వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

తూనికలు కొలతల పరికరాల తయారీదారులు/దిగుమతిదారులకు ధృవీకరణ వివరాలను కోరుతూ కేంద్రం 63 షోకాజ్ నోటీసులు జారీ చేసింది

Posted On: 30 AUG 2022 10:44AM by PIB Hyderabad

కేంద్రం, డిపార్ట్‌మెంట్ ఆఫ్ లీగల్ మెట్రాలజీ ద్వారా తూనికలు  కొలతల పరికరాల తయారీదారులు/దిగుమతిదారులకు ధృవీకరణ వివరాలను కోరుతూ 63 షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో తయారీదారులు/దిగుమతిదారులు/విక్రేతదారులకు, మోడల్ ఆమోదం, తయారీ/దిగుమతిదారు/డీలర్ లైసెన్స్ మరియు తూనిక ప్రమాణాల ధృవీకరణ వివరాలను కోరుతూ నోటీసులు జారీ చేసారు.

 

కొంతమంది తూనికలు కొలతల పరికరాల తయారీదారులు/దిగుమతిదారులు చట్టంలోని నిబంధనలకు విరుద్ధంగా ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో  బరువు యంత్రాలు, కిచెన్ స్కేల్స్ మొదలైన వాటిని విక్రయిస్తున్నట్లు గమనించబడింది. ఇ-కామర్స్ సైట్‌లలో ఇటువంటి అనధికారిక విక్రయాలు వినియోగదారునికి నష్టమే  కాకుండా ప్రభుత్వ ఆదాయం కూడా కోల్పోతుంది.

 

వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించడానికి మరియు ప్రభుత్వ ఆదాయానికి , తూనికలు  కొలతల పరికరాల తయారీదారులు/దిగుమతిదారులు వారి తూనికలు  కొలతల పరికరాల తయారీ లైసెన్స్ (సెక్షన్ 23)/ దిగుమతిదారు రిజిస్ట్రేషన్ (సెక్షన్ 19), మోడల్ (సెక్షన్ 22) ఆమోదం మరియు లీగల్ మెట్రాలజీ చట్టం, 2009 ప్రకారం తూనికలు  కొలతల పరికరం  ధృవీకరణ/స్టాంపింగ్ (సెక్షన్ 24) పొందవలసి ఉంటుంది. 

 

వినియోగదారుల ప్రయోజనాల దృష్ట్యా   తూనికలు  కొలతల పరికరాల యొక్క ప్రీ ప్యాకేజీ/ఇ కామర్స్ ప్లాట్‌ఫారమ్‌పై ప్రకటనలు లీగల్ మెట్రాలజీ (ప్యాకేజ్డ్ కమోడిటీస్),  2011లోని నిబంధనల (రూల్ 6)కి అనుగుణంగా ఉండాలి. తూనికలు  కొలతల పరికరాల నమూనా ఆమోదం, తయారీ లైసెన్స్/దిగుమతిదారు రిజిస్ట్రేషన్ మరియు పరీక్ష /స్టాంపింగ్ తూకం  కొలిచే సాధనాలు  మరియు తూకాలు, కొలతలు మరియు బరువు కొలమానం ద్వారా విక్రయించే ఇతర వస్తువుల వాణిజ్యాన్ని నియంత్రించడంతప్పనిసరి.

 

తూనికలు  కొలతల పరికరాల లేదా సంఖ్య కొలిచే సాధనాల నమూనా ఆమోదం, తయారీ లైసెన్స్/దిగుమతిదారు రిజిస్ట్రేషన్ మరియు తూకం, కొలిచే సాధనాల పరీక్ష/స్టాంపింగ్ వినియోగదారుల ప్రయోజనాల దృష్ట్యా అవసరం. బరువు కొలత ద్వారా విక్రయించే తూకాలు, కొలతలు మరియు ఇతర వస్తువుల వాణిజ్యాన్ని నియంత్రించడం,  వినియోగదారులకు  ప్యాకేజీ వస్తువు/ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లో ఉత్పత్తి యొక్క ముందస్తు సమాచారం తప్పనిసరిగా ప్రకటించాల్సి  ఉంటుంది.

 

తూనికలు  కొలతల పరికరాల తయారీదారు/దిగుమతిదారు  తయారు చేయబడిన/దిగుమతి చేయబడిన, విక్రయించబడిన/పంపిణీ చేయబడిన పరికరాల సంఖ్య మరియు వాటి భాగాలు మరియు ప్రభుత్వానికి చెల్లించిన ధృవీకరణ రుసుముల వివరాల రికార్డులను నిర్వహించవలసి ఉంటుంది.

 

లీగల్ మెట్రాలజీ చట్టంలోని ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే సెక్షన్ 32 (మోడల్ ఆమోదం పొందడంలో వైఫల్యం), సెక్షన్ 45 (లైసెన్స్ లేకుండా బరువు మరియు కొలతల తయారీకి జరిమానా), సెక్షన్ 38 (తూనికలు  కొలతల పరికరాల దిగుమతి చేసుకునేవారు నమోదు చేయనందుకు జరిమానా), సెక్షన్ 33 (ధృవీకరించబడని బరువు లేదా కొలతను ఉపయోగించడం కోసం జరిమానా) మరియు సెక్షన్ 36 (ప్రామాణికం కాని ప్యాకేజీల విక్రయం, మొదలైనవి) ల కింద జరిమానా లేదా జైలు శిక్ష లేదా రెండూ విధించబడుతుంది.

 

 

***(Release ID: 1855419) Visitor Counter : 285