ప్రధాన మంత్రి కార్యాలయం

దేశం లోని రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల కార్మిక మంత్రుల జాతీయ కార్మిక సదస్సులో ప్రసంగించిన ప్రధాన మంత్రి


‘అమృత్ కాల్‌’లో అభివృద్ధి చెందిన దేశాన్ని నిర్మించాలనే భారతదేశ కలలు , ఆకాంక్షలను సాకారం చేయడంలో భారత శ్రామిక శక్తికి మహత్తర పాత్ర ఉంది": ప్రధాని


"భారతదేశాన్ని వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఒకటిగా మరోసారి రూపొందించడంలో మన కార్మికుల భాగస్వామ్యం ఎన్నదగినది'గా ఉంది"


"గత ఎనిమిదేళ్లలో ప్రభుత్వం , బానిసత్వ కాలపు చట్టాలను రద్దు చేయడానికి , బానిస మనస్తత్వాన్ని ప్రతిబింబించే చర్యలు దునుమాడడానికి చొరవ తీసుకుంది"


"కార్మిక మంత్రిత్వ శాఖ అమృత్ కాల్‌లో 2047 సంవత్సరానికి "సాకారమయ్యే తన దూరదృష్టి ప్రణాళిక సిద్ధం చేస్తోంది"

సౌకర్యవంతమైన కార్యాలయాలు, ఇంటి నుండి పని చేసే వెసులుబాటు నెరిపే వ్యవస్థ, సౌకర్యవంతమైన పని గంటలు వంటివి భవిష్యత్తు అవసరం"


"మహిళల శ్రామిక శక్తి భాగస్వామ్యానికి అవకాశాలుగా అనువైన కార్యాలయాల వంటి వ్యవస్థలను మనం ఉపయోగించుకోవచ్చు"


"భవన నిర్మాణ కార్మికులకు 'సెస్' పూర్తి వినియోగం తప్పనిసరి. రాష్ట్రాలు కేటాయించిన రూ.38000 కోట్లకు పైబడిన మూల ధనాన్ని వినియోగించలేదు.

Posted On: 25 AUG 2022 5:43PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల కార్మిక మంత్రుల జాతీయ సదస్సులో ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు శ్రీ భూపేందర్ యాదవ్, శ్రీ రామేశ్వర్ తేలి, అన్ని రాష్ట్రాల కార్మిక మంత్రులు పాల్గొన్నారు.

తిరుపతి శ్రీ వేంకటేశ్వరునికి నమస్కరిస్తూ ప్రధాని తన ప్రసంగాన్ని ప్రారంభించారు. అమృత్కాల్లో అభివృద్ధి చెందిన దేశాన్ని నిర్మించాలనే భారతదేశ కలలు, ఆకాంక్షలను సాకారం చేయడంలో భారతదేశ కార్మిక శక్తి చాలా ప్రముఖ పాత్ర పోషిస్తుందని, ఈ ఆలోచనతో దేశం సంఘటిత, అసంఘటిత రంగానికి చెందిన కోట్లాది మంది కార్మికుల కోసం నిరంతరం కృషి చేస్తుందని ప్రధాన మంత్రి ఉద్ఘాటించారు.

ప్రధాన మంత్రి శ్రమ్-యోగి మాన్ధన్ యోజన, ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన, ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన వంటి కార్మికులకు భద్రత కల్పించిన ప్రభుత్వ వివిధ ప్రయత్నాలను ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. ఈ పథకాలు కార్మికులకు వారి కష్టానికి, సహకారానికి గుర్తింపునిచ్చాయి. అత్యవసర రుణ హామీ పథకం, ఒక అధ్యయనం ప్రకారం, మహమ్మారి సమయంలో 1.5 కోట్ల ఉద్యోగాలను నిలిపిందిఅని కూడా ప్రధాన మంత్రి అన్నారు. “దేశం తన కార్మికులకు వారి అవసరమైన సమయంలో మద్దతు ఇచ్చినట్లే, కార్మికులు ఈ మహమ్మారి నుండి కోలుకోవడానికి తమ పూర్తి శక్తిని అందించడం మనమందరం గమనించాం." ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఈ రోజు భారదేశం మరోసారి అవరించిందని, ముఖ్య భూమిక పోషించినందుకు కార్మికుల శ్రమ, భాగస్వామ్యం ఎనలేనిదని మన ప్రధాని మంత్రి అన్నారు.

శ్రామిక శక్తిని సామాజిక భద్రత పరిధిలోకి తీసుకురావడానికి ఇ-శ్రమ్ పోర్టల్ కీలకమైన కార్యక్రమాలలో ఒకటి అని ప్రధాన మంత్రి సూచించారు. కేవలం ఒక్క సంవత్సరంలోనే 400 ప్రాంతాల నుంచి దాదాపు 28 కోట్ల మంది కార్మికులు ఈ పోర్టల్లో నమోదు చేసుకున్నారు. ఇది ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు, వలస కూలీలు, గృహ కార్మికులకు ప్రయోజనం చేకూర్చింది. రాష్ట్ర పోర్టల్లను ఇ-శ్రమ్ పోర్టల్తో అనుసంధానం చేయాలని మంత్రులందరినీ ఆయన అభ్యర్థించారు.

గత ఎనిమిదేళ్లలో, బానిస మనస్తత్వాన్ని ప్రతిబింబించే బానిసత్వ కాలపు చట్టాలను రద్దు చేయడానికి ప్రభుత్వం చొరవ తీసుకుందని ఆయన అన్నారు. దేశం ఇప్పుడు మారుతోంది, సంస్కరిస్తోంది, అటువంటి కార్మిక చట్టాలను సులభతరం చేస్తోంది.”, అని ప్రధాన మంత్రి అన్నారు. "ఈ ఆలోచనతోనే, 29 కార్మిక చట్టాలు 4 సాధారణ లేబర్ కోడ్లుగా మార్పు చెందాయి". ఇది కార్మికులకు కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత ,-ఆరోగ్య భద్రత ద్వారా సాధికారతను నిర్ధారిస్తుంది అని వారన్నారు.

మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మనమంతా మారాల్సిన అవసరాన్ని ప్రధాని పునరుద్ఘాటించారు. త్వరితగతిన నిర్ణయాలు తీసుకుని వాటిని వేగంగా అమలు చేయడం ద్వారా నాలుగో పారిశ్రామిక విప్లవాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. అసంఘటిత, జట్టు కూలీ, రోజు కూలీ ఆర్ధిక పని వ్యవస్థ ,-ఆన్లైన్ సౌకర్యాల వెలుగులో, అభివృద్ధి చెందుతున్న పరిమాణాల పట్ల అప్రమత్తంగా ఉండవలసిన అవసరాన్ని ప్రధాన మంత్రి నొక్కిచెప్పారు. "ఈ రంగంలో సరైన విధానాలు, ప్రయత్నాలు భారతదేశాన్ని ప్రపంచ నాయకత్వం వహించడానికి సహాయపడతాయి" అని ఆయన అన్నారు.

దేశ కార్మిక మంత్రిత్వ శాఖ 2047 సంవత్సరానికి సంబంధించిన దూరద్రుషి ప్రణాళికను అమృత్కాల్సమయంలో సిద్ధం చేస్తోందని ప్రధాన మంత్రి నొక్కి చెప్పారు. భవిష్యత్తుకు అనువైన పని ప్రదేశాలు, వర్క్ ఫ్రమ్ హోమ్ వ్యవస్థ ,సౌకర్యవంతమైన పని గంటలు అవసరమని పునరుద్ఘాటించిన ప్రధాన మంత్రి, మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యానికి అనువైన పని ప్రదేశాలు వంటి వ్యవస్థలను మనం అవకాశాలుగా ఉపయోగించుకోవచ్చని అన్నారు. ఆగస్టు 15వ తేదీన ఎర్రకోట ప్రాకారాల నుండి జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగాన్ని గుర్తుచేసుకున్న ప్రధాని, దేశ మహిళా శక్తి సంపూర్ణంగా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. "మహిళా శక్తిని అనువుగా ఉపయోగించడం ద్వారా, భారతదేశం తన లక్ష్యాలను వేగంగా సాధించగలదు" అని ఆయన అన్నారు. దేశంలో కొత్త గా అభివృద్ధి చెందుతున్న రంగాల్లో మహిళల కోసం ఏం చేయాలనే దిశ గా ఆలోచించాల్సిన అవసరం ఉందని ప్రధాన మంత్రి ప్రస్తావించారు.

భారదేశ జనబలాన్ని గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, 21వ శతాబ్దంలో భారదేశం విజయం దానిని ఎంత మేరకు ద్వినియోగం చేసుకుంటుందనే దానిపై ఆధారపడి ఉంటుందని అన్నారు. "అత్యున్నత-నాణ్యత కలిగిన నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తిని సృష్టించడం ద్వారా మనం ప్రపంచ అవకాశాలను సద్వినియోగం చేసుకోవచ్చు" అని ఆయన అన్నారు. ప్రపంచంలోని అనేక దేశాలతో భారదేశం వలస, చలనశీలుర భాగస్వామ్యం పై ఒప్పందాలు కుదుర్చుకుంటోందని, ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని దేశంలోని అన్ని రాష్ట్రాలకు ప్రధానిమంత్రి ప్రకటించారు. "మనం మన ప్రయత్నాలను పెంచుకోవాలి, ఒకరి నుండి ఒకరు నేర్చుకోవాలి" అని వారు చెప్పారు.

 

మన భవన, నిర్మాణ కార్మికులు మన శ్రామికశక్తి అంతర్భాగమేనన్న వాస్తవాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేసేందుకు ప్రధాన మంత్రి, ఈ సందర్భంగా హాజరైన ప్రతి ఒక్కరూ వారి కోసం ఏర్పాటు చేసిన 'సెస్'ను పూర్తిగా ఉపయోగించుకోవాలని అభ్యర్థించారు. ఈ సెస్లో దాదాపు రూ. 38,000 కోట్ల నిధి ఉన్నప్పటికీ రాష్ట్రాలు ఇప్పటికీ వినియోగించుకోలేదని నాకు తెలిసింది”, అని ప్రధాన మంత్రి అన్నారు. ఆయుష్మాన్ భారత్ పథకంతో పాటు ఉద్యోగుల రాష్ట్ర బీమా కార్పొరేషన్ మరింత ఎక్కువ మంది కార్మికులకు ఎలా ప్రయోజనం చేకూరుస్తుందనే దానిపై ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహించాలని ఆయన కోరారు. దేశం నిజమైన సామర్థ్యాన్ని బహిర్గతం చేయడంలో మన ఈ సమిష్టి కృషి ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని ప్రతి ఒక్కరికీ హామీ ఇస్తూ ప్రధాన మంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.

నేపథ్య సమాచారం :

రెండు రోజుల సదస్సును కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ 2022 ఆగస్టు 25-26 తేదీలలో ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో నిర్వహిస్తోంది. వివిధ ముఖ్యమైన కార్మిక సంబంధిత సమస్యలపై చర్చించేందుకు సహకార సమాఖ్య స్ఫూర్తితో ఈ సదస్సును ఏర్పాటు చేస్తున్నారు. మెరుగైన విధానాలను రూపొందించడంలో , కార్మికుల సంక్షేమం కోసం పథకాలను సమర్థవంతంగా అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మరింత సమన్వయాన్ని సృష్టించేందుకు ఇది సహాయపడుతుంది.

సామాజిక రక్షణను సార్వత్రికంగా అమలు చేయడానికి సామాజిక భద్రతా పథకాలను ఆన్బోర్డింగ్ చేయడం కోసం ఇ-శ్రామ్ పోర్టల్ను ఏకీకృతం చేయడంపై సమావేశంలో నాలుగు నేపథ్య సెషన్లు ఉంటాయి; రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే ESI ఆసుపత్రుల ద్వారా వైద్య సంరక్షణ మెరుగుపరచడం , ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన తో ఏకీకరణ కోసం స్వాస్థ్య సే సమృద్ధి; నాలుగు లేబర్ కోడ్ల క్రింద నియమాలను రూపొందించడం,వాటి అమలు కోసం పద్ధతులు; విజన్ శ్రమేవ్ జయతే @ 2047 పనికి న్యాయమైన, సమాన అవకాశాల పరిస్థితులు, గిగ్, ప్లాట్ఫారమ్(అసంఘటిత) వర్కర్లతో సహా కార్మికులందరికీ సామాజిక రక్షణ, పనిలో లింగ సమానత్వం, ఇంకా మరికొన్ని సమస్యలపై దృష్టి సారిస్తోంది.

అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల కార్మిక మంత్రుల జాతీయ కార్మిక సదస్సులో ప్రధాని  ప్రసంగం

 

 



 



*****



(Release ID: 1854686) Visitor Counter : 234