హోం మంత్రిత్వ శాఖ

శ్రీ రాకేష్ ఝున్ ఝున్ వాలా మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన కేంద్ర హోం మరియు సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా


స్టాక్ మార్కెట్‌పై శ్రీ రాకేష్ ఝున్ ఝున్ వాలా ఉన్న అపారమైన అనుభవం , అవగాహన అసంఖ్యాక పెట్టుబడిదారులకు స్ఫూర్తి ఇచ్చాయి.. శ్రీ అమిత్ షా చెప్పారు.పెట్టుబడుల నమ్మకాలకు రాకేష్ ఝున్ ఝున్ గుర్తుండిపోతారు

Posted On: 14 AUG 2022 11:51AM by PIB Hyderabad

శ్రీ రాకేష్ ఝున్ ఝున్    మృతి పట్ల కేంద్ర హోం మరియు సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా సంతాపం వ్యక్తం చేశారు. .

 

 ట్విట్టర్‌ ద్వారా  శ్రీ అమిత్ షా  తన సంతాప సందేశం తెలిపారు.   “రాకేష్ జున్‌జున్‌వాలా జీ మరణించడం గురించి తెలుసుకుని చాలా బాధపడ్డాను. స్టాక్ మార్కెట్‌పై అతని అపార అనుభవం మరియు అవగాహన అసంఖ్యాక పెట్టుబడిదారులకు స్ఫూర్తినిచ్చాయి. అతను తన బుల్లిష్ ఔట్‌లుక్ కోసం ఎప్పటికీ గుర్తుండిపోతారు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి శాంతి” అని శ్రీ అమిత్ షా పేర్కొన్నారు. 

 

***(Release ID: 1851900) Visitor Counter : 148