నౌకారవాణా మంత్రిత్వ శాఖ

వాటాదారుల సంప్రదింపుల కోసం జారీ చేసిన భారత ఓడరేవుల ముసాయిదా బిల్లు, 2022


Posted On: 18 AUG 2022 4:34PM by PIB Hyderabad

భారతదేశం 7,500 కి.మీ పొడవైన తీరప్రాంతాన్ని కలిగి ఉంది. 14,500 కి.మీ సమర్థవంతమైన నౌకాయాన జలమార్గాలు మరియు కీలకమైన అంతర్జాతీయ సముద్ర వాణిజ్య మార్గాలలో వ్యూహాత్మక స్థానాన్ని కలిగి ఉంది. భారతదేశపు వాణిజ్యంలో దాదాపు 95% పరిమాణం మరియు 65% విలువ ప్రకారం నౌకాశ్రయాల ద్వారా సులభతరం అయిన సముద్ర రవాణా ద్వారా జరుగుతుంది. ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ యొక్క సాగరమాల ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో, ఓడరేవుల అభివృద్ధి నిమిత్తం అనేక కార్యక్రమాలను గుర్తించారు. అలాగే వాటిని ప్రారంభించారు కూడా. ఓడరేవులలో కొనసాగుతున్న ప్రమాణాలు మరియు నిబద్ధతతో కూడిన పెట్టుబడులకు (పబ్లిక్ మరియు ప్రైవేట్) శాస్త్రీయ మరియు సంప్రదింపుల ప్రణాళిక ద్వారా సహాయం అందించడం అవసరం. అప్పుడే అవి నిరంతరం పెరుగుతున్న భద్రత, రక్షణ మరియు పర్యావరణ సమస్యలపై దృష్టి సారించే వీలు ఉంటుంది.

భారతీయ ఓడరేవుల చట్టం, 1908 (“చట్టం”) 110 సంవత్సరాల కంటే పాతది. ప్రస్తుత కాలానికి అనుగుణంగా ఫ్రేమ్వర్క్లను ప్రతిబింబించేలా, భారతదేశం యొక్క అంతర్జాతీయ బాధ్యతలను చేర్చడం, ఉద్భవిస్తున్న పర్యావరణ సమస్యలను పరిష్కరించడం; అలాగే జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఓడరేవుల రంగం యొక్క సంప్రదింపుల అభివృద్ధికి సహాయం చేయడం వంటి వాటి ద్వారా చట్టాన్ని పునరుద్ధరించడం అత్యవసరం.

 

దీని ప్రకారం, సముద్ర ఒప్పందాల చట్టాలకు, దేశం యొక్క బాధ్యతకు అనుగుణంగా ఉండేలా ఓడరేవుల వద్ద కాలుష్య నివారణ మరియు నియంత్రణ కోసం, ఓడరేవులకు సంబంధించిన చట్టాలను ఏకీకృతం చేయడానికి మరియు సవరించడానికి భారత ఓడరేవుల ముసాయిదా బిల్లు, 2022 (“IP బిల్లు 2022”) ని సిద్ధం చేశారు. భారతదేశం ఒక భాగస్వామిగా ఉన్న అంతర్జాతీయ సాధనాలు; ఓడరేవుల పరిరక్షణకు చర్యలు తీసుకోవడం; భారతదేశంలోని ప్రధానేతర ఓడరేవుల సమర్థవంతమైన పరిపాలన, నియంత్రణ మరియు నిర్వహణ కోసం రాష్ట్ర మారిటైమ్ బోర్డులను శక్తివంతం చేయడం మరియు స్థాపించడం; ఓడరేవు సంబంధిత వివాదాల పరిష్కారానికి న్యాయనిర్ణేతగా యంత్రాంగాలను అందించడం మరియు ఓడరేవు రంగం యొక్క నిర్మాణాత్మక వృద్ధి; అభివృద్ధిని పెంపొందించడానికి జాతీయ కౌన్సిల్ను ఏర్పాటు చేయడం, అవసరమైన విధంగా భారతదేశ తీరప్రాంతం యొక్క వాంఛనీయ వినియోగాన్ని నిర్ధారించడం తో పాటూ సహాయక మరియు యాదృచ్ఛిక విషయాలను దానితో అందించడం, లేదా దాని ద్వారా అనుసంధానం చేయడం జరుగుతుంది.

ముసాయిదా IP బిల్లు 2022 ప్రస్తుతం ఉన్న 1908 చట్టాన్ని రద్దు చేసి, భర్తీ చేయాలని కోరింది. ప్రతిపాదిత బిల్లు యొక్క ప్రాథమిక లక్ష్యాలు నాలుగు అంచెలుగా ఉన్నాయి. అవి:

  1. పూర్తిగా సంప్రదింపులు మరియు సిఫార్సుల ఫ్రేమ్వర్క్ ద్వారా రాష్ట్రాల మధ్య, అలాగే కేంద్ర-రాష్ట్రాల మధ్య సమగ్ర ప్రణాళికను ప్రోత్సహించడం;
  2. అంతర్జాతీయ ఒప్పందాల క్రింద భారతదేశం యొక్క బాధ్యతలను కలుపుతూ భారతదేశంలోని అన్ని ఓడరేవులకు కాలుష్య నివారణ చర్యలను వివరించడం;
  3. అభివృద్ధి చెందుతున్న ఓడరేవుల రంగానికి అవసరమైన వివాద పరిష్కార ఫ్రేమ్వర్క్లోని అంతరాలను పరిష్కరించడం;
  4. డేటాను ఉపయోగించడం ద్వారా అభివృద్ధి మరియు ఇతర అంశాలలో పారదర్శకత మరియు సహకారం అందించడం.

 

ప్రతిపాదిత బిల్లు అనవసరమైన జాప్యాలు, భిన్నాభిప్రాయాలు మరియు బాధ్యతలను నిర్వచించడం ద్వారా సులభతర వ్యాపారాన్ని ప్రోత్సహించడంతోపాటు, సముద్ర రంగం అభివృద్ధిని సజాతీయంగా ఉంచుతూ క్రమబద్ధీకరిస్తుంది. ఇది జాతీయ ఫ్రేమ్వర్క్లో రాష్ట్ర మారిటైమ్ బోర్డులను చేర్చుతుంది. అదనంగా, మారిటైమ్ స్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ కోఆపరేటివ్ ఫెడరలిజాన్ని నిర్ధారిస్తుంది. ఇక్కడ దేశం కోసం ప్రగతిశీల రహదారి మ్యాప్ను తయారు చేయడంలో కేంద్రం మరియు రాష్ట్ర/కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వాలు కలిసి పనిచేస్తాయి. చట్టం యొక్క అనవసరమైన నిబంధనలను తొలగిస్తారు లేదా సమకాలీన నిబంధనలతో భర్తీ చేస్తారు. ఇంకా, చట్టంలోని ప్రస్తుత జరిమానాలు కాలం చెల్లినవి ప్రస్తుత దృష్టాంతానికి సంబంధించిన మొత్తాలు మరియు నేరాలకు సంబంధించి నవీకరిస్తారు.

బిల్లు యొక్క మునుపటి మూడు సంస్కరణలను మంత్రిత్వ శాఖ ప్రధాన ఓడరేవులు, రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్ర సముద్రతీర బోర్డులు మరియు వివిధ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలతో సహా వివిధ వాటాదారులకు పంపిణీ చేసింది. అందిన అన్ని రిమార్క్లను దృష్టిలో ఉంచుకుని ముసాయిదా IP బిల్లు, 2022 ని రూపొందించారు.

ఈ బిల్లు మరింత మంది వ్యక్తులు/సంస్థలలో విశ్వాసాన్ని నింపేందుకు, తద్వారా వారి భాగస్వామ్యాన్ని పెంచడానికి మరియు సముద్ర రంగంలో ఆరోగ్యకరమైన పోటీని పెంపొందించడానికి సహాయపడుతుందని కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ పేర్కొన్నారు. దీని వల్ల ఆర్థిక కార్యకలాపాలు, విస్తృత మార్కెట్లు, అనుబంధిత ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని, ఫలితంగా ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతను సాధించవచ్చని ఆయన అన్నారు.

IP బిల్లు 2022 ముసాయిదాపై అందరు వాటాదారుల నుండి అభిప్రాయాన్ని మరియు సూచనలను కోరాలని మంత్రిత్వ శాఖ భావిస్తోంది. పత్రాన్ని MoPSW మరియు సాగర్ మాల వెబ్సైట్ల నుండి వరుసగా https://shipmin.gov.in/ మరియు https://sagarmala.gov.in/ లింక్లలో యాక్సెస్ చేయవచ్చు. అలాగే సూచనలను sagar.mala[at] gov[dot]in కి పంపవచ్చు.

*****



(Release ID: 1853667) Visitor Counter : 315