హోం మంత్రిత్వ శాఖ
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రజలకు అభివాదాలు తెలిపిన కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా
మన సుసంపన్నమైన, వైవిధ్యభరితమైన సాంస్కృతిక వారసత్వాన్ని భారతీయ చేనేత రంగం సూచిస్తుంది
ప్రాచీన భారతీయ కళను పునరుద్ధరించడం, 1905లో ఇదే రోజున ప్రారంభమైన స్వదేశీ ఉద్యమ స్మారక చిహ్నంగా 2015లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆగస్టు 7ని జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించారు
దేశీయ చేనేత పనివారు నేసిన చేనేత ఉత్పత్తులను దేశప్రజలను ఉపయోగించేలా ప్రోత్సహించడం కూడా దీని లక్ష్యం
మన చేనేత వారసత్వాన్ని పరిరక్షించి, ప్రోత్సహిస్తూ, చేనేత పనివారిని, ముఖ్యంగా మహిళలను సాధికారం చేయాలన్న మోడీ ప్రభుత్వ సంకల్పాన్ని బలోపేతం చేయడం కోసం ఈ 8వ జాతీయ చేనేత దినోత్సవం రోజున, అందరం చేతులు కలుపుదాం
Posted On:
07 AUG 2022 12:55PM by PIB Hyderabad
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా కేంద్రహోం, సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా ప్రజలకు అభివాదాలు తెలిపారు.
మనం సుసంపన్నమైన, వైవిధ్యభరితమైన సాంస్కృతిక వారసత్వానికి చిహ్నంగా భారతీయ చేనేత రంగం ఉంటుంది. ప్రాచీనమైన భారతీయ కళను పునరుద్ధరించడానికి, 1905లో ఇదే రోజున ప్రారంభమైన స్వదేశీ ఉద్యమ స్మారక చిహ్నంగా 2015లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆగస్టు 7ని జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించారని తన ట్వీట్ల పరంపరలో అమిత్ షా పేర్కొన్నారు.
దేశీయ చేనేతపనివారు నేసిన చేనేత ఉత్పత్తులను మన పౌరులు వినియోగించేందుకు ప్రోత్సహించడం కూడా దీని లక్ష్యంగా ఉంది. మన చేనేత వారసత్వాన్ని పరిరక్షించి, ప్రోత్సహిస్తూ, చేనేత పనివారిని, ముఖ్యంగా మహిళలను సాధికారం చేయాలన్న మోడీ ప్రభుత్వ సంకల్పాన్ని బలోపేతం చేయడం కోసం ఈ 8వ జాతీయ చేనేత దినోత్సవం రోజున, అందరం చేతులు కలుపుదాం అని కేంద్ర హోం మంత్రి అన్నారు.
***
(Release ID: 1849546)