నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ

రికగ్నిషన్ ఆఫ్ ప్రియర్ లెర్నింగ్ (ఆర్పీఎల్) పూర్తిచేసిన న్యూ ఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ సిబ్బందికి శ్రీ వినయ్ కుమార్ సక్సేనా తో కలిసి సర్టిఫికెట్లు అందజేసిన శ్రీ ధర్మేంద్ర ప్రధాన్


ఆత్మ నిర్భర్ భారత్ సాధనలో నైపుణ్యాభివృద్ధి కీలకంగా ఉంటుంది.. శ్రీ ధర్మేంద్ర ప్రధాన్
ఆగస్టు నెలలో ఆర్పీఎల్ పొందిన 900 మంది ఎన్ డీఎంసీ సిబ్బంది

Posted On: 27 AUG 2022 5:09PM by PIB Hyderabad

 

రికగ్నిషన్ ఆఫ్ ప్రియర్ లెర్నింగ్ కార్యక్రమాన్ని పూర్తి చేసిన    న్యూ ఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్   సిబ్బందికి శ్రీ వినయ్ కుమార్  సక్సేనా తో కలిసి కేంద్ర విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ ఢిల్లీలో సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఢిల్లీ ముఖ్య కార్యదర్శి శ్రీ నరేష్ కుమార్,   నైపుణ్యాభివృద్ధి,వ్యవస్థాపక ప్రోత్సాహక మంత్రిత్వ శాఖ   కార్యదర్శి శ్రీ రాజేష్ అగర్వాల్, ఎంఎస్ డీఈ అధ్యక్షుడు శ్రీ భూపేందర్ సింగ్ భల్ల,  జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ   సీఈవో శ్రీ వేద్ మణి తివారి,  జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ   కు చెందిన ఇతర అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
న్యూ ఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ పరిధిలో స్కిల్ ఇండియా మిషన్ కింద నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వడం జరిగింది. ఆగస్టు నెలలో రికగ్నిషన్ ఆఫ్ ప్రియర్ లెర్నింగ్ కార్యక్రమాన్ని  శిక్షణ పూర్తి చేసుకున్న 900 మంది సిబ్బందికి సర్టిఫికెట్లను అందజేశారు. శిక్షణ కార్యక్రమాన్ని న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ మరియు స్కిల్స్ అక్విజిషన్ అండ్ నాలెడ్జ్ అవేర్‌నెస్ ఫర్ లైవ్లీహుడ్ ప్రమోషన్ (SANKALP) నిర్వహించాయి.ప్రపంచ బ్యాంకు సమకూర్చిన నిధులతో కేంద్ర నైపుణ్యాభివృద్ధి,వ్యవస్థాపక ప్రోత్సాహక మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్నది.  నైపుణ్యాభివృద్ధి,వ్యవస్థాపక ప్రోత్సాహక మంత్రిత్వ శాఖ సాంకేతిక సహకారం అందిస్తున్న జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ అమలు చేస్తున్న కార్యక్రమాన్ని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ వినయ్ కుమార్ సక్సేనా ఆగస్టు 5 , 2022 న ప్రారంభించారు. కార్యక్రమం మొదటి దశలో 25,000 మంది సిబ్బందికి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది.
శిక్షణ పూర్తి చేసిన సిబ్బందికి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్  అభినందనలు తెలిపారు.  ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ వినయ్ కుమార్ సక్సేనా పర్యవేక్షణలో జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ , న్యూ ఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ అమలు చేస్తున్న కార్యక్రమాలు  భారతదేశాన్ని $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చే దిశలో సాగుతున్న ప్రయత్నాలకు బలం చేకూరుస్తుందని మంత్రి అన్నారు.వికసిత్ భారత్ నిర్మాణ లక్ష్యాన్ని నెరవేర్చే అంశంలో నైపుణ్యాభివృద్ధి కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. . దేశ నిర్మాణానికి మరియు  ఆత్మనిర్భర్ భారతదేశం నిర్మాణంలో నైపుణ్యం పొందిన  శ్రామిక శక్తిని అందించడం లో ఇటువంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని శ్రీ ప్రధాన్ పేర్కొన్నారు.  అమృత్‌కాల్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన 'పంచ్ ప్రాణ్' విధానాలను అమలు చేసి  భారతదేశాన్ని ఆర్థిక సూపర్ పవర్‌గా మార్చడానికి దేశ  శ్రామిక శక్తి ఉత్పాదకతను పెంచాల్సి ఉంటుందని మంత్రి అన్నారు.
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ వినయ్ కుమార్ సక్సేనా మాట్లాడుతూ వివిధ రంగాలలో నైపుణ్యాభివృద్ధి కోసం  శిక్షణ పొందిన   900 మంది సిబ్బందిని అభినందించారు. ఉద్యోగంలో నూతన   శిఖరాలను చేరుకోవడానికి   సర్టిఫికేట్లు దోహదపడతాయని అన్నారు. దృఢమైన నైపుణ్యాభివృద్ధి వ్యవస్థను రూపొందించేందుకు సంప్రదాయ కళాకారుల నైపుణ్యాన్ని పెంపొందించాల్సి ఉంటుందని అన్నారు.సిబ్బందిలో  మహిళల సంఖ్య పెరగడం పట్ల హర్షం వ్యక్తం చేసిన లెఫ్టినెంట్ గవర్నర్  ఉపాధి అవకాశాలు ఎక్కువగా పొందేందుకు మహిళలు తమ నైపుణ్యాలను మెరుగు పరుచుకోవాలని సూచించారు.  
ప్రియర్ లెర్నింగ్ గుర్తింపు (RPL) అనేది ఒక వ్యక్తి కలిగి ఉన్న  ప్రస్తుత నైపుణ్యం , ఉద్యోగంలో పని చేయడం లేదా సంవత్సరాలుగా నేర్చుకోవడం ద్వారా పొందిన జ్ఞానం మరియు అనుభవాన్ని అంచనా వేయడానికి ఉపయోగించే ప్రక్రియ. ఈ కార్యక్రమం కింద కార్మికులు నిర్మాణం, ఎలక్ట్రికల్, ప్లంబింగ్, కుండలు, హస్తకళలు మరియు మరిన్నింటిలో బహుళ ట్రేడ్‌లలో శిక్షణ పొంది నైపుణ్యాభివృద్ధి పొందుతారు. కార్యక్రమం  మొదటి దశలో  నవంబర్ 2022 నాటికి బహుళ ఉద్యోగ రంగాల్లో 25,000 మందికి నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది.  రెండవ దశలో 5,000 మందికి వ్యవస్థాపకత కార్యక్రమం ద్వారా మరియు మూడవ దశలో 45,000 మందికి నైపుణ్యాభివృద్ధి లో శిక్షణ  లభిస్తుంది.
నిర్దిష్ట శిక్షణ, మూల్యాంకన ప్రక్రియను పరిచయం చేయడం, సాంకేతికత  టెక్-ఆధారిత నైపుణ్యాలను అందించడం,  వ్యవస్థాపకత అంశంపై అవగాహన కల్పించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి   12 గంటల తప్పనిసరి శిక్షణ  అందించబడుతుంది.
నైపుణ్యాభివృద్ధి అంశానికి ప్రస్తుతం ప్రాధాన్యత పెరిగిందని మంత్రి పేర్కొన్నారు. సంప్రదాయ వ్యాపార రంగాలు అభివృద్ధి సాధించేందుకు నైపుణ్యం అభివృద్ధి చేసుకోవలసి ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు.   భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ చెల్లింపుల మార్కెట్‌లలో ఒకటిగా గుర్తింపు పొందింది.  మునుపెన్నడూ లేని విధంగా డిజిటలైజేషన్‌ను అనుసరించవలసి ఉంటుంది.  బ్లాక్‌చెయిన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఆటోమేషన్, రోబోటిక్స్ మొదలైన రంగాల్లో  నైపుణ్యాలు అభివృద్ధి చేసుకోవలసి ఉంటుంది.

***



(Release ID: 1854981) Visitor Counter : 160