రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

భారతదేశం ఇక ఎంతమాత్రం బలహీనంగా లేదు, అన్ని సవాళ్లను ఎదుర్కోవడానికి బలంగా , పూర్తి సన్నద్ధంగా ఉంది: రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో రక్షణ మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింగ్ ఉద్ఘాటన


భారతదేశం ఏ దేశం పైనా తనకు తానుగా దాడి చేయదు, అలాగే ఒక్క అంగుళం విదేశీ భూమిని కూడా స్వాధీనం చేసుకోదు. అయితే ఎవరైనా చెడు దృష్టి పెట్టడానికి ప్రయత్నిస్తే, తగిన సమాధానం ఇచ్చి తీరుతుంది: రాజ్ నాథ్ సింగ్

2016 సర్జికల్ స్ట్రైక్స్ ,2019 బాలాకోట్ వైమానిక దాడులు భారతదేశ సైనిక పరాక్రమం ఏ దేశం కంటే తక్కువ కాదని చెప్పడానికి రుజువు: రక్షణ మంత్రి

Posted On: 30 AUG 2022 3:15PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ

నాయకత్వంలో భారత దేశం ఒక బలమైన, ఆత్మవిశ్వాసం నిండిన స్వావలంబనాత్మక దేశంగా మారిందని , ఇది అన్ని రకాల ముప్పులను, బెదిరింపులు, సవాళ్లను ఎదుర్కోవడానికి పూర్తి సంసిద్ధంగా ఉందని రక్షణ మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేశారు. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో సోమవారం (ఆగస్టు 30) న జరిగిన ఒక కార్యక్రమంలో శ్రీ రాజ్ నాథ్ సింగ్ ఈ

విషయాన్ని వెల్లడించారు. గత ఎనిమిదేళ్ళలో ప్రభుత్వం తీసుకున్న చర్యలు సాయుధ

దళాలలో కొత్త ఆత్మవిశ్వాసాన్ని నింపాయని ఆయన పేర్కొన్నారు. భారతదేశం ఏ దేశం పైనా తనకు తానుగా దాడి చేయదని, అలాగే ఒక్క అంగుళం విదేశీ భూమిని కూడా స్వాధీనం చేసుకోదని,  అయితే దేశ సార్వభౌమాధికారం, ఐక్యత, సమగ్రతకు భంగం కలిగించడానికి ఎవరైనా ప్రయత్నిస్తే, దీటైన సమాధానం ఇచ్చి తీరుతుందని  శ్రీ రాజ్ నాథ్ సింగ్ తేల్చి చెప్పారు.

 

గత ఎనిమిదేళ్ల చర్యల ఫలితంగా భారత్ ఇక ఎంత మాత్రం బలహీనంగా లేదు. 2016 సర్జికల్ స్ట్రైక్స్ ,2019 బాలాకోట్ వైమానిక దాడుల  ద్వారా  ఉగ్రవాదంపై భారత దేశ వైఖరిని స్పష్టం చేశామని, భారతదేశ సైనిక పరాక్రమం ఏ దేశం కంటే తక్కువ కాదని రుజువు చేశామని శ్రీ రాజ్ నాథ్ సింగ్ అన్నారు.

భారత దేశ వ్యతిరేక శక్తుల నుంచి ప్రజలను

రక్షించేందుకు సాయుధ దళాలు పూర్తి సంసిద్ధతతో ఉన్నాయని శ్రీ రాజ్ నాథ్ సింగ్

దేశ ప్రజలకు హామీ ఇచ్చారు.

 

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ

నాయకత్వంలో 'ఆత్మనిర్భర్ భారత్' కు పునాది వేయడం జరిగిందని, ఈ బలమైన , స్వావలంబనాత్మకమైన 'న్యూ ఇండియా' శక్తివంతమైన దేశాలతో భుజం భుజం కలిపి కదులుతోందని రక్షణ మంత్రి అన్నారు. ఉద్ఘాటించారు. 310 వస్తువుల మూడు సానుకూల స్వదేశీ జాబితాలను జారీ చేయడం , 2022-23 కేంద్ర బడ్జెట్లో దేశీయ పరిశ్రమకు  మూలధన సేకరణ బడ్జెట్ ను  68 శాతం కేటాయించడం సహా

రక్షణ రంగంలో ఆత్మనిర్భరతను ప్రోత్సహించడానికి రక్షణ మంత్రిత్వ శాఖ తీసుకున్న అనేక చర్యలను ఆయన వివరించారు. దేశీయ ర క్ష ణ రంగాన్ని

బలోపేతం చేయడం కోసం 'మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫ ర్ ద వ ర ల్డ్' దార్శ నికత లో భాగంగా భారత్ లో తయారీ చేయడానికి విదేశీ కంపెనీలను ప్రోత్సహిస్తున్నట్లు ఆయన తెలిపారు.

 

భారత దేశం తన సొంత అవసరాలను

తీర్చడమే కాకుండా, ఇతర దేశాల

అవసరాలను కూడా తీరుస్తున్నందున

ప్ర భుత్వం చేపట్టిన ప్రయత్నాలు ఫలించాయని శ్రీ రాజ్ నాథ్ సింగ్ అన్నారు.

ఎనిమిదేళ్ల క్రితం సుమారు రూ.900 కోట్ల విలువైన రక్షణ ఎగుమతులు ఇప్పుడు రూ.13,000 కోట్లకు పెరిగాయని ఆయన ప్రశంసించారు. 2047 నాటికి రూ.2.75 లక్షల కోట్ల విలువైన రక్ష ణ ఎగుమతుల లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ లక్ష్యాన్ని సాధించడానికి భారతదేశం బాగా పనిచేస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

 

దేశంలోనే కాకుండా ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న భారతీయుల భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రక్షణ మంత్రి పునరుద్ఘాటించారు. రష్యాతో పరిణామాల నేపథ్యంలో ఉక్రెయిన్ నుంచి

భారతీయులు క్షేమంగా తిరిగి రావడం ప్రతి ఒక్క భారతీయుడి భద్రత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దృఢ సంకల్పానికి

నిదర్శనమని రక్షణ మంత్రి ఉద్ఘాటించారు.

 

శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ఉదయపూర్‌లో 16వ శతాబ్దానికి చెందిన పన్నా ధాయ్  విగ్రహాన్ని ఆవిష్కరించారు, భారత పాలకుడు సంగ్రామ్ సింగ్ I నాల్గవ కుమారుడు రాణా సంగ గా ప్రసిద్ధి చెందిన ఉదయ్ సింగ్ II వద్ద పన్నా ధాయ్ నర్స్ మెయిడ్ గా పని చేశారు.

మేవార్ , మొత్తం దేశం ప్రయోజనాల దృష్ట్యా మహారాణ ప్రతాప్ తండ్రి అయిన రెండో

ఉదయ్ సింగ్ ను కాపాడడం కోసం తన కుమారుడిని త్యాగం చేసిన పన్నా ధాయ్ ధైర్యాన్ని శ్రీ రాజ్ నాథ్ సింగ్ ప్రశంసించారు. పన్నా ధాయి నుంచి ప్రేరణ పొంది జాతి నిర్మాణంలో తమ వంతు పాత్ర పోషించాలని ఆయన ప్రజలను కోరారు.

 

********



(Release ID: 1855520) Visitor Counter : 121