ట్రాలు స్థానిక సంస్థలకు గ్రాంట్లను బదిలీ చేయాలి. 10 పనిదినాలకు మించి జాప్యం జరిగినా రాష్ట్ర ప్రభుత్వాలు వడ్డీతో సహా గ్రాంట్లు విడుదల చేయాల్సి ఉంటుంది. 2022-23లో ఇప్పటివరకు విడుదల చేసిన గ్రామీణ స్థానిక సంస్థల గ్రాంట్ల మొత్తం రాష్ట్ర వారీగా క్రింద ఇవ్వబడింది;
రాష్ట్రాల వారీ 2022-23లో విడుదలైన గ్రామీణ స్థానిక సంస్థల గ్రాంట్ల మొత్తం
వరుస సంఖ్య
|
రాష్ట్రం
|
2022-23లో మొత్తం విడుదలైన నిధులు
[31-08-2022 వరకు]
రూ.కోట్లలో
|
1
|
ఆంధ్రప్రదేశ్
|
948.35
|
2
|
అరుణాచల్ ప్రదేశ్
|
0.00
|
3
|
అస్సాం
|
0.00
|
4
|
బీహార్
|
1921.00
|
5
|
చత్తిస్గఢ్
|
557.00
|
6
|
గోవా
|
0.00
|
7
|
గుజరాత్
|
1181.00
|
8
|
హర్యానా
|
0.00
|
9
|
హిమాచల్ ప్రదేశ్
|
224.30
|
10
|
ఝార్ఖండ్
|
249.80
|
11
|
కర్ణాటక
|
1046.78
|
12
|
కేరళ
|
623.00
|
13
|
మధ్యప్రదేశ్
|
1472.00
|
14
|
మహారాష్ట్ర
|
1092.92
|
15
|
మణిపూర్
|
0.00
|
16
|
మేఘాలయ
|
40.50
|
17
|
మిజోరాం
|
0.00
|
18
|
నాగాలాండ్
|
18.40
|
19
|
ఒరిస్సా
|
864.00
|
20
|
పంజాబ్
|
0.00
|
21
|
రాజస్థాన్
|
0.00
|
22
|
సిక్కిం
|
6.60
|
23
|
తమిళనాడు
|
1380.50
|
24
|
తెలంగాణ
|
273.00
|
25
|
త్రిపుర
|
73.50
|
26
|
ఉత్తరప్రదేశ్
|
3733.00
|
27
|
ఉత్తరాఖండ్
|
0.00
|
28
|
పశ్చిమ బెంగాల్
|
0.00
|
x
|
మొత్తం
|
15705.65
|
****
(Release ID: 1855978)
Visitor Counter : 186