సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం లో ఈశాన్య ప్రాంత పని సంస్కృతి విప్లవాత్మకంగా మారింది: కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్


అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ పెమా ఖండూతో కలిసి ఇటానగర్ లో "పరిపాలనా సంస్కరణల ద్వారా ప్రజలను, ప్రభుత్వాన్ని దగ్గరగా తీసుకురావడం" అనే అంశంపై రెండు రోజుల ప్రాంతీయ సదస్సును ప్రారంభించిన డాక్టర్ జితేంద్ర సింగ్

అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం , సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్, హైదరాబాద్ సహకారంతో జిల్లాల వ్యాప్తంగా పరిపాలన సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ఈశాన్య రాష్ట్రాల కోసం మొట్టమొదటిసారిగా ఒక డిస్ట్రిక్ట్ గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ ని అభివృద్ధి చేసిన
డిఎఆర్ పిజి

Posted On: 18 AUG 2022 2:06PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్వర్యంలో ఈశాన్య రాష్ట్రాల పని సంస్కృతి గత ఎనిమిది సంవత్సరాలలో విప్లవాత్మకంగా రూపాంతరం చెందిందని చెందుతోందని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ , శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) ఎర్త్ సైన్సెస్ శాఖ  సహాయ మంత్రి (స్వతంత్ర హోదా ) , పీఎంవో, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్లు, అణుశక్తి, అంతరిక్ష శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.

తత్ఫలిత౦గా, ఇప్పుడు ఈశాన్య ప్రా౦తాల్లోని ప్రాజెక్టులు నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి అవుతున్నాయని, కేంద్ర నిధుల వినియోగ౦ దాదాపు 100 శాత౦గా ఉ౦దని కేంద్ర మంత్రి చెప్పారు. ప్రతి రాష్ట్రం కేంద్ర రాజధానికి రైలుమార్గం ద్వారా అనుసంధానించ బడిందని, ఎనిమిది రాష్ట్రాలలో ప్రతి ఒక్కటి స్వంత విమానాశ్రయాన్ని ఏర్పాటు చేస్తుండగా, గౌహతి ఒక ముఖ్యమైన అంతర్జాతీయ విమానాశ్రయంగా మారిందని ఆయన తెలిపారు.

అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూతో కలిసి "పరిపాలన సంస్కరణల ద్వారా ప్రజలను, ప్రభుత్వాన్ని దగ్గరగా తీసుకురావడం" అనే అంశంపై రెండు రోజుల ప్రాంతీయ సదస్సును ప్రారంభించిన డాక్టర్ జితేంద్ర సింగ్, 2014 కు ముందు, వరుస కేంద్ర ప్రభుత్వాల ముందు చూపు లేని విధానాల కారణంగా ఈశాన్య ప్రాంతం ఆర్థికంగా నష్టపోయిందని, కానీ 2014 లో మోదీ ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే ప్రాంతాన్ని దేశంలోని ఇతర అభివృద్ధి చెందిన ప్రాంతాలతో సమానంగా

తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు

జరుగుతాయని ప్రధాన మంత్రి చేసిన ప్రకటన వాస్తవ రూపం దాలుస్తోందని పేర్కొన్నారు.

ఎనిమిదేళ్ళ లో అభివృద్ధి అంతరాలను విజయవంతంగా పూడ్చడమే కాకుండా ఈశాన్య ప్రాంతం కూడా మానసిక ఆత్మవిశ్వాసాన్ని పొందిందని ఆయన అన్నారు. రోడ్డు, రైలు, విమాన కనెక్టివిటీ పరంగా గణనీయమైన అభివృద్ధి ప్రాంతం అంతటా మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా కూడా సరుకులు , వ్యక్తుల రవాణాను సులభతరం చేయడానికి దోహదపడుతోందని మంత్రి తెలిపారు.

నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాతే అరుణాచల్ ప్రదేశ్ వంటి సుదూర ఈశాన్య రాష్ట్రాలతో పాటు ఇతర కొండ ప్రాంతాలు, , వెనుకబడిన ప్రాంతాల్లో ప్రజలకు అన్ని రంగాలలో సాధికారత కల్పించే దిశగా ఇలాంటి సదస్సులు జరుగుతున్నాయని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. పరిపాలనా సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల శాఖ ఇటానగర్ కాన్ఫరెన్స్  కు ముందు మేఘాలయలో 2019 ఆగస్టులో -గవర్నెన్స్ పై నేషనల్ కాన్ఫరెన్స్ ను నిర్వహించిందని, అందులో ఉత్తమ విధానాలు, అత్యాధునిక సాంకేతిక అభివృద్ధి మార్పులను పరస్పరం పంచుకుని , సమర్థవంతమైన పాలన , మెరుగైన ప్రజా సేవలను అందించడానికి వాటిని ఉపయోగించుకోవడానికి -గవర్నెన్స్ పై 'షిల్లాంగ్ డిక్లరేషన్' ను ఆమోదించడం జరిగిందని డాక్టర్ జితేంద్ర సింగ్  వివరించారు.

అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం , సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్, హైదరాబాద్ సహకారంతో డిపార్ట్ మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవియెన్స్ ఈశాన్య రాష్ట్రాలకు మొట్టమొదటి జిల్లా సుపరిపాలన సూచికను అభివృద్ధి చేసిందని, ఇది జాతీయ సుపరిపాలన సూచిక తరహాలో జిల్లాల్లో పరిపాలన సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ఈశాన్య రాష్ట్రాలకు మొట్టమొదటిదని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలియజేశారు. అరుణాచల్ ప్రదేశ్ లోని ప్రతి జిల్లా ర్యాంకింగ్స్ ను నెలవారీ ప్రాతిపదికన పర్యవేక్షించడానికి , అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో పనితీరును బెంచ్ మార్క్ చేయడంలో సహాయపడటానికి ఒక జిల్లా సుపరిపాలన పోర్టల్ ను అభివృద్ధి చేయడానికి అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పని చేయాలని డిఎఆర్ పిజి యోచిస్తోందని ఆయన చెప్పారు. అరుణాచల్ ప్రదేశ్ జిల్లా సుపరిపాలన సూచిక తరహాలో ఈశాన్య ప్రాంతం కోసం  వార్షిక మెరుగుదలలను ట్రాక్ చేసే ఒక ఆన్ లైన్ సుపరిపాలన సూచికను నిర్మించడం వాంఛనీయం అని, అప్పుడు దీనిని డిజిటల్ పోర్టల్ ద్వారా పర్యవేక్షించవచ్చని అన్నారు. .

తూర్పు ఆసియాకు అరుణాచల్ ను ప్రధాన ద్వారంగా మార్చేందుకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. జాతీయ భద్రతకు సంబంధించి అరుణాచల్ పాత్ర కు అనుగుణంగా ఆధునిక మౌలిక సదుపాయాలను  ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప్రకృతి అరుణాచల్ కు చాలా సంపదను ప్రసాదించిందని, అరుణాచల్ ప్రదేశ్ పర్యాటక సామర్థ్యాన్ని ప్రపంచం మొత్తానికి తీసుకెళ్లడానికి కేంద్రం కూడా ప్రయత్నిస్తోందని చెప్పారు.

పరిపాలనా సంస్కరణల పై డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, 21 శతాబ్దపు పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సింగిల్ విండో ఏజెన్సీలపై ఆధారపడి ఉంటుందని భారతదేశం భావిస్తోందని, ఇది ప్రజలు మెరుగైన సేవలను పొందడానికి సమాచారాన్ని ఉపయోగించడానికి సహాయపడుతుందని అన్నారు. వన్ నేషన్ వన్ పోర్టల్, మెరుగైన పౌరుల ఔట్రీచ్ కోసం బహుభాషా సిపిగ్రామ్ లు, ఫిర్యాదుల పరిష్కారం యొక్క నాణ్యతను కొలవడానికి డేటా విశ్లేషణ, ఫీడ్ బ్యాక్ కాల్ సెంటర్లు మరియు సిపిగ్రామ్స్ పోర్టల్ లో సిటిజన్ ట్రాన్స్ క్రిప్ట్ కొరకు ఏర్పాటు వంటి అనేక విధానాలను ఆలోచిస్తున్నట్లు ఆయన తెలిపారు.

ప్రజలకు మరింతగా చేరువ అయ్యేందుకు వన్ నేషన్ వన్ పోర్టల్, బహుభాషా సి పి జి ఆర్ ఎం లుఫిర్యాదుల పరిష్కార నాణ్యతను కొలవడానికి డేటా అనలిటిక్స్, ఫీడ్బ్యాక్ కాల్ సెంటర్లుసి పి జి ఆర్ ఎం ఎస్ పోర్టల్లో పౌరుల ట్రాన్స్క్రిప్ట్ కోసం సదుపాయం సహా అనేక పద్ధతులను పరిశీలించినట్లు ఆయన తెలిపారు.

2047 నాటికి భారతదేశం నిబద్ధత కలిగిన ప్రభుత్వోద్యోగుల తో  పాలించబడుతుందని , అత్యంత సమర్థవంతంగా జాతి కి సేవ చేస్తుందని తాను విశ్వసిస్తున్నట్టు చెబుతూ డాక్టర్ జితేంద్ర సింగ్ తమ ప్రసంగాన్ని యువ ప్రభుత్వోద్యోగులను Vision@2047 దిశగా ప్రేరేపించడం , నిమగ్నం చేయడం చాలా ముఖ్యం అని అన్నారు.

.ఆర్.పి.జి సంయుక్త కార్యదర్శి శ్రీ ఎన్.బి.ఎస్.రాజ్ పుత్ స్వాగతోపన్యాసం చేశారు. స్వాగతోపన్యాసం అనంతరం, అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ధర్మేంద్ర; డిఒఎన్ఇఆర్ కార్యదర్శి శ్రీ లోక్ రంజన్ , ఎఆర్ పిజి కార్యదర్శి శ్రీ వి. శ్రీనివాస్ కూడా ప్రారంభ సమావేశంలో

ప్రసంగించారు. ఈశాన్య ప్రాంతంలో పిఎం అవార్డ్ పొందిన చొరవలు 2021 పై  డిఎఆర్ అండ్ పిజి రూపొందించిన ఒక చిత్రాన్ని సందర్భంగా ప్రదర్శించారు. అరుణాచల్ ప్రదేశ్

ప్రభుత్వ కార్యదర్శి (ఏఆర్ ) శ్రీ అజయ్ చాగ్తీ

ధన్యవాదాలు తెలిపారు.

    

<><><><><>



(Release ID: 1853060) Visitor Counter : 107