యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

రేపు జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా 25 నగరాల్లో ప్రధాని మోదీ ‘మీట్ ది ఛాంపియన్’ కార్యక్రమం


- శాయ్ భారతదేశం అంతటా త‌న అన్ని కేంద్రాల్లో క్రీడా కార్యకలాపాలతో ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌నుంది

Posted On: 28 AUG 2022 7:26PM by PIB Hyderabad

ఆగస్టు 29న ‘జాతీయ క్రీడా దినోత్సవం‘ సందర్భంగా, యువజన వ్యవహారాలు,  క్రీడల మంత్రిత్వ శాఖ (ఎంఏవైఎస్‌) దేశవ్యాప్తంగా 26 పాఠశాలల్లో *'మీట్ ది ఛాంపియన్'* కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈ కార్య‌క్ర‌మంలో కామన్వెల్త్ క్రీడ‌లు (సీడ‌బ్ల్యుజీ ) మరియు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ల‌లో  బంగారు ప‌త‌కం గెలుచుకున్న‌  నిఖత్ జరీన్, పారాలింపిక్స్ మరియు సీడ‌బ్ల్యుజీ  పతక విజేత భవినా పటేల్, టోక్యో ఒలింపిక్స్ మరియు సీడ‌బ్ల్యుజీ పతక విజేత మన్‌ప్రీత్ సింగ్ వంటి ప‌లువురు ప్రముఖ అథ్లెట్లు కొంత మంది పాల్గొన‌నున్నారు. 'మీట్ ది ఛాంపియన్స్' అనేది గత సంవత్సరం డిసెంబర్‌లో ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రాచే  ప్రారంభం చేయ‌బ‌డిన  పాఠశాల సందర్శన ప్రచారానికి సంబంధించిన ఒక కార్య‌క్ర‌మం., ఇది గత కొన్ని నెలలుగా దేశంలోని వివిధ ప్రాంతాలకు చేరుకుంది. పాఠశాల సందర్శన సమయంలో ఛాంపియన్ అథ్లెట్ వారి అనుభవాలు, జీవిత పాఠాలు మరియు సరైన ఆహారం ఎలా తీసుకోవాలనే దానిపై చిట్కాలను పంచుకుంటారు. పాఠశాల పిల్లలంద‌రికీ  స్ఫూర్తిదాయకమైన ప్రోత్సాహాన్ని అందిస్తారు. జాతీయ క్రీడా దినోత్సవం ప్రత్యేక సందర్భం మరియు హాకీ లెజెండ్ మేజర్ ధ్యాన్ చంద్‌కు నివాళిగా, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (శాయ్‌) ఇటీవల ముగిసిన కామన్ వెల్త్ గేమ్స్ (సీడ‌బ్ల్యుజీ), ప్రపంచ ఛాంపియన్‌షిప్ కార్య‌క్ర‌మాల‌ లో పాల్గొన్న క్రీడాకారులను ఈ కార్య‌క్ర‌మంలో చేర్చడానికి చొరవను విస్తరించింది.  స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా ఈ సంవత్సరం జాతీయ క్రీడా దినోత్సవాన్ని, ఫిట్ ఇండియా ప్రచారంలో భాగంగా, పాన్-ఇండియా క్రీడా కార్య‌క్ర‌మాల‌ ద్వారా స్పోర్ట్స్ అనే థీమ్‌తో కలుపుకొని మరియు ఫిట్ సొసైటీకి ఎనేబుల్‌గా ఉంటుంది. వివిధ స్థాయిల కోసం క్రీడా ఈవెంట్‌లు నిర్వహించబడతాయి, వివిధ వయసుల వ్యక్తుల మధ్య వృత్తిపరమైన,  వినోద కార్యక్రమాలతో సహా అన్ని వర్గాల ప్రజల మధ్య క్రీయా స్ఫూర్తిని నింపెలా ఈ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌బ‌డుతాయి. సాయంత్రం, కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్, కేంద్ర విద్యా మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్, యువజన వ్యవహారాలు మరియు క్రీడల శాఖ సహాయ మంత్రి శ్రీ నిసిత్ ప్రమాణిక్ కూడా కొన్ని క్రీడలు మరియు ఫిట్‌నెస్‌కు సంబంధించిన  ప్రత్యేక వర్చువల్ ఇంటరాక్షన్ కార్య‌క్ర‌మంలో పాల్గొంటారు. భారతదేశంలో ఫిట్‌నెస్, క్రీడలకు ఉన్న ప్రాముఖ్యతను చర్చించడానికి  భారతదేశ ఫిట్‌నెస్ చిరునామాలుగా నిలిచిన వారితో ఈ ఇంటరాక్షన్ కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌నున్నారు.

***

 



(Release ID: 1855133) Visitor Counter : 439