విద్యుత్తు మంత్రిత్వ శాఖ
రాష్ట్రాలు మరియు రాష్ట్ర విద్యుత్ సంస్థలతో సమీక్ష ప్రణాళిక మరియు పర్యవేక్షణ (RPM) సమావేశం
సమీక్ష ప్రణాళిక & పర్యవేక్షణ (RPM) సమావేశం సందర్భంగా డిస్కమ్‌ల 10వ సమగ్ర పనితీరు సూచికను ప్రారంభించిన శ్రీ ఆర్ కె సింగ్
స్మార్ట్ ప్రీ-పెయిడ్ మీటరింగ్ మొబైల్ యాప్ మరియు డిస్కమ్‌ల వినియోగదారుల సేవల సూచికను కూడా ప్రారంభించారు
Posted On:
06 AUG 2022 9:11AM by PIB Hyderabad
రాష్ట్రాలు మరియు రాష్ట్ర విద్యుత్ సంస్థలతో సమీక్ష ప్రణాళిక మరియు పర్యవేక్షణ (RPM) సమావేశం 05.08.2022న న్యూ ఢిల్లీలో గౌరవనీయ కేంద్ర విద్యుత్ మరియు నూతన మరియు పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ఆర్ కె సింగ్ అధ్యక్షతన జరిగింది. గౌరవనీయ విద్యుత్ మరియు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ క్రిషన్ పాల్ గుర్జార్ సమక్షంలో, విద్యుత్ మరియు నూతన మరియు పునరుత్పాదక ఇంధన శాఖ కార్యదర్శి తో పాటు విద్యుత్ మంత్రిత్వ శాఖ, నూతన మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ, కేంద్ర ప్రభుత్వ విద్యుత్ రంగ సంస్థ (CPSE)లు మరియు వివిధ రాష్ట్రాల రాష్ట్ర విద్యుత్ సంస్థలు వివిధ రాష్ట్రాల ఇంధన శాఖలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
గౌరవనీయ ప్రధాన మంత్రి 30 జూలై, 2022న
ఉజ్వల్ భారత్ ఉజ్వల్ భవిష్య ఉత్సవాల సందర్భంగా చేసిన ప్రసంగం స్ఫూర్తితో విద్యుత్ రంగ సామర్థ్యం, నిరంతరం కొనసాగే సుస్థిరత లక్ష్యాలతో విద్యుత్ రంగంలో జాతీయ ప్రాముఖ్యత కలిగిన అనేక అంశాలపై సమావేశం చర్చించింది. వీటిలో ప్రభుత్వ శాఖ లకు చెందిన విద్యుత్ బకాయిలు, సబ్సిడీ బకాయిల చెల్లింపు ఉన్నాయి; ప్రభుత్వ శాఖలలో ప్రీపెయిడ్ స్మార్ట్ మీటరింగ్‌పై పురోగతి; విద్యుత్ తనిఖీ లెక్కలు, సబ్సిడీ లెక్కలు, సకాలంలో మరియు ముందస్తు చెల్లింపుల కోసం కట్టుదిట్టమైన బలిష్టమైన వ్యవస్థలను ఏర్పాటు చేయడం; సాధారణ మరియు నిజమైన టారిఫ్‌లు, టారిఫ్‌ల సకాలంలో స్థిరీకరణ; విద్యుత్ సంస్థల ఖాతాలు సకాలంలో ఖరారు; ఫీడర్ & డి టి మీటరింగ్ యొక్క పురోగతి; పునరుద్ధరించిన పంపిణీ రంగ పథకం (RDSS)పై పురోగతి; మరియు విద్యుత్ (ఆలస్య చెల్లింపు సర్‌ఛార్జ్ మరియు సంబంధిత విషయాలు) నియమాలు, 2022కి సంబంధించి అమలు పై సమావేశం చర్చించింది.
ఈ సమావేశంలో, గౌరవనీయ కేంద్ర మంత్రి (i) విద్యుత్ పంపణీ సంస్థల 10వ సమగ్ర రేటింగ్, (ii) డిస్కమ్‌ల 1వ వినియగదారుల సేవల రేటింగ్ మరియు (iii) భారత్ ఈ స్మార్ట్ (eSmart) మొబైల్ అప్లికేషన్ (BeSMA)ను ప్రారంభించారు.
ఆర్థిక స్థిరత్వం, పనితీరు, శ్రేష్ఠత , వాస్తవ పరిస్థితులు, ఏటేటా అభివృద్ధి ని కొనసాగించే సామర్ధ్యం వంటి పలు అర్హతలు అంశాలు ఆధారంగా విద్యుత్ సంస్థల పనితీరును మూల్యాంకనం చేసే లక్ష్యంతో సమగ్ర రేటింగ్ విధానం 2012 నుండి ఏటా కొనసాగుతోంది.
ఈ సిరీస్‌లో 10వదైన ప్రస్తుత రేటింగ్ విధానం లో రేటింగ్ కోసం విధివిధానాల ప్రక్రియ సమగ్రంగా సమీక్షించబడింది అలాగే సవరించబడింది,
ఇప్పుడు రేటింగ్ ఆర్థిక పనితీరుకు అధిక ప్రాధాన్యతనిస్తుంది, అదే సమయంలో డిస్కమ్‌ల (DISCOM) కార్యాచరణ సామర్థ్యాలు, వాస్తవ పరిస్థితులు వర్తమాన వ్యవస్థను కూడా అంచనా వేస్తుంది. డిస్కం ల ఆర్థిక అభివృద్ది పై ప్రభావం చూపే ఉత్ప్రేరకాల ఆధారంగా రేటింగ్ ఇప్పుడు గమన మార్పు స్వభావం కలిగి ఉంటుంది. ప్రైవేట్ డిస్కమ్‌లు మరియు రాష్ట్ర విద్యుత్ శాఖలు కూడా
సమగ్ర విద్యుత్ రంగ రేటింగ్ విధానం లో చేర్చబడ్డాయి. urjadrishti.comలో వివరాలను పొందవచ్చు.
దేశవ్యాప్తంగా విద్యుత్ వినియోగదారులకు అత్యుత్తమ శ్రేణి సేవలను అందించే లక్ష్యంతో బహుళ సంస్కరణ చర్యలలో భాగంగా గౌరవనీయ కేంద్ర మంత్రి 2020-21 ఆర్థిక సంవత్సరానికి డిస్కమ్‌ల తొలి వినియోగదారుల సేవా రేటింగ్ (CSRD)ని కూడా ప్రారంభించారు. వివిధ డిస్కామ్‌లలో వినియోగదారుల సేవల ప్రస్తుత స్థితిని నివేదిక అందజేస్తుంది. కార్యాచరణ విశ్వసనీయత, కనెక్షన్ సేవలు, మీటరింగ్, బిల్లింగ్ , బిల్లు వసూలు సేవలు, తప్పులను సరిదిద్దడం మరియు ఫిర్యాదుల పరిష్కారం వంటి వినియోగదారు సేవల యొక్క కీలక ప్రమాణాలను పరిశీలిస్తుంది. ఏడు సూత్రాల స్కేల్‌లో గుర్తించబడిన వివిధ ప్రమాణాలకనుగుణంగా డిస్‌కామ్‌లను రేట్ చేస్తారు. అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న డిస్కమ్‌ల యొక్క ఉత్తమ విధానాలను ఇతరులు అమలు చేయడంతోపాటు పనితీరును మెరుగుపరచడానికి అవసరమైన కీలకమైన ప్రమాణాలను గుర్తించడంలో ఇతర డిస్కమ్‌లకు సహాయం చేయడం దీని ఉద్దేశం. recindia.nic.in లింక్ లో నివేదిక అందుబాటులో ఉంది
దేశవ్యాప్తంగా స్మార్ట్ మీటరింగ్ అమలు కోసం ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ల కోసం వినియోగదారుల సాధికారతను పెంపొందించే దిశలో ఒక ముందడుగా ఉచితంగా మొబైల్ యాప్ కూడా ప్రారంభించబడింది. ఈ మొబైల్ యాప్ స్మార్ట్ మీటర్ల డేటాపై రూపొందించబడుతుంది మరియు వినియోగదారులకు వారి వినియోగానికి సంబంధించి అవసరమైన సమాచారాన్ని అందిస్తుంది .యూనిట్లు మరియు డబ్బుల పరిమితులు నిబంధనల పరంగా మిగిలిన విద్యుత్తును బ్యాలెన్స్ చేస్తుంది. యాప్ వినియోగదారులకు వారి విద్యుత్ వినియోగానికి సంబంధించిన వర్తమాన తాజా సమాచారాన్ని తెలుసుకోవడానికి మరియు హెచ్చరికలు, ముందస్తు సూచనలు స్వీకరించడానికి వీలు కల్పిస్తుంది. యాప్ సులభంగా మొబైల్ ఫోన్‌ల ద్వారా చెల్లింపు మరియు రీఛార్జ్ కోసం యు పి ఐ ( UPI), నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ & డెబిట్ కార్డ్ మొదలైన చెల్లింపు గేట్‌వేల సౌలభ్యం అందిస్తుంది. ఈ మొబైల్ యాప్ దాదాపు వర్తమాన తాజా సమయంలో వారి విద్యుత్ వినియోగంపై పట్టు సాధించేలా చేయడం ద్వారా వినియోగదారులకు ఆనందం అందించడం లక్ష్యంగా పెట్టుకుంది, అదే సమయంలో వారి అవసరాలకు అనుగుణంగా విద్యుత్ వినియోగంలో వారికి సహాయం చేస్తుంది, విద్యుత్ సామర్థ్యాన్ని సాధించడానికి వినియోగదారుల విద్యుత్ ప్రవర్తనను బాద్యతయుతంగా మార్చడం లో వారి బిల్లులను తగ్గించడం లో వినియోగదారులకు సాయం చేస్తుంది. విద్యుత్ మంత్రిత్వ శాఖకు తమ నివేదనను అందించిన తర్వాత ఈ యాప్ అన్ని డిస్ట్రిబ్యూషన్ యుటిలిటీలకు ఉచితంగా అందుబాటులో ఉంటుంది. నిర్దిష్ట విద్యుత్ రంగ సంస్థల ఉన్నత స్థాయి అవసరాలకు సానుకూలీకరణకు అనుగుణంగా యాప్ అనుకూలంగా ఉంటుంది. యాప్ నిర్వహణ మరియు యాజమాన్య బాధ్యత (O&M) కూడా 10 సంవత్సరాల పాటు డిస్కామ్‌లకు ఉచితం. మొబైల్ యాప్ పటిష్టమైన భద్రతతో రూపొందించబడింది మరియు వ్యక్తిగత డేటాను సంరక్షించడానికి తగినంత రక్షణవ్యవస్థ ఉంది.
ఈ చర్యలు, కార్యక్రమాలు సమర్థవంతమైన మరియు నిరంతరం కొనసాగే సుస్థిరమైన విద్యుత్ పంపిణీ రంగానికి మార్గం సుగమం చేస్తాయి.
***
(Release ID: 1849096)
Visitor Counter : 158