పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఉడాన్ పథకానికి విజయవంతంగా ఐదు సంవత్సరాలు పూర్తి


ఈ పథకం ప్రారంభమైనప్పటి నుండి విమానాలలో కోటి మందికి పైగా ప్రయాణం

ఈ పథకం కింద 425 కొత్త విమాన మార్గాలు ప్రారంభం

58 విమానాశ్రయాలు, 8 హెలిపోర్టులు ,2 వాటర్ ఏరోడ్రోమ్ ల అనుసంధానం

2026 నాటికి ఈ పథకం కింద 1000 మార్గాలు , 220 విమానాశ్రయాలను అనుసంధానించాలని యోచన

Posted On: 17 AUG 2022 3:22PM by PIB Hyderabad

పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రతిష్టాత్మక ప్రాంతీయ అనుసంధాన పథకం - ఉడాన్ ( ఉడే  దేశ్ కా ఆమ్ నాగరిక్) కింద 2017 ఏప్రిల్ 27 ప్రధాన మంత్రి మొదటి విమానాన్ని ప్రారంభించినప్పటి నుండి ఐదు సంవత్సరాల విజయాన్ని పూర్తి చేసుకుంది. .

'ఉడే  దేశ్ కా ఆమ్ నాగరిక్ ' దార్శనికతను అనుసరించడం ద్వారా  ద్వితీయ , తృతీయ శ్రేణి నగరాల్లో విమానయాన మౌలిక సదుపాయాలువైమానిక అనుసంధానాన్ని పెంపొందించడం ద్వారా సామాన్య పౌరుల ఆకాంక్షలను నెరవేర్చే లక్ష్యంతో పథకాన్ని 2016 అక్టోబర్ 21 ప్రారంభించారు.

 

గడచిన ఐదు సంవత్సరాలలో, ఉడాన్ దేశంలో ప్రాంతీయ వైమానిక-కనెక్టివిటీని గణనీయంగా పెంచింది. 2014 లో పథకం కింద  74 ఆపరేషనల్ విమానాశ్రయాలు ఉండగా సంఖ్య ఇప్పుడు 141 కు పెరిగింది.

 

ఉడాన్ పథకం కింద 58 విమానాశ్రయాలు, 8 హెలిపోర్టులు , 2 వాటర్ ఏరోడ్రోమ్ లతో సహా 68 అండర్ సర్వ్డ్/అన్ సర్వ్ డ్ గమ్యస్థానాలు కనెక్ట్ చేయబడ్డాయి. పథకం కింద 425 కొత్త రూట్ల ను ప్రారంభించడంతో, ఉడాన్ దేశ వ్యాప్తంగా 29 కి పైగా రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలకు విమాన కనెక్టివిటీని అందించింది. 2022 ఆగస్టు 4 నాటికి కోటి మందికి పైగా ప్రయాణికులు పథకం ప్రయోజనాలను పొందారు. పథకం ప్రాంతీయ విమాన సంస్థలకు వారి కార్యకలాపాలను పెంచడానికి ఎంతో అవసరమైన వేదికను కూడా అందించింది.

 

ఉడాన్ కింద 220 గమ్యస్థానాల (విమానాశ్రయాలు/ హెలిపోర్టులు/ వాటర్ ఏరోడ్రోమ్ లు) ను దేశంలోని అనుసంధానించని గమ్యస్థానాలకు వాయు కనెక్టివిటీని అందించడానికి 1000 మార్గాలతో 2026 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఉడాన్ కింద, 156 విమానాశ్రయాలను అనుసంధానించడానికి ఇప్పటికే 954 మార్గాలు మంజూరు చేయబడ్డాయి.

 

సందర్భంగా పౌర విమాన యాన శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎమ్. సింధియా మాట్లాడుతూ, "ఆర్.సి.ఎస్. ఉడాన్

విజయం 'ఉదే దేశ్ కా ఆమ్ నాగ్రిక్' అనే

ప్రధాన మంత్రి దార్శనికత పట్ల ప్రభుత్వ

నిబద్ధత కు నిదర్శనం  భారతీయ విమానయాన పరిశ్రమ మార్పు లో ఇది గొప్ప పాత్ర పోషించింది. పథకం కింద 1000 రూట్ల వరకు  వెళ్లాలనే  లక్ష్యంగా ఇప్పటి వరకు 425 రూట్ల ను, 100 కొత్త విమానాశ్రయాలను అనుసంధానించే లక్ష్యం లో 68 విమానాశ్రయాలను చేరుకున్నాం. వచ్చే నాలుగు సంవత్స రాలలో భారత దేశంలో సివిల్ ఏవియేషన్ ద్వారా 40 కోట్ల మంది

ప్రయాణికులను అంచనా వేస్తున్నాము. రైలు రవాణా , రోడ్డు రవాణాతో పాటు పౌర విమానయానం భారతదేశంలో రవాణాకు రక్షణ కవచంగా మారే రోజు ఎంతో దూరంలో లేదు." అని అన్నారు.

 

నేషనల్ సివిల్ ఏవియేషన్ పాలసీ (ఎన్ సిఎపి)-2016 సమీక్ష ఆధారంగా ఆర్ సిఎస్-ఉడాన్ కు రూపకల్పన జరిగిందిదీనిని 10 సంవత్సరాల పాటు అమలు చేసేలా  ప్రణాళిక వేశారు. రీజనల్ కనెక్టివిటీ ఫండ్ (ఆర్ సిఎఫ్) అభివృద్ధితో ఇది సెల్ఫ్ ఫైనాన్సింగ్ యంత్రాంగాన్ని కలిగి ఉంది. పథకం కింద, ఆర్ సిఎఫ్ సృష్టించబడింది, ఇది కొన్ని దేశీయ విమానాలపై లెవీ ద్వారా పథకం విజిఎఫ్ ఆవశ్యకతలకు నిధులు సమకూరుస్తుంది. విధంగా, రంగం నుండి ఉత్పన్నమయ్యే నిధులు రంగం ఎదుగుదల ,అభివృద్ధిని ప్రేరేపిస్తాయి.

 

ఉడాన్ పథకం విభిన్న వాటాదారులకు ప్రయోజనం చేకూర్చింది. ప్రయాణీకులు ఎయిర్ కనెక్టివిటీ ప్రయోజనాలను పొందారు, విమానయాన సంస్థలు ప్రాంతీయ మార్గాలను నడపడానికి రాయితీలను పొందాయి, సేవ అందని ప్రాంతాలు తమ ఆర్థికాభివృద్ధికి ఎయిర్ కనెక్టివిటీ ప్రత్యక్ష , పరోక్ష ప్రయోజనాలను పొందాయి.

 

అవసరాన్ని బట్టి ఉడాన్ సృష్టించిన ఫ్రేమ్ వర్క్ క్రింది వాటి ఏర్పాటుకు దారితీసింది:

 

లైఫ్ లైన్ ఉడాన్ (మహమ్మారి సమయంలో మెడికల్ కార్గో రవాణా కోసం).

కృషి ఉడాన్ (ప్రత్యేకించి ఈశాన్య ప్రాంతం {ఎన్ ఆర్ ),  గిరిజన జిల్లాలలో వ్యవసాయ ఉత్పత్తుల విలువ రియలైజేషన్).

 

గౌహతి ,ఇంఫాల్ నుంచి/ వరకు  అంతర్జాతీయ కనెక్టివిటీ కోసం  ఈశాన్య ప్రాంతానికి అంతర్జాతీయ ఉడాన్ మార్గాలు.

 

లైఫ్ లైన్  ఉడాన్ - లైఫ్ లైన్  ఉడాన్ చొరవ కోవిడ్ -19 కాలంలో మార్చి 2020 లో ప్రారంభమైంది ఇది దేశంలోని వివిధ ప్రాంతాలకు దాదాపు 1000 టన్నుల భారీ సరుకు , అత్యవసర వైద్య సేవలను రవాణా చేసే 588 విమానాలను నడపడానికి సహాయపడింది.

 

2020 సంవత్సరానికి గాను ఇన్నోవేషన్ కేటగిరీ కింద పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో ఎక్సలెన్స్ కు గాను ఆర్ సిఎస్-ఉడాన్ కు ప్రధాన మంత్రి అవార్డు లభించింది. 2022 జనవరి 26 రిపబ్లిక్ డే శకటాలలో ఉడాన్ శకటాన్ని రక్షణ మంత్రిత్వ శాఖ ఉత్తమ శకటం గా ప్రకటించింది.

 

(ఉడాన్ కింద ఆపరేట్ చేయబడ్డ ఆర్ సి ఎస్ రూట్ లు , ఎయిర్ పోర్ట్ రాష్ట్రాల వారీ వివరాలు అనుబంధం- లో ఇవ్వబడ్డాయి.)

 

అనుబంధం-

 

ఉడాన్ కింద ఆపరేట్ చేయబడ్డ RCS రూట్ లు , ఎయిర్ పోర్ట్ రాష్ట్రాల వారీ వివరాలు

 

 

వరస నెంబర్

రాష్ట్రం

ఆర్ సి ఎస్ రూట్లు 

ఆర్ సి ఎస్  విమానాశ్రయాలు

 

1.

అండమాన్ & నికోబార్ (యుటి)

సున్న

సున్న

సున్న

2.

ఆంధ్ర ప్రదేశ్ 

26

02

కడప, కర్నూలు

3.

అరుణాచల్ ప్రదేశ్

04

02

తేజు, పసిఘాట్

4.

అస్సోం

30

04

జోర్హాట్, లీలాబరి, తేజ్పూర్, రూప్

5.

బీహార్

11

01

దర్భంగా

6.

చండీగఢ్

06

సున్న

సున్న

7.

ఛత్తీస్ ఘడ్

 

12

02

బిలాస్ పూర్ , జగదల్ పూర్

8.

డామన్, డయ్యు (యు టి)

02

01

డయ్యు

9.

ఢిల్లీ (యు టి)

35

సున్న

సున్న

10.

గోవా

06

సున్న

సున్న

11.

గుజరాత్

53

08

భావ్ నగర్, జామ్ నగర్, కాండ్లా, కెషోడ్, ముంద్రా, పోర్ బందర్, స్టాట్యూ ఆఫ్ యూనిటీ (డబ్ల్యుఎ), సబర్మతి రివర్ ఫ్రంట్ (డబ్ల్యుఎ)

12.

హర్యానా

06

01

హిస్సార్

13.

హిమాచల్ ప్రదేశ్

20

04

సిమ్లా, కులు, మండి (హెచ్), రాంపూర్ (హెచ్)

14.

జమ్ము అండ్ కాశ్మీర్

04

సున్న

సున్న

15.

ఝార్ఖండ్

01

01

దేవ్ ఘడ్

16.

కర్ణాటక

90

06

బెల్గాం, హుబ్లీ, మైసూర్, విద్యానగర్, కలబుర్గి, బీదర్

17.

కేరళ

18

01

కన్నూర్

18.

లడ్డాఖ్ (యు టి )

సున్న

సున్న

సున్న

19.

లక్షద్వీప్ (యు టి

సున్న

సున్న

సున్న

 

20

మధ్యప్రదేశ్

29

01

గ్వాలియర్

21

మహారాష్ట్ర

05

06

గోండియా, జల్గావ్, కొల్హాపూర్, నాందేడ్, నాసిక్, సింధుదుర్

22

మణిపూర్

06

సున్న

సున్న

23

మేఘాలయ

14

01

షిల్లాంగ్

24

మిజోరాం

02

సున్న

సున్న

25

నాగాలాండ్

08

01

దిమా పూర్

26

ఒడిశా

18

01

ఝార్స్ గుడా

27

పుదుచ్చేరి(యుటి)

02

01

పుదుచ్చేరి

28

పంజాబ్

20

04

ఆడంపూర్, లూధియానా, భటిండా, పఠాన్ కోట్

29

రాజస్థాన్

38

03

బికనీర్, జైసల్మేర్, కిషన్ గఢ్

30

సిక్కిం

06

01

పాక్యాంగ్

31

తమిళనాడు

14

01

సేలం

 

తెలంగాణ

40

సున్న

సున్న

 

త్రిపుర

06

సున్న

సున్న

 

ఉత్తరప్రదేశ్

63

06

ఆగ్రా, కాన్పూర్, హిండన్, బరేలీ, కుషినగర్, ప్రయాగ్ రాజ్

 

ఉత్తరాఖండ్

24

08

పంత్ నగర్, పితోరాఘర్, సహస్త్రధార (హెచ్), చిన్యాలిసౌర్ (హెచ్), న్యూ తెహ్రీ (హెచ్), గౌచర్ (హెచ్), శ్రీనగర్ (హెచ్), హల్ద్వానీ (హెచ్)

 

పశ్చిమ బెంగాల్

24

01

దుర్గాపూర్


(Release ID: 1852879) Visitor Counter : 259