సహకార మంత్రిత్వ శాఖ
ప్రభుత్వ ఈ మార్కెట్ ప్లేస్ (జి.ఈ.ఎం) పోర్టల్ లో సహకార సంస్థల ఆన్ బోర్డింగ్ ను ఈరోజు న్యూఢిల్లీలో ఇ-లాంచ్ చేసిన - కేంద్ర హోం & సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా
Posted On:
09 AUG 2022 6:48PM by PIB Hyderabad
దేశంలోని అన్ని సహకార సంఘాల కు జి.ఈ.ఎం. అందుబాటులోకి వచ్చినందున, సహకార సంస్థల కు ఈ రోజు చాలా ముఖ్యమైనది.
సహకార రంగంలో అపారమైన సంభావ్యత ఉంది. ఈ రంగం విస్తరణకు జి.ఈ.ఎం. పోర్టల్ చాలా ఉపయోగకరమైన వేదిక అవుతుంది.
సహకార సంఘాల కోసం సహకార మంత్రిత్వ శాఖ ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో అనేక చర్యలు తీసుకుంది. గత ఏడాది కాలంగా మంత్రిత్వ శాఖ 25 నుంచి 30 కార్యక్రమాలపై నిరంతరాయంగా పని చేస్తోంది.
పి.ఏ.సి.ఎస్. నుంచి ఏ.పి.ఈ.ఎక్స్. వరకు ఒక సమగ్ర సహకార విధానం కూడా తయారు చేయబడుతోంది, ప్రభుత్వం సహకార సంఘాలను విస్తరించవలసి ఉంది, కానీ డేటా బేస్ లేకపోవడంతో మంత్రిత్వ శాఖ వివిధ రకాల సహకార సంఘాల జాతీయ స్థాయి డేటా బేస్ను కూడా రూపొందిస్తోంది.
60 కోట్ల మంది జనాభా తమ భోజనం, ఇతర నిత్యావసరాల గురించి చింతిస్తూ గడుపుతున్నారు.
60 కోట్ల జనాభా ఉన్న ఈ ప్రజల ప్రాథమిక అవసరాలైన, బ్యాంకు ఖాతాలు తెరవడం, గ్యాస్ సిలిండర్లు, మరుగుదొడ్లు, విద్యుత్ సరఫరా, స్వచ్ఛమైన తాగునీరు, ఉచిత ఆహార ధాన్యాలు అందించడం వంటివి తీర్చడం ద్వారా వారి ఆకాంక్షలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మేల్కొల్పారు, సహకార సంఘాలు ఈ ఆకాంక్షలను నెరవేర్చగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.
కో ఆపరేటివ్ నమూనా పరిమిత మూలధనం ఉన్న వ్యక్తులను కలిసి పెద్ద ఎత్తున పని చేయడానికి అనుమతిస్తుంది.
కాలం చెల్లిన కాలానికి అనుగుణంగా, ఒక వ్యవస్థ, తనంతట తానుగా మారకపోతే, సహకార రంగం విస్తరణకు వ్యవస్థను మెరుగుపరచడం అవసరం.
స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి ఈ ప్రాంతం నిర్లక్ష్యానికి గురైంది, అయితే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చారిత్రాత్మక సంస్కరణలు మరియు ఆధునీకరణ ద్వారా దాని విస్తరణను వేగవంతం చేస్తున్నారు.
సహకార విశ్వవిద్యాలయం స్థాపన పురోగతిలో ఉంది, సహకార రంగంలో పనిచేస్తున్న వారితో పాటు, కొత్త ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడంలో ఇది సహాయపడుతుంది.
ఎగుమతుల సంస్థ కూడా నమోదు చేయబడుతోంది, ఈ ప్రక్రియ డిసెంబర్ నాటికి పూర్తవుతుంది, సహకార సంస్థల ద్వారా ఉత్పత్తుల ఎగుమతికి ఇది ఒక వేదిక అవుతుంది.
సహకార రంగానికి ద్వితీయ శ్రేణి ప్రాధాన్యత ఇవ్వడం జరగదు, అయితే ఈ రంగంలో ఉన్నవారు కూడా మార్పును స్వీకరించి, పారదర్శకతను తీసుకు రావాలి.
జి.ఈ.ఎం. పోర్టల్ సహకార రంగంలో పారదర్శకతను తీసుకువస్తుంది, పారదర్శకత ఉన్నప్పుడు కమిటీలు, వాటి సభ్యుల పై రైతులు, పాల ఉత్పత్తిదారుల విశ్వాసం కూడా పెరుగుతుంది.
జి.ఈ.ఎం. పోర్టల్ ద్వారా శ్రీ నరేంద్ర మోదీ ప్రభుత్వ కొనుగోళ్ల లో పారదర్శకతను తీసుకొచ్చారు, ఇది ఒక కొత్త వ్యవస్థ, ప్రారంభంలో కొన్ని పరిపాలనా పరమైన సమస్యలు ఉండవచ్చు, అయితే ఈ కొత్త వ్యవస్థను తీసుకురావాలనే ఉద్దేశాన్ని ఎవరూ అనుమానించకూడదు.
ఐదేళ్లలో ఈ విజయవంతమైన పారదర్శక ప్రభుత్వ కొనుగోళ్లను ప్రపంచం గుర్తిస్తుందన్న నమ్మకం తనకు ఉందని శ్రీ అమిత్ షా విశ్వాసం వ్యక్తం చేశారు.
జి.ఈ.ఎం. సాధించిన విస్తరణ ఊహించలేనిది, జి.ఈ.ఎం. లో దాదాపు 62,000 మంది ప్రభుత్వ కొనుగోలుదారులు, దాదాపు 49 లక్షల మంది విక్రేతలు అందుబాటులో ఉన్నారు.
పది వేల కంటే ఎక్కువ ఉత్పత్తులతో పాటు, 288 కంటే ఎక్కువ సేవలు ఇందులో చేర్చడం జరిగింది, ఇప్పటివరకు 2.78 వేల కోట్ల రూపాయల విలువైన వ్యాపారం జరిగింది, జి.ఈ.ఎమ్. కి ఇది భారీ విజయం
కేంద్ర హోం మరియు సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీ లో ప్రభుత్వ ఈ-మార్కెట్ ప్లేస్ (జి.ఈ.ఎం) పోర్టల్ లో సహకార సంస్థల ఆన్-బోర్డింగ్ విధానాన్ని ప్రారంభించారు. భారత ప్రభుత్వ సహకార మంత్రిత్వ శాఖ; నేషనల్ కో-ఆపరేటివ్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎం.సి.యు.ఐ); జి.ఈ.ఎం. సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్; కేంద్ర సహకారం మరియు ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖల సహాయ మంత్రి శ్రీ బి.ఎల్. వర్మ; ఎన్.సి.యు.ఐ. అధ్యక్షుడు శ్రీ దిలీప్ సంఘాని తో పాటు పలువురు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
శ్రీ అమిత్ షా తన ప్రసంగంలో, భారతదేశ చరిత్రలో ఈ రోజు చాలా ముఖ్యమైన రోజు అని పేర్కొన్నారు. 1942 ఆగస్టు 9వ తేదీన గాంధీజీ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించగా, ఈ రోజు ఆగస్టు 9వ తేదీన, ఆజాదీ-కా-అమృత్-మహోత్సవ్ సందర్భంగా మరొక ముఖ్యమైన పని చేపట్టడం జరుగుతోందనీ, దీనిలో దేశం లోని సహకార సంఘాలకు జి.ఈ.ఎం. ను అందుబాటులోకి తేవడం జరిగిందనీ, ఆయన చెప్పారు. సహకార రంగంలో అపారమైన అవకాశాలున్నాయని పేర్కొంటూ, ఈ రంగం విస్తరణకు జి.ఈ.ఎమ్. పోర్టల్ చాలా ఉపయోగకరమైన వేదిక అవుతుందని శ్రీ షా తెలియజేశారు. ప్రభుత్వంలోని చాలా యూనిట్లు జి.ఈ.ఎం. ద్వారా కొనుగోలు చేస్తున్నాయనీ, అందువల్ల, సహకార సంస్థలు కూడా తమ మార్కెట్ ను పెంచుకోవడానికి జి.ఈ.ఎమ్. లో సరఫరా కోసం నమోదు చేసుకోడానికి సిద్ధపడాలనీ, కేంద్ర సహకార మంత్రి సూచించారు. సహకార సంఘాల మార్కెటింగ్ ని విస్తరించాలని, ఇందుకు జి.ఈ.ఎమ్. కంటే మెరుగైన మార్గం మరొకటి లేదని, ఆయన నేషనల్ కో-ఆపరేటివ్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్.సి.యు.ఐ) కి విజ్ఞప్తి చేశారు.
స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఈ రంగం నిర్లక్ష్యానికి గురికాగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చారిత్రాత్మక సంస్కరణలు, ఆధునికీకరణ తో దాని విస్తరణను వేగవంతం చేస్తున్నారని, కేంద్ర సహకార మంత్రి పేర్కొన్నారు. . అదే విధంగా, ఈ రంగం విస్తరణ కోసం, కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ, శ్రీ మోదీ నాయకత్వంలో అనేక చర్యలు చేపట్టింది. గత సంవత్సరంలో మంత్రిత్వ శాఖ 25 నుంచి 30 కార్యక్రమాలపై నిరంతరం పని చేస్తోంది.
ప్రభుత్వం సహకార సంఘాలను విస్తరించవలసి ఉంది, అయితే, డేటా-బేస్ లేదు కాబట్టి, మంత్రిత్వ శాఖ వివిధ వర్గాల సహకార సంఘాల జాతీయ స్థాయి డేటా-బేస్ ను కూడా రూపొందిస్తోంది. శిక్షణ కోసం కూడా ఏర్పాట్లు అందుబాటులోకి రానున్నాయి. ఎగుమతుల సంస్థ కూడా రిజిస్టర్ చేయబడుతోందని, డిసెంబర్ నాటికి ఆ ప్రక్రియ పూర్తవుతుందని శ్రీ షా చెప్పారు. దేశవ్యాప్తంగా సహకార సంఘాల ద్వారా ఉత్పత్తుల ఎగుమతికి ఇది ఒక వేదిక ను అందిస్తుంది. మల్టీ-స్టేట్-కో-ఆపరేటివ్-చట్టంలో కూడా సమూల మార్పులు చేస్తున్నామనీ, శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం అన్ని పీ.ఏ.సీ.ఎస్. లను కంప్యూటరీకరించాలని నిర్ణయించిందని కూడా ఆయన తెలియజేశారు.
ఆర్థిక వ్యవస్థలో జనాభా పరిమాణం గొప్ప ప్రయోజనం అని అమిత్ షా అన్నారు, ఎందుకంటే అంతిమంగా జనాభా కూడా ఒక మార్కెట్ గా పరిగణించబడుతుంది. 2014 వరకు, భారత దేశ జనాభా 130 కోట్లు, కానీ 70 కోట్ల మందికి కొనుగోలు సామర్థ్యం లేనందున మార్కెట్ 60 కోట్లు మాత్రమే. 60 కోట్ల మంది ప్రజలు తమ తదుపరి భోజనంతో పాటు, ఇతర ప్రాథమిక అవసరాల కోసం ఆందోళన చెందుతున్నారు. తరతరాలుగా అదే కష్టాన్ని అనుభవించారు. అయితే, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ బ్యాంకు ఖాతాలు తెరిచారు, పేదలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు, టాయిలెట్లు, విద్యుత్, శుద్ధమైన తాగునీరు, ఆహార ధాన్యాలు అందించారు. ఫలితంగా ఈ 60 కోట్ల మంది ప్రజల ప్రాథమిక అవసరాలను తీర్చడం ద్వారా వారి ఆకాంక్షలు మేల్కొన్నాయి మరియు సహకార సంఘాలు ఈ ఆకాంక్ష లన్నింటినీ నెరవేర్చగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఈ రోజు వారి ప్రాథమిక అవసరాలను నెరవేర్చిన తర్వాత, ఈ వ్యక్తులు ఎక్కువ డబ్బు సంపాదించడం ద్వారా జీవితంలో ముందుకు సాగాలనే ఆశయాలను కలిగి ఉన్నారు మరియు సహకార సంస్థల ద్వారా వారు ఈ ఆశయాలను నెరవేర్చగలరు. ఈ 60 కోట్ల మంది ప్రజల వద్ద కేవలం ఐదు వేల రూపాయలు ఉంటే, వారు అతిపెద్ద సహకార సంఘాలను నడపగలరని శ్రీ అమిత్ షా అన్నారు. అమూల్ సంస్థ ను శ్రీ షా ఉదహరిస్తూ, ఈ రోజున ఈ సహకార సంస్థ 60 వేల కోట్ల రూపాయల టర్న్-ఓవర్ ను అధిగమించిందనీ, 20 లక్షల మంది మహిళా సభ్యులు ఈ సహకార సంస్థను నిర్వహించడం తో పాటు అనేక సంవత్సరాలుగా లాభాలను ఆర్జిస్తున్నారనీ, తెలియజేశారు.
కేంద్ర సహకార మంత్రి మాట్లాడుతూ, సహకార నమూనా అనేది పరిమిత మూలధనంతో కూడా ప్రజలు ఏకతాటిపైకి వచ్చి పెద్ద పనులను సులభంగా చేపట్టే నమూనా అని అన్నారు. ఇంతకుముందు సహకార నమూనాకు అంత సామర్థ్యం లేదనీ, అయితే శ్రీ నరేంద్ర మోదీ 60 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను మేల్కొల్పారని ఆయన పేర్కొన్నారు. కాలానుగుణంగా ఒక వ్యవస్థ తనంతట తానుగా మారకపోతే అది పాతబడిపోతుందనీ, అందువల్ల సహకార రంగ విస్తరణకు ఈ వ్యవస్థను మెరుగు పరచవలసిన అవసరం ఉందనీ, సూచించారు. భారతదేశ సహకార వ్యవస్థ 115 సంవత్సరాల పురాతనమైనది. చట్టాలు కూడా చాలా పాతవి. అందువల్ల, కాలానుగుణంగా చిన్న చిన్న మార్పులు జరుగుతున్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టు సమూల మార్పులు మరియు ఆధునికీకరణ జరగలేదు.
ఇప్పుడు సహకార రంగానికి ద్వితీయ శ్రేణి ప్రాధాన్యత ఇవ్వలేమనీ, అయితే మార్పు తీసుకు రావాల్సిన అవసరం ఉందనీ, పారదర్శకతను తీసుకువచ్చే దిశలో పయనించాల్సిన అవసరం ఉందనీ శ్రీ షా పేర్కొన్నారు. అందువల్ల ఈ మార్పు కోసం, తమను తాము సిద్ధం చేసుకోవాలని, ఆయన, ఈ సందర్భంగా, సహకార సంఘాల కు విజ్ఞప్తి చేశారు. సహకార రంగంలో పారదర్శకత తీసుకురావడానికి జీ.ఈ.ఎమ్. పోర్టల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. పారదర్శకత ఉన్నప్పుడు, రైతులు, పాల ఉత్పత్తిదారుల విశ్వాసం కూడా కమిటీలు మరియు వారి సభ్యుల పై పెరుగుతుంది. జి.ఈ.ఎం. పోర్టల్ ను తీసుకురావడం ద్వారా, శ్రీ నరేంద్ర మోదీ ప్రభుత్వ కొనుగోళ్లలో పారదర్శకతను తీసుకువచ్చారని ఆయన అన్నారు. ఇది ఒక కొత్త వ్యవస్థ అయినందువల్ల ప్రారంభంలో కొన్ని పరిపాలనా పరమైన సమస్యలు ఉండవచ్చు, అందువల్ల, ఈ కొత్త వ్యవస్థను తీసుకురావాలనే ఉద్దేశాన్ని ఎవరూ అనుమానించ కూడదని, ఆయన చెప్పారు. సహకార సంఘాల పరిధిలో ఎన్నికలు, నియామకాలు, కొనుగోలు అనే మూడు అంశాల్లో పారదర్శకత తీసుకురావడం కూడా చాలా ముఖ్యమని శ్రీ షా సూచించారు. సేకరణలో పారదర్శకతను తీసుకురావడానికి జి.ఈ.ఎం. కంటే మెరుగైన మాధ్యమం మరొకటి ఉండదు. రాబోయే ఐదేళ్లలో పారదర్శకమైన ప్రభుత్వ కొనుగోళ్ల లో ఈ విజయవంతమైన నమూనాను ప్రపంచం గుర్తిస్తుందన్న నమ్మకం తనకు ఉందని కేంద్ర సహకార మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ నాయకత్వంలో జి.ఈ.ఎం. యొక్క భవిష్యత్తు ప్రయాణం గురించి తాను చాలా ఆశాజనకంగా ఉన్నానని కేంద్ర సహకార శాఖ మంత్రి పేర్కొన్నారు. 100 కోట్ల టర్నోవర్ కలిగి ఉన్న, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన 589 కమిటీలు ఇంకా చేరవలసి ఉందనీ, వీటిలో ఇప్పటి వరకు 289 కమిటీలతో పాటు, వివిధ రాష్ట్రాలకు చెందిన 54 సహకార సంఘాలలో 45 సంఘాలు కూడా చేరాయనీ, ఇది ఒక భారీ విజయమనీ, ఆయన చెప్పారు. అదేవిధంగా, 10,000 కంటే ఎక్కువ ఉత్పత్తులతో పాటు, 288 కంటే ఎక్కువగా వివిధ సేవలు ఈ జాబితా చేరాయి. ఇప్పటి వరకు 2.78 లక్షల వేల కోట్ల రూపాయల మేర వ్యాపారం కూడా పూర్తయింది. ఇది జీ.ఈ.ఎం సాధించిన భారీ విజయమనీ, ఆయన వివరించారు. ఆగష్టు 9వ తేదీన "క్విట్ ఇండియా ఉద్యమం" ప్రారంభమైనందున ఈ రోజు దేశానికి ముఖ్యమైనదని శ్రీ షా పేర్కొన్నారు. అదేవిధంగా ఆరు సంవత్సరాల క్రితం ఆగస్టు 9వ తేదీన జి.ఈ.ఎం. కూడా ప్రారంభమైందనీ, సహకార సంఘాల "ఆన్-బోర్డింగ్" కూడా ఇదే రోజున ప్రారంభించబడిందనీ, ఆయన గుర్తుచేశారు. శ్రీ అమిత్ షా ఈ సందర్భంగా, సహకార సంఘాలతో సంబంధం ఉన్న వారిని, జి.ఈ.ఎం. కు చెందిన మొత్తం బృందాన్ని, ఎనిమిది లక్షల సహకార సంఘాల సభ్యులతో పాటు, ముఖ్యంగా శ్రీ పీయూష్ గోయల్‌ను అభినందించారు.
*****
(Release ID: 1850511)
Visitor Counter : 214