హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పద్మ అవార్డులు-2023కు నామినేషన్లు 15 సెప్టెంబర్, 2022 వరకు స్వీకరించబడతాయి.

Posted On: 22 AUG 2022 12:29PM by PIB Hyderabad

గణతంత్ర దినోత్సవం 2023 సందర్భంగా ప్రకటించబడే పద్మ అవార్డులు 2023 కోసం ఆన్‌లైన్ నామినేషన్లు/సిఫార్సులు 1 మే 2022న ప్రారంభించబడ్డాయి. పద్మ అవార్డుల నామినేషన్లకు చివరి తేదీ సెప్టెంబర్ 15, 2022. పద్మ అవార్డుల కోసం నామినేషన్లు/సిఫార్సులు రాష్ట్రీయ పురస్కార్  పోర్టల్ (https://awards.gov.in)లో ఆన్‌లైన్‌లో మాత్రమే స్వీకరించబడతాయి.

పద్మవిభూషణ్, పద్మభూషణ్ మరియు పద్మశ్రీ, దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటి. 1954లో ప్రవేశపెట్టబడిన ఈ అవార్డులను ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటిస్తారు. ఈ అవార్డు 'విలక్షణమైన పని'ని గుర్తించడానికి ప్రయత్నిస్తుంది. అలాగే కళ, సాహిత్యం మరియు విద్య, క్రీడలు, వైద్యం, సోషల్ వర్క్, సైన్స్ మరియు ఇంజనీరింగ్, పబ్లిక్ అఫైర్స్, సివిల్ సర్వీస్, వాణిజ్యం మరియు పరిశ్రమ మొదలైన రంగాలు/విభాగాలలో విశిష్టమైన మరియు అసాధారణమైన విజయాలు/సేవలకు అందించబడుతుంది.  జాతి, వృత్తి, స్థానం లేదా లింగ భేదలకు అతీతంగా వ్యక్తులందరూ ఈ అవార్డులకు అర్హులు. వైద్యులు మరియు శాస్త్రవేత్తలు మినహా పిఎస్‌యులలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు పద్మ అవార్డులకు అర్హులు కారు.

పద్మ అవార్డులను "ప్రజల పద్మ"గా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. కాబట్టి పౌరులందరూ స్వీయ నామినేషన్‌తో సహా నామినేషన్లు/సిఫార్సులు చేయాలని అభ్యర్థించారు. మహిళలు, సమాజంలోని బలహీన వర్గాలు, ఎస్సీలు & ఎస్టీలు, దివ్యాంగులు మరియు సమాజానికి నిస్వార్థ సేవ చేస్తున్న ప్రతిభావంతులైన వ్యక్తులను గుర్తించడానికి సమిష్టి కృషి చేయవచ్చు.

నామినేషన్లు/సిఫార్సులు పైన పేర్కొన్న పోర్టల్‌లో అందుబాటులో ఉన్న ఫార్మాట్‌లో పేర్కొన్న  వివరాలను కలిగి ఉండాలి. కథన రూపంలో (గరిష్టంగా 800 పదాలు) ఆమె/అతని సిఫార్సు చేసిన వ్యక్తి యొక్క విశిష్టమైన మరియు అసాధారణమైన విజయాలు/సేవను స్పష్టంగా తెలియజేయాలి.
 
దీనికి సంబంధించి మరిన్ని వివరాలు 'అవార్డ్స్ అండ్ మెడల్స్' శీర్షిక కింద హోం మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో (https://mha.gov.in) మరియు పద్మ అవార్డుల పోర్టల్‌లో (https://padmaawards.gov.in) అందుబాటులో ఉన్నాయి. ఈ అవార్డులకు సంబంధించిన చట్టాలు మరియు నియమాలు వెబ్‌సైట్‌లో https://padmaawards.gov.in/AboutAwards.aspx లింక్‌తో అందుబాటులో ఉన్నాయి.


 

*****


(Release ID: 1853590) Visitor Counter : 246