ఆయుష్
"వన్ హెర్బ్,వన్ స్టాండర్డ్" ప్రమోషన్ మరియు అందుబాటును సులభతరం చేయడానికి అంతర్ మంత్రిత్వ సహకారానికి పిసిఐఎం&హెచ్ మరియు ఐపీసీ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.
ప్రమాణాల సమకాలీకరణ " వన్ హెర్బ్, వన్ స్టాండర్డ్, వన్ నేషన్"కి దారి తీస్తుంది. అలాగే భారతదేశంలో వ్యాపారాన్ని సులభతరం చేస్తుంది
Posted On:
30 AUG 2022 2:21PM by PIB Hyderabad
ఆయుష్ మంత్రిత్వ శాఖ "వన్ హెర్బ్,వన్ స్టాండర్డ్" సాధించే క్రమంలో ఓ ముఖ్యమైన అడుగు వేసింది. అందులో భాగంగా ఫార్మాకోపోయియా కమీషన్ ఫర్ ఇండియన్ మెడిసిన్ అండ్ హోమియోపతి (ఆయుష్ మంత్రిత్వ శాఖ) మరియు ఇండియన్ ఫార్మకోపోయియా కమిషన్ (ఆరోగ్య & కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ) మధ్య హెర్బ్, వన్ స్టాండర్డ్”కు అంతర్ మంత్రిత్వ శాఖల సహకారం కోసం న్యూఢిల్లీలో ఒక అవగాహన ఒప్పందం (ఎంఓయూ) సంతకం చేయబడింది.
ప్రొఫెసర్ (వైద్య) పి.కె. ప్రజాపతి, డైరెక్టర్ (ఇన్‌చార్జ్), పిసిఐఎం&హెచ్ మరియు సెక్రటరీ-కమ్-సైంటిఫిక్ డైరెక్టర్ శ్రీ రాజీవ్ సింగ్ రఘువంశీ, ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వైద్య రాజేష్ కోటేచా సమక్షంలో ఎంఓయూపై సంతకాలు చేశారు.
ఈ సందర్భంగా ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వైద్య రాజేష్ కోటేచా మాట్లాడుతూ.. హార్మోనైజ్డ్ హెర్బల్ ఔషధ ప్రమాణాల అభివృద్ధిని సులభతరం చేయడం ద్వారా ప్రజారోగ్యాన్ని పెంపొందించేందుకు పిసిఐఎం అండ్ హెచ్ మరియు ఐపిసిల మధ్య సహకార ప్రయత్నాలను అభివృద్ధి చేయడమే ఈ ఎంఒయు యొక్క ప్రాథమిక లక్ష్యం. పిసిఐఎం&హెచ్ మరియు ఐపీసీలు రెండూ ఒకే లక్ష్యంతో పని చేస్తున్నందున "ఒక మూలిక - ఒక ప్రమాణం" సాధించడానికి ప్రమాణాలను సమన్వయం చేయడం తార్కికం మరియు అవసరం అని తెలిపారు.
శాస్త్రీయ సమాచారం మరియు ఔషధ ముడి పదార్థాలు/సారాంశాలు, సెమినార్‌లు, వర్క్‌షాప్‌లు, శిక్షణ మరియు మేధోమథన కార్యక్రమాలను పంచుకోవడం ద్వారా సాంప్రదాయ ఔషధ ప్రామాణీకరణ ప్రాంతంలో సమాచార మార్పిడిని ప్రోత్సహించడానికి ఈ అవగాహనా ఒప్పందం మరింత సులభతరం చేస్తుంది. "ఒక మూలిక ఒక ప్రమాణం" క్రింద వర్గీకరించబడిన మోనోగ్రాఫ్‌ల ప్రచురణ యొక్క ఏకైక అధికారం పిసిఐఎం అండ్ హెచ్ మాత్రమే ఉంటుంది. పిసిఐఎం అండ్ హెచ్ మరియు ఐపీసీ ద్వారా అభివృద్ధి చేయబడిన ఎంఓయూ ప్రకారం మోనోగ్రాఫ్(లు) తదనుగుణంగా గుర్తించబడతాయి;
సంబంధిత మోనోగ్రాఫ్‌లలో ఐపీసి సహకారం తగిన ప్రాంతం గుర్తించబడుతుంది. మోనోగ్రాఫ్‌ల సాంకేతిక విషయాలను పిసిఐఎం అండ్ హెచ్ మరియు ఐపీసి సంయుక్తంగా అభివృద్ధి చేస్తాయి. కాబట్టి ఈ మోనోగ్రాఫ్‌లు ఏఎస్‌యు&హెచ్ ఫార్మాకోపియా మరియు ఐపీలో ప్రచురించిన చట్టపరమైన రక్షణ కలిగి ఉంటాయి.
ఈ ప్రమాణాల సమన్వయం "ఒక మూలిక, ఒక ప్రమాణం మరియు ఒక దేశం" లక్ష్యాన్ని నెరవేరుస్తుందని మరియు భారతదేశంలో వ్యాపారాన్ని సులభతరం చేస్తుందని మరియు భారతీయ బొటానికల్స్ మొత్తం వాణిజ్యాన్ని మెరుగుపరుస్తుందని ఆయుష్ మంత్రిత్వ శాఖ విశ్వసిస్తోంది. ఇది భారత ప్రధానిచే ప్రోత్సహించబడిన ఆత్మనిర్భర్ భారత్ వైపు ఒక ముఖ్యమైన అడుగు అని రుజువు చేస్తుంది.
ఈ సందర్భంగా పీసీఐఎంఅండ్‌హెచ్ డైరెక్టర్ (ఇన్‌చార్జి) ప్రొ.(వైద్య) పి.కె.ప్రజాపతి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికీ ప్రయోజనకరంగా ఉండే మోనోగ్రాఫ్‌ల ప్రచురణకు ఈ ఎంఓయూ వీలు కల్పిస్తుంది. ఇతర సంబంధిత సాంకేతిక పనులను చేపట్టేందుకు ఔషధ మొక్కలు మరియు వాటి మూలకం మార్కర్‌ల ఎంపిక కోసం సంయుక్త కమిటీని ఏర్పాటు చేస్తారు అని తెలిపారు.
ఐపీసీ సెక్రటరీ-కమ్-సైంటిఫిక్ డైరెక్టర్ శ్రీ రాజీవ్ సింగ్ రఘువంశీ మాట్లాడుతూ “ఈ అవగాహనా ఒప్పందము మూలికా ఔషధంలోని తయారీదారులు, పరిశోధకులు మరియు నియంత్రకాలు వంటి వాటాదారులకు వారి సంబంధిత ప్రాంతాలలో ప్రపంచ స్థాయి మోనోగ్రాఫ్‌లను ఉపయోగించుకునే అవకాశాన్ని అందించబోతోంది. హెర్బల్ మెడిసిన్ రంగంలో ముఖ్యంగా నాణ్యమైన డొమైన్‌లో లోతైన పరిశోధన చేయడానికి మరియు ప్రజారోగ్యానికి దోహదపడటానికి ఐపీసీకి ఇది ఒక అవకాశం" అని తెలిపారు.
ప్రస్తుతం భారతీయ ఫార్మాకోపోయియా (ఐపీ)తో పోల్చినప్పుడు ఏఎస్‌యు&హెచ్ ఫార్మకోపోయియాస్‌లో ప్రచురించబడిన విభిన్న ప్రమాణాలు అలాగే విభిన్న విశ్లేషణాత్మక పద్ధతులు ఉన్నాయి. ఆయుష్ మంత్రిత్వ శాఖ "ఒక మూలిక - ఒక ప్రమాణం" కార్యక్రమం ద్వారా ఈ అస్పష్టతను తొలగించాలని కోరుకుంటోంది. ఈ అవగాహన ఒప్పందం ద్వారా ప్రతి మోనోగ్రాఫ్ అంతర్జాతీయ నాణ్యత అవసరాలతో పాటు భారతీయ ప్రమాణాలను కలిగి ఉంటుంది. తద్వారా అన్ని భారతీయ నాణ్యతా ప్రమాణాలు ఒకే వృక్షశాస్త్రానికి సంబంధించిన ప్రపంచ ప్రమాణాలతో సమకాలీనంగా మారతాయి.
****
(Release ID: 1855512)
Visitor Counter : 147