సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
గత 8 ఏళ్లలో ప్రధానమంత్రి మోదీ చేపట్టిన సంక్షేమ పథకాలు ఎలాంటి ఓటు బ్యాంకు లేకుండా పేదలకు చేరాయి: కేంద్రమంత్రి డా.జితేంద్ర సింగ్
ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురిలో లబ్దిదారులు, పీఆర్ఐలు, డీడీసీలు, డీబీసీలు, మునిసిపల్ కౌన్సిల్ చైర్‌పర్సన్ మరియు సభ్యులతో వివిధ సమావేశాలలో మంత్రి ప్రసంగించారు.
కులం, మతం, వర్గం లేదా ఓటుతో సంబంధం లేకుండా, నిరుపేదలు, చిట్టచివరి మనిషికి చేరుకునే విధంగా కేంద్ర ప్రభుత్వ పేద, ప్రజా సంక్షేమ పథకాలు రూపొందించబడ్డాయి: డాక్టర్ జితేంద్ర సింగ్
పంచాయతీరాజ్ సంస్థల ప్రతినిధులే ప్రధాని నవ భారతానికి నిజమైన వార్తాహరులు అన్న మంత్రి
Posted On:
30 AUG 2022 2:39PM by PIB Hyderabad
కేంద్ర సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) సైన్స్ & టెక్నాలజీ; సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) ఎర్త్ సైన్సెస్, పీఎంవో, పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, పెన్షన్లు, అణుశక్తి మరియు అంతరిక్ష శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, గత 8 ఏళ్లలో ప్రధాని నరేంద్ర మోదీ సంక్షేమ పథకాలు ఎలాంటి ఓటు బ్యాంకును పరిగణనలోకి తీసుకోకుండానే పేదలకు చేరాయని అన్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురిలో "లాభర్తీలు" (లబ్దిదారులు), పీఆర్ఐలు, డీడీసీలు, బీడీసీలు, మున్సిపల్ కౌన్సిల్ చైర్‌పర్సన్లు, సభ్యులతో వివిధ సమావేశాలను ఉద్దేశించి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడారు. కులం, మతం, వర్గంతో గానీ, ఓటుతో సంబంధం కానీ లేకుండా దేశంలోని చిట్టచివరి వ్యక్తికి, నిరుపేదల కోసం, కేంద్ర ప్రభుత్వం వివిధ ప్రజా సంక్షేమ పథకాలు రూపొందించినట్లు మంత్రి తెలిపారు. ఇది దీన్ దయాళ్ ఉపాధ్యాయ యొక్క అంత్యోదయ తత్వానికి పూర్తిగా అనుగుణంగా ఉందని, అంటే చివరి వ్యక్తిని చేరుకోవడం అని ఆయన అన్నారు.
2014 మేలో మోదీ బాధ్యతలు చేపట్టేనాటికి దేశ జనాభాలో దాదాపు సగం మందికి మరుగుదొడ్లు, గృహాలు, టీకాల అందుబాటు, విద్యుత్ కనెక్షన్లు, బ్యాంకు ఖాతాలు వంటి సౌకర్యాలు లేవని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. సబ్‌కా ప్రయాస్ నినాదంతో గత 8 ఏళ్లలో కేంద్రం అనేక పథకాలను నూరు శాతం సంతృప్తతకు చేరువ చేసిందని, రానున్న 25 ఏళ్ల అమృత్‌కాల్‌లో భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా మార్చాలనే నవసంకల్పం ఉందని ఆయన అన్నారు.
ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (పీఎం-జీకేఏవై), పీఎం ఆవాస్ యోజన, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన, హర్ ఘర్ జల్, ఉజ్వల, సౌచలయ, జన్ ధన్, ఆయుష్మాన్ వంటి పౌర పథకాలు ప్రతి ఇంటికి చేరాయని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. ఎటువంటి రాజకీయాలకు తావు లేకుండా "సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ సబ్ కా ప్రయాస్" అనే సూత్రాన్ని అనుసరించడం ద్వారా సమాజంలోని పేద, వెనుకబడిన వర్గాలను చేసుకోవడానికి అత్యంత జాగ్రత్తలు తీసుకున్నారు. గతంలో మభ్యపెట్టే విధానం విచ్చలవిడిగా సాగిందని, నేడు ఎలాంటి వివక్ష లేకుండా సంక్షేమ ఫలాలు ప్రజలకు అందుతున్నాయన్నారు. ఈ సంక్షేమ చర్యలు కోట్లాది మందిని కడు పేదరికం బారి నుంచి బయటకు తీసుకొచ్చి గౌరవప్రదమైన జీవితాన్ని ఇచ్చిందని మంత్రి ఉద్ఘాటించారు.
పంచాయతీరాజ్ సంస్థలు (పీఆర్‌ఐలు), వాటి ప్రతినిధులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంక్షేమ పథకాలకు అవసరమైన వార్తహరులుగా అభివర్ణించిన కేంద్ర మంత్రి, సర్పంచులతో పాటు బ్లాక్ మరియు జిల్లా కౌన్సిల్‌లలో ఎన్నికైన ప్రజాప్రతినిధులకు ప్రత్యేక పాత్ర పోషించే అవకాశం ఉందని అన్నారు. గత ఎనిమిదేళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన పేద ప్రజలకు అనుకూలమైన, ప్రజా సంక్షేమ పథకాలు దేశంలోని చిట్టచివరి వ్యక్తికి ఈ ప్రయోజనాలు అందించాలన్నదే ప్రధాని లక్ష్యమని అన్నారు.
పంచాయతీరాజ్ సంస్థల ప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులను ఉద్దేశించి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడారు. ప్రధాని నవ భారతదేశానికి వారే నిజమైన వార్తాహరులని పీఆర్ఐలను ఉద్దేశించి అన్నారు. పిఎం ఆవాస్ యోజన, ఉజ్జ్వల, పీఎం గరీబ్ కళ్యాణ్ యోజన, ఆయుష్మాన్, PM కిసాన్ సమ్మాన్ నిధి, స్వచ్ఛత మరియు స్వచ్ఛమైన తాగునీరు వంటి పథకాల ప్రయోజనం పొందకుండా ఏ అర్హుడిని కూడా విడిచిపెట్టకుండా చూసుకోవాలని వారిని కోరారు. పేదల సంక్షేమం కోసం ప్రతి పథకంలో ఎవరూ వెనుకంజ వేయకుండా జిల్లా యంత్రాంగంతో సమన్వయంతో పని చేయాలని సూచించారు.
గత ఎనిమిదేళ్లలో మోడీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనుల గురించి, జాతీయ స్థితిని నిరాశావాదం నుండి ఆశావాదానికి ఎలా మార్చింది అనే దాని గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేయాలని డాక్టర్ జితేంద్ర సింగ్ ఎన్నికైన ప్రతినిధులను కోరారు. మోదీ ప్రభుత్వంపై ఇప్పటి వరకు ఒక్క అవినీతి ఆరోపణలు కూడా లేవని, పారదర్శకమైన పరిపాలన అందించడంలో ప్రధానమంత్రి విజయం సాధించారని మంత్రి ఉద్ఘాటించారు.
<><><><><>
(Release ID: 1855831)
Visitor Counter : 169