చట్ట, న్యాయ మంత్రిత్వ శాఖ
వాణిజ్య న్యాయస్థానాలు మధ్యవర్తిత్వం మరియు ప్రత్యామ్నయ వివాద పరిష్కార యంత్రాంగాల అంశాలలో అనుభవాలు మరియు ఉత్తమ విధానాలను పంచుకోవడానికి భారతదేశం-యుకె లు అంగీకరించాయి.
కేసు నిర్వహణ, న్యాయ సహాయం మరియు ఒప్పందాల అమలులో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం గురించిన అనుభవాలను పంచుకోవడానికి రెండు దేశాలు అంగీకరించాయి
లీగల్ సర్వీసెస్ కమిటీ (LSC) సమావేశంలో యూ కే న్యాయ సంస్థలు మరియు ఆ దేశ లాయర్ల ప్రవేశానికి సంబంధించిన నిబంధనలను రూపొందించడం పై చర్చించారు.
Posted On:
23 AUG 2022 1:05PM by PIB Hyderabad
భారతదేశం-యుకె జాయింట్ కన్సల్టేటివ్ కమిటీ (జెసిసి) ఇటీవలి నిర్వహించిన సమావేశంలో,కేసు నిర్వహణ, న్యాయ సహాయం, ఒప్పందాల అమలు మరియు సాధారణ శాసన ముసాయిదా వ్రాత, వాణిజ్య న్యాయస్థానాల పనితీరు, మధ్యవర్తిత్వం, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం వంటి ప్రత్యామ్నాయ వివాద పరిష్కార యంత్రాంగాలలో అనుభవాలు మరియు ఉత్తమ విధానాలను పంచుకోవడాన్ని సులభతరం చేయడానికి విస్తృత ఒప్పందం కుదిరింది. న్యాయ సలహాదారులు, లేఖకులు, న్యాయాధికారులు, ప్రాసిక్యూటర్లు మరియు న్యాయ నిపుణుల కోసం ప్రఖ్యాత విద్యాసంస్థల్లో శిక్షణ మరియు సామర్థ్యాన్ని పెంపొందించే కార్యక్రమాలు సమయానుకూలంగా నిర్వహించడానికి అంగీకరించాయి.
భారతదేశం మరియు యునైటెడ్ కింగ్‌డమ్ లు చట్టం మరియు న్యాయ రంగంలో ఇరు దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి 10 జూలై 2018 న ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. సహకార స్ఫూర్తి తో ముందుకు సాగే మార్గాన్ని పటిష్టం చేయడం ద్వారా లక్ష్యాలను నెరవేర్చడానికి జాయింట్ కన్సల్టేటివ్ కమిటీ (జెసిసి) ఏర్పాటు చేయబడింది. జె సి సి మూడవ ప్రత్యక్ష సమావేశం 18 ఆగస్టు 2022న న్యూఢిల్లీలో జరిగింది.
భారత ప్రతినిధి బృందానికి న్యాయ కార్యదర్శి డాక్టర్ నితేన్ చంద్ర నాయకత్వం వహించారు. న్యాయ వ్యవహారాల శాఖ, శాసన శాఖ మరియు న్యాయ శాఖ సీనియర్ అధికారులు, సభ్య కార్యదర్శి నల్సా మరియు డైరెక్టర్ ఇండియన్ లా ఇన్స్టిట్యూట్, న్యూ ఢిల్లీ భారతదేశం వైపు నుండి చర్చల్లో పాల్గొన్నారు. యూ కే పక్షానికి ప్రభుత్వంలోని న్యాయ మంత్రిత్వ శాఖ రెండవ శాశ్వత కార్యదర్శి డాక్టర్ జో ఫర్రార్ నాయకత్వం వహించారు. ఆమెతో పాటు న్యూ ఢిల్లీలోని న్యాయ మంత్రిత్వ శాఖ మరియు బ్రిటిష్ హైకమిషన్ సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశాలకు ఇరువురు నేతలు సహ అధ్యక్షత వహించారు.
ఎమ్ఒయు కు అనుగుణంగా యూ కే న్యాయ సంస్థలు మరియు న్యాయవాదుల ప్రవేశానికి సంబంధించిన నిబంధనలను రూపొందించే అంశానికి సంబంధించి, 2022 ఆగస్టు 18వ తేదీన జరిగిన లీగల్ సర్వీసెస్ కమిటీ సమావేశంలో ప్రత్యేకంగా చర్చించబడింది. పైన పేర్కొన్న విధంగా ఇరు దేశాలకు చెందినఅధికారులు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మరియు లా సొసైటీ ఆఫ్ ఇంగ్లాండ్ మరియు వేల్స్ ప్రతినిధులు కమిటీలో ఉంటారు. లీగల్ సర్వీసెస్ కమిటీ సమావేశంలో మే 4, 2021న గౌరవనీయ భారతదేశం మరియు యూ కే ప్రధానమంత్రుల మధ్య జరిగిన ఇండియా-యుకె వర్చువల్ సమ్మిట్ ఫలితాలను గుర్తుచేసుకుంది. 'మెరుగైన వాణిజ్య భాగస్వామ్యం' ని ప్రారంభించింది. పరస్పర సహకరం ప్రాతిపదికన భారతదేశంలో న్యాయ సేవల రంగంలో ప్రవేశం తో పాటు పరస్పరం మార్కెట్ ప్రవేశాలను సులభతరం చేయడానికి రెండు దేశాల మధ్య వాణిజ్య ప్రగతి ని బలోపేతం చేయడానికి అంగీకరించాయి.
లీగల్ సర్వీసెస్ కమిటీ చర్చలకు భారతదేశంలోని బ్రిటిష్ హైకమిషనర్ అలెక్స్ ఎల్లిస్ కూడా హాజరయ్యారు. న్యాయ సేవల రంగం పరస్పర ప్రవేశాలకు ఎదురవుతున్న సవాళ్లపై ఇరువర్గాలు పరస్పర ఆందోళన నేపథ్యంలో ఈ సమావేశం సుహృద్భావ వాతావరణంలో జరిగింది. ప్రెసిడెంట్ లా సొసైటీ ఆఫ్ ఇంగ్లండ్ మరియు వేల్స్ ఆమె బృందంతో కలిసి సమావేశంలో అప్రత్యక్షంగా పాల్గొన్నారు. యూ కే లో ప్రాక్టీస్ కు అర్హత లేని న్యాయవాదులకు వృత్తి మరియు న్యాయ సలహాలను అందించటానికి తోడ్పడే విధాన నిబంధనలను ఆమె వివరించారు. సెక్రటరీ బి సి ఐ తాము ప్రాతినిధ్యం వహించే న్యాయవాదుల హక్కులు, అధికారాలు మరియు ప్రయోజనాలను పరిరక్షించడానికి కౌన్సిల్ బాధ్యతల గురించి చెప్పారు. న్యాయ సేవల రంగం లో ఇరు దేశాల న్యాయవాదులకు ద్వారాలు తెరవడం వల్ల ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థలకు కలిగే ప్రయోజనాలను గుర్తిస్తూ లబ్దిదారులందరికీ ప్రయోజనం చేకూర్చేందుకు ఉమ్మడిగా కలిసి పనిచేయడానికి ఇరు దేశాల ప్రతినిధులు సూత్రప్రాయంగా అంగీకరించారు.
****
(Release ID: 1853999)
Visitor Counter : 221