యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కామ‌న్ వెల్త్ 2022 క్రీడ‌ల 10 వ‌రోజు ఇండియా 15 ప‌త‌కాలు సాధించింది. ఇందులో 5 స్వ‌ర్ణ‌ప‌త‌కాలు, 4 ర‌జ‌త ప‌త‌కాలు, 6 కాంస్య‌ప‌త‌కాలు ఉన్నాయి. దీనితో భార‌త్ సాధించిన ప‌త‌కాల సంఖ్య 55 కు చేరింది.


శ‌ర‌త్ క‌మ‌ల్/ శ్రీజ ఆకుల‌, నిఖ‌త్ జ‌రీన్‌, ఎల్‌దోస్‌పాల్‌, అమిత్ పంఘ‌ల్‌, నీతుఘంఘాస్‌లు స్వ‌ర్ణ‌ప‌త‌కాలు సాధించారు.

కామ‌న్ వెల్త్ క్రీడ‌ల‌లో స్వ‌ర్ణ‌ప‌తకం సాధించి భార‌త‌దేశానికి గ‌ర్వ‌కార‌ణంగా నిలిచిన నిఖ‌త్ జ‌రీన్‌ను ప్ర‌ధాన‌మంత్రి అభినందించారు. ఆమె ప్ర‌పంచ శ్రేణి అథ్లెట్‌. ఆమె నైపుణ్యాల‌కు ఆమెను అంద‌రూ అభిమానిస్తారు. కామ‌న్ వెల్త్ క్రీడ‌ల‌లో స్వ‌ర్ణ‌ప‌త‌కం సాధించినందుకు ఆమెకు అభినంద‌న‌లు. వివిధ టోర్న‌మెంటుల‌లో ప్ర‌తిభ క‌న‌బ‌రుస్తూ, ఆమె గొప్ప నిల‌క‌డ‌త‌నం క‌లిగి ఉన్నారు. ఆమె భ‌విష్య‌త్ ప్ర‌య‌త్నాల‌కు శుభాకాంక్ష‌లు, ఛీర్స్ ఫ‌ర్ ఇండియా.

Posted On: 08 AUG 2022 1:44PM by PIB Hyderabad

 

ముఖ్యాంశాలు:
ప‌త‌క విజేత‌లు ప్ర‌ద‌ర్శించిన అసాధార‌ణ ప్ర‌తిభ‌కు, రాష్ట్రపతి శ్రీమతి. ద్రౌపది ముర్ము , ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినంద‌న‌లు తెలిపారు.
ప‌త‌క విజేత‌ల‌కు కేంద్ర మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్ అభినంద‌న‌లు తెలిపారు. క్రీడ‌ల‌లో భార‌త‌దేశ బాలిక‌ల శ‌క్తి పూర్తిస్థాయిలో మ‌రోసారి ప్ర‌ద‌ర్శిత‌మౌతోందన్నారు.
2022 కామ‌న్ వెల్త్ క్రీడ‌ల 10 వ‌రోజు  భార‌త‌దేశం మ‌రో 15 ప‌త‌కాల‌ను గెలుచుకుంది. ఇందులో 5 స్వ‌ర్ణ‌ప‌త‌కాలు, 4 ర‌జ‌త ప‌త‌కాలు, 6 కాంస్య‌ప‌త‌కాలు ఉన్నాయి.
శ‌ర‌త్ క‌మ‌ల్/ శ్రీజ ఆకుల (మిక్స్‌డ్ డ‌బుల్ టిటి) , నిఖ‌త్ జ‌రీన్ (బాక్సింగ్‌), ఎల్‌దోస్‌పాల్ (పురుషుల ట్రిపుల్ జంప్ ), అమిత్ పంఘ‌ల్ (బాక్సింగ్‌), నీతుఘంఘాస్ లు (బాక్సింగ్‌)లో స్వ‌ర్ణ‌ప‌త‌కాలు సాధించారు.
అబ్దుల్లా అబూబ‌క‌ర్ (పురుషుల ట్రిపుల్ జంప్‌), సాగ‌ర్ అహ్లావ‌త్ (బాక్సింగ్‌), ఆచంట శ‌ర‌త్ క‌మ‌ల్‌, స‌తియ‌న్ జ్ఞాన‌శేఖ‌ర‌న్ (టేబుల్ టెన్నిస్‌), మ‌హిళ‌ల క్రికెట్ టీమ్‌ల వారు  ర‌జ‌త ప‌త‌కాలు సాధించారు.
 మ‌హిళ‌ల హాకీ టీమ్‌, సందీప్ కుమార్ (పురుషుల 10000 మీ రేస్ వాక్‌), అన్ను రాణి (మ‌హిళ‌ల జావెలిన్ త్రో) సౌర‌వ్ ఘోశాల్‌, దీపికా పాల్లిక‌ల్ (స్క్వాష్‌, మిక్స్‌డ్ డ‌బుల్స్‌) కిడాంబి శ్రీకాంత్ (బాడ్మింట‌న్‌, పురుషుల సింగిల్స్‌), ట్రెస్సా జాలీ, గాయ‌త్రి గోపి చంద్ (బాడ్మింట‌న్, ఉమెన్స్ డ‌బుల్స్‌) ర‌జ‌త ప‌త‌కాలు సాధించారు. భార‌త‌దేశ‌పు ప‌త‌కాల సంఖ్య 55 కుచేరింది. ఇందులో 18 స్వ‌ర్ణ‌ప‌త‌కాలు, 15 ర‌జ‌త ప‌త‌కాలు, 22 కాంస్య ప‌త‌కాలు ఉన్నాయి. రాష్ట్ర‌ప‌తి శ్రీ‌మ‌తి ద్రౌప‌ది ముర్ము, ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ, కేంద్ర క్రీడ‌ల శాఖ మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్ తోపాటు దేశం న‌లుమూల‌ల నుంచి ప్ర‌జ‌లు ప‌త‌కవిజేత‌ల‌కు , వారు క‌న‌ప‌ర‌చిన అద్బుత ప్ర‌తిభ‌కు అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నారు.

ప‌త‌క విజేత‌ల‌కు అభినంద‌న‌లు తెలియ‌జేస్తూ రాష్ట్ర‌ప‌తి ట్వీట్ చేశారు.

"బాక్సింగ్ యువ తేజం సాగ‌ర్ కామ‌న్ వెల్త్ క్రీడ‌ల‌లో బాక్సింగ్ లో ర‌జ‌త ప‌త‌కం సాధించినందుకు అభినంద‌న‌లు. మీ ప‌ట్టుద‌ల‌, అంకిత‌భావం, సాహ‌సం అంద‌రి మ‌న్న‌న‌లు పొందింది. మీరు భార‌త్ గ‌ర్వించేలా చేశారు. మీకు ఉజ్వ‌ల‌మైన భ‌విష్య‌త్తుఉంద‌ని నేను త‌ప్ప‌కుండా చెప్ప‌గ‌ల‌ను."
"ఎంతో ప్ర‌తిభ‌గ‌ల మ‌న టీనేజ్ యువ‌తులు ట్రెసా జాలీ, గాయ‌త్రి గోపిచంద్‌లు 2022 కామ‌న్ వెల్త్ క్రీడ‌ల‌లో బాడ్మింట‌న్ ఉమెన్స్ డ‌బుల్స్‌లో కాంస్య‌   ప‌త‌కం సాధించినందుకు హృద‌య‌పూర్వ‌క అభినంద‌న‌లు. వీరు అద్భుత‌మైన ప‌రిప‌క్వ‌త‌తో విజ‌యాల‌ను న‌మోదు చేశారు. వీరిరువురూ యువ‌త‌కు , ప్ర‌త్యేకించి బాలిక‌ల‌కు మార్గ‌ద‌ర్శ‌కులు."
"కామ‌న్ వెల్త్ క్రీడ‌ల‌లో మిక్స్ డ్ డ‌బుల్స్ టేబుల్ టెన్నిస్ లో శ‌ర‌త్ క‌మ‌ల్‌, శ్రీజ ఆకుల స్వ‌ర్ణ‌ప‌త‌కం సాధించినందుకు హృద‌య‌పూర్వ‌క అభినంద‌న‌లు. వీరు టేబుల్ టెన్నిస్‌లో భార‌త్ కు చ‌రిత్ర సృష్టించారు. బ‌ర్మింగ్‌హామ్‌లో మ‌రోసారి మ‌న తిరంగా స‌మున్న‌తంగా ఎగిరేలా చేశారు."
"కామ‌న్‌వెల్త్ క్రీడ‌ల‌లో భార‌త‌దేశ మ‌హిళ‌ల క్రికెట్ టీమ్ ర‌జ‌త ప‌త‌కం సాధించినందుకు వారికి అభినంద‌న‌లు.  మీరు చివ‌రి వ‌ర‌కు ఛాంపియ‌న్ల‌లా ఆడారు. మ్యాచ్ సంద‌ర్భంగా మీరు చూపిన ప‌ట్టుద‌ల అద్భుతం. మ‌న ఆడ‌బిడ్డ‌లు బ‌ర్మింగ్‌హామ్‌లో భార‌త్ స‌గ‌ర్వంగా నిల‌బ‌డేలా చేశారు."
"2022 కామ‌న్‌వెల్త్ క్రీడ‌ల‌లో బాడ్మింట‌న్ లో కాంస్య‌ప‌త‌కం సాధించిన కిడాంబి శ్రీకాంత్‌కు అభినంద‌న‌లు. కామ‌న్‌వెల్త్ క్రీడ‌ల‌లో మీ వ‌రుస విజ‌యాలు మీ ప‌ట్టుద‌ల‌, మీ ప్ర‌తిభ‌ను తెలియజేస్తున్నాయి.భార‌త బాడ్మింట‌న్‌కు మీరు మంచి రాయ‌బారి."

"కామ‌న్ వెల్త్ క్రీడల‌లో మిక్స్‌డ్ డ‌బుల్స్ స్క్వాష్‌లో ర‌జ‌త ప‌త‌కం సాధించిన దీపికా పాల్లిక‌ల్‌, సౌర‌వ్ ఘోషాల్ ల‌కు అభినంద‌న‌లు. మీరు చూపిన ప్ర‌తిభ భార‌త‌దేశంలోని స్క్వాష్ ప్రేమికుల‌కు ప్రేర‌ణ‌గా నిలిచింది. ఇలాంటి విజ‌యాలు దేశంలో క్రీడ‌ల ప్రాచుర్యాన్ని పెంపొందిస్తాయి."
"కామ‌న్ వెల్త్ క్రీడ‌ల‌లో టేబుల్ టెన్నిస్‌లో ర‌జ‌త ప‌త‌కం సాధించిన శ‌ర‌త్ క‌మ‌ల్‌, స‌తియం జ్ఞాన శేఖ‌ర‌న్‌ల‌కు అభినంద‌న‌లు. మీ అద్భుత జోడీ ఎంతో ప్రాముఖ్య‌త సంత‌రించుకుంది. భార‌తీయులు మిమ్మ‌ల‌ను చూసి గ‌ర్వ‌ప‌డుతున్నారు."
"కామ‌న్ వెల్త్ క్రీడ‌ల‌లో బాక్సింగ్ లో స్వ‌ర్ణ‌ప‌త‌కం సాదించిన వ‌ర‌ల్డ్ ఛాంపియ‌న్ నిఖ‌త్ జ‌రీన్‌కు హృద‌య‌పూర్వ‌క అభినంద‌న‌లు.  మీరు బౌట్‌లలో ఆధిపత్యం చెలాయించారు, ఇది తోటి భారతీయులను ఆనందపరిచింది. మీరు బంగారు పతకం సాధించ‌డం అంటే తిరంగా బర్మింగ్‌హామ్‌లో స‌మున్న‌తంగా ఎగ‌ర‌డం. మీరు ప్రత్యేకంగా అమ్మాయిలకు ఐకాన్‌గా మారారు."
"కామ‌న్‌వెల్త్ క్రీడ‌ల‌లో జావెలిన్ త్రోలో ర‌జ‌త ప‌త‌కం సాధించిన అన్ను రాణి కి అభినంద‌న‌లు. వ‌ర‌ల్డ్ ఛాంపియ‌న్‌షిప్‌లో ఈ పోటీలో క్వాలిఫై అయిన తొలి మ‌హిళ‌గా మీరు కొత్త దారులు తెరిచారు. మీరు సాధించిన ప‌త‌కం భార‌తీయుల‌కు ప్ర‌త్యేకించి మ‌హిళ‌ల‌కు ఒక ప్రేర‌ణ‌."
"కామ‌న్‌వెల్త్ క్రీడ‌ల‌లో 10000 మీట‌ర్ల రేస్ వాక్‌లో కాంస్య‌ప‌త‌కం సాధించ‌చిన సందీప్ కుమార్ కు అభినంద‌న‌లు. మీరు మంచి ప్ర‌తిభ క‌న‌బ‌ర‌చి దేశం గ‌ర్వ‌ప‌డేట్టు చేశారు. మీరు సాధించిన విజ‌యం భార‌తీయులంద‌రికీ ఆనంద‌దాయ‌కం"
”కామ‌న్ వెల్త్ క్రీడ‌ల‌లో ట్రిపుల్ జంప్ లో ఎల్దోస్ పాల్ స్వ‌ర్ణ‌ప‌త‌కం, అబ్దుల్లా అబూ బ‌క‌ర్ ర‌జ‌త ప‌త‌కం సాధించినందుకు అభినంద‌న‌లు. మీరు చ‌రిత్ర సృష్టించారు. ఫైన‌లిస్టులు ఇద్ద‌రూ భార‌తీయులు. ఈ ఘ‌ట్టాన్ని చూడ‌డం భార‌తీయుల‌కు ఎంతో ఆనంద‌దాయ‌కం. ఈ అరుదైన ఘ‌న‌త ఎంతో కాలం గుర్తుండిపోతుంది."

"కామ‌న్ వెల్త్ క్రీడ‌ల‌లో బాక్సింగ్ లో స్వ‌ర్ణ ప‌త‌కం సాధించినందుకు అమిత్ పంఘ‌ల్ కు హృద‌య‌పూర్వ‌క అభినంద‌న‌లు. ఈ ప‌త‌కం సాధించ‌డం ద్వారా మీరు చ‌రిత్ర సృష్టించారు. మీ వేగం, షాట్ ఎంపిక ను మీ ప్ర‌ద‌ర్శ‌న చూస్తున్న వారంతా ఎంతో సంతోషించారు.మీ అద్భుత ప్ర‌తిభ ప్ర‌తి భార‌తీయుడికి గ‌ర్వ‌కార‌ణం."

"కామ‌న్ వెల్త్ క్రీడ‌ల‌లో బాక్సింగ్ లో స్వ‌ర్ణ‌ప‌తకం సాధించినందుకు నీతు కు అభినంద‌న‌లు. పంచింగ్‌,హుకింగ్‌, డిఫెండింగ్‌ లో మీరు చ‌రిత్ర‌సృష్టించారు. ఇంత చిన్న వ‌య‌సులో మీ స్ఫూర్తి, అత్య‌ద్భుత నైపుణ్యాలు ఎంతో మెచ్చుకోద‌గిన‌వి."

 బ‌ర్మింగ్ హామ్ 2022 కామ‌న్ వెల్త్ క్రీడ‌ల మిక్స్‌డ్ డ‌బుల్స్ టేబుల్ టెన్నిస్ పోటీల‌లో  శ‌ర‌త్ క‌మ‌ల్‌, ఆకుల శ్రీజ స్వ‌ర్ణ‌ప‌త‌కం గెల‌చుకున్నందుకు ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అభినంద‌న‌లు తెలిపారు. క‌ల‌సిక‌ట్టుగా ఆడి విజ‌యం సాధించ‌డంలో ఎంతో ఆనందం ఉంది. శ‌ర‌త్ క‌మ‌ల్‌, శ్రీజ ఆకుల అద్భుత టీమ్ వ‌ర్క్ ప్ర‌ద‌ర్శించి టిటి మిక్స్‌డ్ డ‌బుల్స్ ఈవెంట్‌లో  ప్ర‌తిష్ఠాత్మ‌క స్వ‌ర్ణ‌ప‌త‌కాన్ని సాధించారు. వారి ప‌ట్టుద‌ల , సంక‌ల్పానికి అభినంద‌న‌లు. శ‌ర‌త్ తాను పాల్గొన్న‌ అన్ని కామ‌న్ వెల్త్ గేమ్ ఈవెంట్ల‌లో ఫైన‌ల్స్‌కు చేరుకుంటున్నారు. ఇది అత్య‌ద్భుతం.
2022 కామ‌న్ వెల్త్ క్రీడ‌ల‌లో కాంస్య‌ప‌త‌కం గెలుచుకున్న‌దుకు ప్ర‌ధానమంత్రి , కిడాంబి శ్రీకాంత్‌ను అభినందించారు. ట్విట్ట‌ర్ ద్వారా ఒక సందేశ‌మిస్తూ ప్ర‌ధాన‌మంత్రి, భార‌త బాడ్మింట‌న్‌లో శిఖ‌ర‌స‌మానుల‌లో ఒక‌రైన శ్రీకాంత్ కిడాంబి కామ‌న్ వెల్త్ క్రీడ‌ల వ్య‌క్తిగ‌త మాచ్‌లో కాంస్య ప‌త‌కం సాధించారు. ఇది శ్రీకాంత్ సాధించిన నాలుగ‌వ కామ‌న్‌వెల్త్ గేమ్ మెడ‌ల్‌. దీనిని బ‌ట్టి ఆయ‌న నైపుణ్యం, నిల‌క‌డ‌త‌నం తెలుస్తోంది. శ్రీకాంత్‌కు అభినంద‌న‌లు. అథ్లెటిక్ రంగంలోకి వ‌స్తున్న వారికి శ్రీకాంత్ ప్రేర‌ణ‌గా ఉండి భార‌త్ మ‌రింత గ‌ర్వ‌ప‌డేట్టు చేస్తారు. ఛీర్స్ ఫ‌ర్ ఇండియా.

2022 కామ‌న్ వెల్త్ క్రీడ‌ల‌లో మ‌హిళ‌ల క్రికెట్ బృందం ర‌జ‌త ప‌త‌కం సాధించినందుకు ప్ర‌ధాన‌మంత్రి అభినంద‌న‌లు తెలిపారు. క్రికెట్‌, ఇండియా విడ‌దీయ‌రానివ‌ని అన్నారు. మ‌న మ‌హిళా క్రికెట్ టీమ్ అద్భుతంగా కామ‌న్ వెల్త్ క్రీడ‌ల‌లో ఆడింది. వారు మ‌న దేశానికి ప్ర‌తిష్ఠాత్మ‌క ర‌జ‌త ప‌త‌కం సాధించారు. క్రికెట్‌లో ఇది తొలి సిడ‌బ్ల్యుజి మెడ‌ల్ అయినందున‌, ఇది ఎప్ప‌టికీ ప్ర‌త్యేక‌మే. మ‌హిళా టీమ్ స‌భ్యులంద‌రికీ ఉజ్య‌ల భ‌విష్య‌త్ ను ఆకాంక్షిస్తున్నాను.
కామ‌న్ వెల్త్ క్రీడ‌ల‌లో బాడ్మింట‌న్ డ‌బుల్స్‌లో ట్రీసా జాలీ, గాయ‌త్రి గోపిచంద్ కాంస్య ప‌త‌కం గెలిచినందుకు ప్ర‌ధాన‌మంత్రి అభినంద‌న‌లు తెలిపారు. బాడ్మింట‌న్ డ‌బుల్స్ లో ట్రీసా జాలీ, గాయ‌త్రి గోపిచంద్‌లు కాంస్య ప‌త‌కం గెలుపొందినందుకు  గ‌ర్వంగా ఉంది. కామ‌న్ వెల్త్ క్రీడ‌ల‌కు వెళ్ల‌డానికి ముందు ట్రీసా త‌న‌కు గాయ‌త్రితో గ‌ల స్నేహం గురించి నాకు చెప్పింది. మెడ‌ల్ గెలిస్తే దానిని ఎలా సెలిబ్రేట్ చేసుకుంటాన‌న్న దానిపై త‌న‌కు అప్పుడు ఆలోచ‌న లేదు. ఇక ఇప్పుడు ఆమె త‌న ప్ర‌ణాళిక‌లు రూపొందించుకుని ఉంటుంద‌ని నేను ఆశిస్తున్నాను.

 కామ‌న్ వెల్త్ క్రీడ‌ల‌లో బాక్సింగ్‌లో ర‌జ‌త ప‌త‌కం సాధించినందుకు సాగ‌ర్ అహ్లావ‌త్‌కు ప్ర‌ధాన‌మంత్రి అభినంద‌న‌లు తెలిపారు.  అద్భుతంగా పోరాడారు సాగ‌ర్ అహ్లావ‌త్ అంటూ ప్ర‌ధాన‌మంత్రి అభినంద‌న‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా ట్విట్ట‌ర్ ద్వారా ఒక సందేశ‌మిస్తూ ఇత‌ను ఈ క్రీడ‌లో భార‌త్ ప‌వ‌ర్ హౌస్ ల‌లో ఒక‌రు. ఇత‌ని విజ‌యం ఎంతోమంది యువ బాక్స‌ర్ల‌కు ప్రేర‌ణ‌నిస్తుంది. రాగ‌ల రోజుల‌లో భార‌త్ గ‌ర్వ‌ప‌డేలా త‌న విజ‌యాలను కొన‌సాగిస్తార‌ని ఆశిస్తున్నాను. ఛీర్స్ ఫ‌ర్ ఇండియా
 కామ‌న్ వెల్త్  క్రీడ‌ల‌లో వివిధ అంశాల‌లో మ‌న అథ్లెట్లు విశేష ప్ర‌తిభ క‌న‌బ‌రచ‌డాన్ని చూడ‌డం ఆనంద‌దాయ‌కం అంటూ సౌర‌వ్ ఘోశాల్‌, దీపిక ల‌కు అభినంద‌న‌లు తెలుపుతూ ప్ర‌ధాన‌మంత్రి ట్వీట్ చేశారు. సౌర‌వ్ ఘోశాల్‌, దీపికా పల్లిక‌ల్‌లు స్క్వాష్ మిక్స్‌డ్ డ‌బులు ఈవెంట్‌లో కాంస్య ప‌త‌కం గెలుపొందినందుకు అభినంద‌న‌లు. వీరు అద్భుత నైపుణ్యాన్ని, టీమ్ వ‌ర్క్ ను ప్ర‌ద‌ర్శించారు. వీరికి శుభాభినంద‌న‌లు. ఛీర్స్ ఫ‌ర్ ఇండియా.

టీమ్ వ‌ర్క్ కు మ‌రింత్ ప‌వ‌ర్‌. శ‌ర‌త్ క‌మ‌ల్‌, స‌త్య‌నాథ్ ల  డైన‌మిక్ టీమ్ పురుషుల డ‌బుల్స్ ఈవెంట్‌లో  ర‌జ‌త ప‌త‌కం సాధించింది. ఈ అద్భుత అథ్లెట్ల‌కు అభినంద‌న‌లు. ఛీర్స్ ఫ‌ర్ ఇండియా.

మ‌హిళ‌ల జావెలిన్ త్రోలో కాంస్య‌ ప‌త‌కం సాధించిన అన్ను రాణిని ప్ర‌ధాన‌మంత్రి అభినందించారు. అన్నురాణి అద్భుత అథ్లెట్‌. ఆమె గొప్ప ప్ర‌తిభ క‌న‌బరిచారు. అత్యున్న‌త నైపుణ్యాలు ప్ర‌ద‌ర్శించారు. జావెలిన్ లో ఆమె  కాంస్య‌ప‌త‌కం సాధించినందుకు అభినంద‌న‌లు. రాగ‌ల సంవ‌త్స‌రాలో మ‌రింత‌గా రాణిస్తార‌న్న న‌మ్మకం నాకు ఉంది. ఛీర్స్ ఫ‌ర్‌ ఇండియా
 రేస్ వాకింగ్ కంటింజెంట్ , బ‌ర్మింగ్ హామ్ లో జ‌రిగిన కామ‌న్ వెల్త్ క్రీడ‌ల‌లో ప్ర‌తిభ క‌న‌బ‌రచినందుకు సంతోషంగా ఉంది.  10,000 మీట‌ర్ల ఈవెంట్ లో సందీప్‌కుమార్ కాంస్య ప‌త‌కం గెలుచుకున్నందుకు అభినంద‌న‌లు. భ‌విష్య‌త్ ప్ర‌య‌త్నాల‌కు శుభాభినంద‌న‌లు, ఛీర్స్ ఫ‌ర్‌ ఇండియా

 బ‌ర్మింగ్ హామ్ లో జ‌రిగిన ట్రిపుల్ జంప్ ఈవెంట్‌లో  అబ్దుల్లా అబూబక‌ర్ ర‌జ‌త ప‌త‌కం సాధించ‌డం ఎంతో సంతోషంగా ఉంది. ఎంతో శ్ర‌మ‌, అద్భుత ప‌ట్టుద‌ల‌తో దీనిని సాధించారు. అత‌ని భ‌విష్య‌త్ ప్ర‌య‌త్నాల‌కు శుభాకాంక్ష‌లు.ఛీర్స్ ఫ‌ర్ ఇండియా.

బ‌ర్మింగ్ హామ్ లో జ‌రిగిన 2022 కామ‌న్ వెల్త్‌క్రీడ‌ల‌లో మెన్స్ ట్రిపుల్ జంప్ పోటీల‌లో స్వ‌ర్ణ ప‌త‌కం సాధించిన ఎల్దోస్ పాల్‌ను ప్ర‌ధాన‌మంత్రి అభినందించారు. ఇవాల్టి ట్రిపుల్ జంప్ ఈవెంట్ చ‌రిత్రాత్మ‌కమైన‌ది. మ‌న అథ్లెట్లు అద్భుత ప్ర‌తిభ క‌న‌బ‌ర‌చారు. అమోఘ‌మైన ప్ర‌తిభ క‌ల ఎల్దోస్ పాల్‌కు అభినంద‌న‌లు. పాల్ స్వ‌ర్ణ‌ప‌త‌కం సాధించారు. అత‌ని అంకిత‌భావం ప్ర‌శంసించ‌ద‌గిన‌ది. ఛీర్స్ ఫ‌ర్ ఇండియా.

కామ‌న్ వెల్త్ క్రీడ‌ల‌లో మ‌న ప‌త‌కాల‌కు అమిత్ ప‌న‌ఘ‌ల్ సాధించిన ప్ర‌తిష్ఠాత్మ‌క ప‌త‌కం కూడా వ‌చ్చి చేరింది. అత‌ను  అంద‌రూ అత్యంత మెచ్చుకునే నైపుణ్యం కలిగిన బాక్సర్లలో ఒకరు., అతను అత్యుత్తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి బంగారు పతకం సాధించినందుకు నేను అతనిని అభినందిస్తున్నాను ,అత‌ని ఉజ్వ‌ల  భవిష్యత్తుకు శుభాకాంక్ష‌లు. ఛీర్స్ ఫ‌ర్ ఇండియా.

2022 కామ‌న్ వెల్త్ క్రీడ‌ల‌లో బాక్సింగ్ లో స్వ‌ర్ణ‌ప‌త‌కం సాధించినందుకు ప్ర‌ధాన‌మంత్రి, నీతును అభినందించారు. స్వ‌ర్ణ‌ప‌త‌కానికి మీరు అత్యంత అర్హులు అని ప్ర‌ధాన‌మంత్రి త‌మ ట్విట్ట‌ర్ సందేశంలో పేర్కోన్నారు. ఆమె క్రీడ‌ల‌ను ఎంత‌గానో అభిమానించారు. ఆమె సాధించిన విజ‌యంతో బాక్సింగ్ మ‌రింత ప్ర‌జాద‌ర‌ణ పొంద‌నుంది. ఆమె భ‌విష్య‌త్ ప్ర‌య‌త్నాల‌కు నా శుభాభినంద‌న‌లు. ఛీర్స్ ఫ‌ర్ ఇండియా అని ప్ర‌ధాన‌మంత్రి త‌మ సందేశంలో పేర్కొన్నారు.

"కామ‌న్ వెల్త్ క్రీడ‌ల‌లో మ‌హిళ‌ల హాకీ బృందం కాంస్య ప‌త‌కం సాధించినందుకు అభినంద‌న‌లు. మీ టీమ్ వ‌ర్క్‌, ప్ర‌తి భార‌తీయుడి హృద‌యాన్ని గెలుచుకుంది. మీరు భార‌త్ గ‌ర్వ‌ప‌డేలా చేశారు. భార‌త్‌కు మ‌రిన్ని ప‌త‌కాలు మీరు తేగ‌ల‌ర‌ని ఆకాంక్ష‌"

"2022 కామ‌న్ వెల్త్ క్రీడ‌ల‌లో భార‌త మ‌హిళా హాకీ బృందం కాంస్య ప‌త‌కం గెలుచుకున్నందుకు ప్ర‌ధాన‌మంత్రి అభినంద‌న‌లు తెలిపారు. ఇది దేశానికి గ‌ర్వ‌కార‌ణ‌మ‌న్నారు. ఇందుకు సంబంధించి ప్ర‌ధాన‌మంత్రి ట్వీట్ చేస్తూ
ఇండియాకు భార‌త్ తో ప్ర‌త్యేక అనుబంధం ఉంది. కాంస్య ప‌త‌కం గెలుచుకుని మ‌న భార‌త మ‌హిళా హాకీ బృందం సాధ‌ఙంచిన విజ‌యం విషయంలో ప్ర‌తి భార‌తీయుడు గ‌ర్వ‌ప‌డుతున్నార‌డు. కామ‌న్ వెల్త్ క్రీడ‌ల పోడియంపై మ‌హిళ‌ల బృందం క‌నిపించ‌డం ఇటీవ‌లి కాలంలో ఇదే ప్ర‌థ‌మం. టీమ్ ను చూసి గ‌ర్వ‌ప‌డుతున్నాను. #Cheer4India
కేంద్ర క్రీడ‌ల శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ కామ‌న్ వెల్త్ క్రీడ‌ల‌లో ప‌త‌కాలు సాధించిన వారిని అభినందించారు. ట్విట్ట‌ర్ ద్వారా సందేశ‌మిస్తూ మంత్రి,
"కామ‌న్ వెల్త్ క్రీడ‌ల‌లో తొలిసారిగా పాల్గొని మెడ‌ల్ సాధించినందుకు సాగ‌ర్ కు అభినంద‌న‌లు. మీరు ఈసారి స్వ‌ర్ణ‌ప‌త‌కం కోల్పోయి ఉండ‌వ‌చ్చు. కానీ మీరు క‌న‌బ‌ర‌చిన ప్ర‌తిభ‌మీరు దేశానికి మ‌రింత పేరు ప్ర‌తిష్ఠ‌లు తేగ‌ల‌ర‌ని నిరూపిస్తోంది."
"ట్రెస్సా జాలీ, గాయ‌త్రి గోపిచంద్‌లు బాడ్మింట‌న్‌డ‌బుల్స్ లో సాధించిన ప‌త‌కాలు, కేవ‌లం  దేశ ప‌త‌కాల సంఖ్య‌ను పెంచ‌డం కాక‌, 2022 కామ‌న్ వెల్త్ క్రీడ‌ల‌లో తొలిసారి విజేత‌ల సంఖ్య‌ను పెంచింది."

"కామ‌న్ వెల్త్ క్రీడ‌ల‌లో టిటి మిక్స్‌డ్ డ‌బుల్స్ ఫైన‌ల్స్‌లో శ‌ర‌త్ క‌మ‌ల్‌, శ్రీ‌జ స్వ‌ర్ణ‌ప‌తకం సాధించి ఎంతో అద్భుత నైపుణ్యాన్ని ప్ర‌ద‌ర్శించారు. ఈ టీమ్ కు అభినంద‌న‌లు. టోర్న‌మెంట్ అంత‌టా అద్భుత ప్ర‌తిభ క‌న‌బ‌రిచి భార‌త‌దేశ ప‌త‌కాల జాబితాకు మ‌రో స్వ‌ర్ణ‌ప‌త‌కాన్ని చేరేలా చేశారు. వారికి అభినంద‌న‌లు."
"కామ‌న్ వెల్త్ క్రీడ‌ల‌లో భార‌త మ‌హిళా క్రికెట్ టీమ్ ర‌జ‌త‌ప‌త‌కం సాధించి, క్రీడ‌ల‌లో నానాటికీ పెరుగుతున్న భార‌త మ‌హిళా శ‌క్తిని పూర్తిస్థాయిలో ప్ర‌ద‌ర్శించింది. తొలిసారి పాల్గొన‌డం ఎంతో అద్భుత జ్ఞాప‌కం.ఫైన‌ల్స్‌కు చేరుకుని ఈ బృందం మ‌నంద‌రం గ‌ర్వ‌ప‌డేట్టుచేసింది. వెల్‌డ‌న్"

కామ‌న్ వెల్త్ క్రీడ‌ల‌లో నాలుగ‌వ ప‌త‌కం సాధించినందుకు కిడాంబి శ్రీకాంత్ కు ప్ర‌ధాన‌మంత్రి అభినంద‌న‌లు తెలిపారు. ఈ కాంస్య ప‌త‌కం అద్భుతంగా పోరాడి సాధించిన‌ది. మీ థామ‌స్ క‌ప్ విజ‌యం చూశాను. అదే తీరులో మీరు ఆత్మ‌విశ్వాసం ప్ర‌ద‌ర్శించారు, కోర్ట్ లో మీ నిల‌క‌డ‌త‌నం ప్ర‌శంసించ‌ద‌గిన‌ది అని ప్ర‌ధాన‌మంత్రి తమ సందేశంలో పేర్కొన్నారు.

2022 కామ‌న్ వెల్త్ క్రీడ‌ల‌లో ఇండియాకు టేబుల్ టెన్నిస్‌లో రెండో మెడ‌ల్ సాధించినందుకు ఆచంట శ‌ర‌త్ క‌మ‌ల్‌, జి.స‌తియ‌న్‌ల‌కు ప్ర‌ధాన‌మంత్రి అభినంద‌న‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ట్విట్ట‌ర్ ద్వారా ఒక సందేశ‌మిస్తూ మీరు భార‌త‌దేశ‌పు ప్ర‌తిష్ఠాత్మ‌క బాడ్మింట న్ ద్వ‌యం. ఇవాళ ర‌జ‌త ప‌త‌కం సాధించ‌డంలో జ‌రిగిన పోరు దీనిని రుజువుచేస్తున్న‌ది "అని ప్ర‌ధాన‌మంత్రి త‌మ సందేశంలో తెలిపారు.
 "కామ‌న్ వెల్త్ క్రీడ‌ల‌లో ట్రిపుల్ జంప‌ర్ ఎల్దో్ పాల్ స్వ‌ర్ణ‌ప‌తకం గెలిచి మ‌నంద‌రికి గ‌ర్వ‌కార‌ణ‌మ‌య్యారు. అందులోనూ 17.03 అద్భుత కృషితో స్వ‌ర్ణ‌ప‌త‌కం సాధించారు. 17 మిట‌ర్ల జంప్ తో స్వ‌ర్ణ‌ప‌త‌కం గెల‌వ‌డం మ‌హాద్భుతం కూడా . చీర్స్ ఫ‌ర్ ఇండియా అన ఆయ‌న పేర్కొన్నారు."

"కామ‌న్ వెల్త్ 2022 క్రీడ‌ల‌లో పురుషుల ట్రిపుల్ జంప్‌లోఅబ్దుల్లా అబూబ‌క‌ర్ 1-2 తో 17.02 కృషితో అద్భుత విజ‌యం సాధించారు. అత‌ను ర‌జ‌త‌ప‌త‌కం వ‌ర‌కు వెళ్లాడు. అత‌ను సాధించిన విజ‌యం ఎప్ప‌టికీ గుర్తుంటుంది. ఛీర్ ఫ‌ర్ ఇండియా"
"కామ‌న్ వెల్త్ క్రీడ‌ల మ‌హిళ‌ల జావెలిన్‌త్రోలో అన్ను రాణి కాంస్య‌ప‌త‌కంసాధించి పేరు తెచ్చుకున్నారు. ఒలింపిక్స్ క్రీడ‌ల‌లో ఎదురైన గాయంనుంచి కోలుకుని వ‌చ్చి గ‌ట్టి పోటీ ఇచ్చారు. ఛీర్ ఫ‌ర్ ఇండియా"
"2022కామ‌న్ వెల్త్ క్రీడ‌ల 1000 మీట‌ర్ల రేస్ వాక్ లో సందీప్ కుమార్ కాంస్య‌ప‌త‌కం సాధించారు. గ‌ట్టిప‌ట్టుద‌ల , కృషితో ఈ విజయం సాధించాడు. మంచి ప‌నితీరు క‌న‌బ‌ర‌చాడు. అత‌నికి అభినంద‌న‌లు ఛీర్ ఫ‌ర్ ఇండియా"
"అమిత్ ప‌న్‌ఘ‌ల్ ప్ర‌ముఖ బాక్స్‌. పురుషుల 51 కేజిల బాక్సింగ్‌లో స్వ‌ర్ణ ప‌త‌కం సాధించారు. వారికి అభినంద‌న‌లు.మీ విజ‌యానికి గ‌ర్వ‌ప‌డుతున్నాము. అని ప్ర‌ధాన‌మంత్రి త‌మ సందేశంలో పేర్కొన్నారు.”
" నితు ఘ‌న్ ఘాస్‌, రెండు సార్లు ప్ర‌పంచ యువ ఛాంపియ‌న్‌. ఆమె కామ‌న్ వెల్త్ క్రీడ‌ల‌ 48 కేజిల విభాగంలో స్వ‌ర్ణ‌ప‌త‌కం సాధించారు. నితు ఘ‌న్‌ఘాస్ మిమ్మ‌ల్ని చూసి  గ‌ర్వ‌ప‌డుతున్నాము."

"కామ‌న్ వెల్త్ క్రీడ‌ల‌లో అద్భుత ప్ర‌తిభ క‌న‌బ‌ర‌చిన స‌విత పునియ‌, మ‌హిళ‌ల హాకీ బృందానికి అభినంద‌న‌లు. ఈ బృందం కాంస్య‌ప‌త‌కంసాధించింది. వీరి ప‌నితీరు అద్భుతం. న్యూజిలాండ్‌పై వీరి ఆట అద్భుతం. గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా భార‌త మ‌హిళ‌ల హాకీ బృందం ప‌నితీరు బ్ర‌హ్మాండంగా ఉంది." 

శ్రీజ ఆకుల సాధించిన విజ‌యాల‌కు ఇక్క‌డ క్లిక్ చేయండి
నిఖ‌త్ జ‌రీన్‌ సాధించిన విజ‌యాల‌కు ఇక్క‌డ క్లిక్ చేయండి
ఎల్దోస్‌పాల్ సాధించిన విజ‌యాల‌కు ఇక్క‌డ క్లిక్ చేయండి
అమిత్ ప‌న‌ఘ‌ల్‌ సాధించిన విజ‌యాల‌కు ఇక్క‌డ క్లిక్ చేయండి
నీతు ఘ‌న‌ఘాస్ సాధించిన విజ‌యాల‌కు ఇక్క‌డ క్లిక్ చేయండి

 అబ్దుల్లా అబుబ‌క‌ర్‌ సాధించిన విజ‌యాల‌కు ఇక్క‌డ క్లిక్ చేయండి
 సాగ‌ర్ అహ్లావ‌త్‌ సాధించిన విజ‌యాల‌కు ఇక్క‌డ క్లిక్ చేయండి
 స‌తియ‌న్ జ్ఞాన‌శేఖ‌ర‌న్‌సాధించిన విజ‌యాల‌కు ఇక్క‌డ క్లిక్ చేయండి
 సందీప్ కుమార్‌సాధించిన విజ‌యాల‌కు ఇక్క‌డ క్లిక్ చేయండి
 అన్నురాణి సాధించిన విజ‌యాల‌కు ఇక్క‌డ క్లిక్ చేయండి
 సౌర‌వ్ గోస‌ల్ సాధించిన విజ‌యాల‌కు ఇక్క‌డ క్లిక్ చేయండి
 దీపికా పాల్లిక‌ల్  సాధించిన విజ‌యాల‌కు ఇక్క‌డ క్లిక్ చేయండి
 కిడాంబి శ్రీకాంత్ సాధించిన విజ‌యాల‌కు ఇక్క‌డ క్లిక్ చేయండి
 వి ట్రెస్సా జాలి సాధించిన‌ విజ‌యాల‌కు ఇక్క‌డ క్లిక్ చేయండి
  గాయ‌త్రి గోపిచంద్ సాధించిన విజ‌యాల‌కు ఇక్క‌డ క్లిక్ చేయండి

 

***


(Release ID: 1850426) Visitor Counter : 132