సాంస్కృతిక మంత్రిత్వ శాఖ

20 మంది గిరిజన స్వాతంత్ర్య సమరయోధుల కథలతో రూపొందించిన మూడవ కామిక్ పుస్తకాన్ని విడుదల చేసిన సాంస్కృతిక మంత్రిత్వ శాఖ

Posted On: 04 AUG 2022 2:38PM by PIB Hyderabad

20 మంది గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల కథలతో రూపొందించిన మూడవ కామిక్ పుస్తకాన్ని ఆగస్టు 2వ  తేదీన న్యూఢిల్లీలో జరిగిన  తిరంగా ఉత్సవ్ వేడుకల్లో  సాంస్కృతిక మంత్రిత్వ శాఖ విడుదల చేసింది.

ఆవిష్కరణ కార్యక్రమంలో కేంద్ర హోం వ్యవహారాలు మరియు సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా,  కేంద్ర  సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి, పార్లమెంటరీ వ్యవహారాలు,  సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి శ్రీ అర్జున్ రామ్ మేఘవాల్ మరియు విదేశాంగ శాఖ సహాయ మంత్రి శ్రీమతి మీనాక్షి లేఖి పాల్గొన్నారు. 

బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రాణాలు కూడా లెక్క చేయకుండా  పోరాటం జరిపి గిరిజనులను చైతన్యవంతులను చేసిన కొంతమంది ధైర్యవంతులైన పురుషులు మరియు మహిళలు చేసిన  త్యాగాలను గుర్తు చేసే విధంగా పుస్తకాన్ని రూపొందించారు. 

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ (AKM)లో భాగంగా సాంస్కృతిక మంత్రిత్వ శాఖ అమర్ చిత్ర కథ (ACK) సహకారంతో 75 మంది స్వాతంత్ర్య సమరయోధుల జీవితాలపై చిత్రాలతో కూడిన  పుస్తకాలను విడుదల చేసింది, స్వాతంత్ర్య పోరాటంలో అనేక త్యాగాలు చేసి అకుంఠిత దేశభక్తి ప్రదర్శించిన త్యాగధనులపై నేటి యువతకు అవగాహన కల్పించాలన్న లక్ష్యంతో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. స్వాతంత్ర్య సమరంలో పాల్గొని అంతగా గుర్తింపుకు నోచుకోని 20 మంది మహిళా స్వాతంత్య సమరయోధులపై మొదటి పుస్తకాన్ని సాంస్కృతిక మంత్రిత్వ శాఖ రూపొందించింది.  రాజ్యాంగ అసెంబ్లీకి ఎన్నికైన 15 మంది మహిళల జీవిత విశేషాలతో  రెండవ కామిక్ పుస్తకం  విడుదల చేయబడింది.

స్వాతంత్ర్య సమర యుద్ధంలో పాల్గొని అంతగా గుర్తింపుకు నోచుకోని 20 మంది గిరిజన స్వాతంత్య సమరయోధులపై మూడవ పుస్తకాన్ని సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ముద్రించింది. దీనిలో ఈ కింది స్వాతంత్ర్య సమరయోధుల జీవిత విశేషాలను పొందుపరిచారు. 


i. తిల్కా మాఝీ..  బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ దురాగతాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు . అతను తన పహాడియా తెగను  బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి  వ్యతిరేకంగా సమీకరించి మరియు కంపెనీ ఖజానాపై దాడి చేశారు. బ్రిటీషువారు తిల్కా మాఝీ ను   ఉరి తీశారు.

ii. తలక్కల్ చంతు ... కురిచియార్ తెగకు చెందిన తలక్కల్ చంతు ఈస్టిండియా ఒరాన్ తెగకు చెందిన బుధు భగత్ అతని సోదరుడు, ఏడుగురు కుమారులు మరియు అతని తెగకు చెందిన 150 మంది పురుషులతో సహా iii. బుధు భగత్  ...  ఒరాన్ తెగకు చెందిన బుధు భగత్ అతని సోదరుడు, ఏడుగురు కుమారులు మరియు అతని తెగకు చెందిన 150 మంది పురుషులతో సహా బ్రిటీష్ వారి జరిపిన  ఎన్‌కౌంటర్లలో ఒకదానిలో కాల్చివేయబడ్డాడు. 

iv .  తిరోత్ సింగ్ ... ఖాసీ ప్రముఖుడైన  తిరోత్ సింగ్ బ్రిటిష్ వారి ద్వంద్వ వైఖరిని గుర్తించి వారిపై తిరగబడి యుద్ధం చేశాడు. తిరోత్ సింగ్ ను బంధించిన బ్రిటీషువారు అతనిని హింసించి కారాగారంలో బంధించారు. కారాగారంలో  తిరోత్ సింగ్  మరణించారు.

v రఘోజీ భాంగ్రే ... మహదేవ్ కోలీ తెగకు చెందిన వ్యక్తి రఘోజీ భాంగ్రే . బ్రిటీష్ వారిపై తిరుగుబాటు చేసిన  రఘోజీ భాంగ్రే తన తల్లి జైలుకెళ్లినా తన  కొనసాగించాడు. బ్రిటిష్ వారు అతన్ని పట్టుకుని ఉరితీశారు.

vi . సిద్ధూ మరియు కన్హు ... సంతాల్ తెగకు చెందిన  చెందిన సిద్ధూ మరియు కన్హు ముర్ము బ్రిటిష్ వారు  మరియు వారి తొత్తులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. హుల్ తిరుగుబాటులో వారు సంతాల్‌కు నాయకత్వం వహించారు. ఇద్దరినీ మోసం చేసి బంధించి బ్రిటిష్ వారు  ఉరి తీశారు.

 vii .రెండూ  మాంఝీ మరియు చక్ర బిసోయ్.,..  ఖోండ్ తెగకు చెందిన రెండో మాంఝీ మరియు చక్ర బిసోయ్ బ్రిటిష్ వారు తమ  ఆచార వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడాన్ని వ్యతిరేకించారు..రెండూ  మాంఝీ ని పట్టుకున్న ఉరి తీశారు. తప్పించుకొని పారిపోయిన  అజ్ఞాతంలోకి  వెళ్లిన  చక్ర బిసోయ్  ఆ తర్వాత చనిపోయారు. 

viii . మీరట్‌లో భారతీయ తిరుగుబాటు ప్రారంభమైంది. తిరుగుబాటుతో స్ఫూర్తి పొందిన ఖార్వార్ తెగకు చెందిన భోగ్తా వంశానికి చెందిన నీలాంబర్ మరియు పితాంబర్ తమ జాతి వారిని సమీకరించి బ్రిటిష్ అణచివేతకు వ్యతిరేకంగా పనిచేశారు. వారిద్దరినీ పట్టుకుని ఉరితీశారు.


ix . గోండు తెగకు చెందిన రామ్‌జీ గోండ్ భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడారు. బ్రిటీష్ వారి సహకారంతో  సంపన్న భూస్వాములు పేదలను అణచివేసే విధానాన్ని వ్యతిరేకించారు. అతన్ని పట్టుకుని ఉరి తీశారు,

x.   బ్రిటిష్ వారి పన్ను విధానాన్ని మరియు వారి పాలనను అంగీకరించడానికి  ఖరియా తెగకు చెందిన తెలంగా ఖరియా నిరాకరించారు. తమ సంప్రదాయ స్వయం పాలన విధానాన్ని అనుసరించాలని డిమాండ్ చేసిన తెలంగా ఖరియా ఖజానాపై దాడులు నిర్వహించారు. అతన్ని మోసం చేసి పట్టుకున్న అధికారులు కాల్చి చంపారు.

xi . సెంట్రల్ ప్రావిన్స్‌ల రాబిన్ హుడ్‌గా  తాంతియా భిల్ గుర్తింపు పొందరు.  బ్రిటీష్ సంపదను తీసుకుని వెళ్తున్న  రైళ్లను దోచుకుని తన తెగ, భిల్‌లకు పంచాడు. వలపన్ని తాంతియా భిల్ ను పట్టుకున్న బ్రిటిష్ వారు అతనిని  ఉరి తీశారు. 

.xii .  మణిపూర్ రాజ్యాన్ని రక్షించడానికి మేజర్ పవోనా బ్రజబాసి పోరాడాడు.  ఆంగ్లో-మణిపూర్ యుద్ధంలో మేజర్ పవోనా బ్రజబాసి చెలరేగి యుద్ధం చేశారు. సింహంలా పోరాడిన మేజర్ పవోనా బ్రజబాసిపై పైచెయ్యి సాధించిన బ్రిటిష్ వారు అతని తల నరికి చంపేశారు. 

xiii . ముండా తెగకు చెందిన బిర్సా ముండా బ్రిటిష్ వారి పట్ల సింహస్వప్నంలా మారారు. బ్రిటిష్ వారితో జరిగిన అనేక యుద్దాలలో  ముండాలకు నాయకత్వం  నాయకత్వం వహించాడు. బిర్సా ముండాను పట్టుకున్న బ్రిటిష్ వారు అతనిని కారాగారంలో బంధించారు. బ్రిటిష్ రికార్డుల ప్రకారం బిర్సా ముండా కలరాతో  కలరాతో మరణించాడు.  చనిపోయే నాటికి అతని వయస్సు 25 సంవత్సరాలు.

xiv . అరుణాచల్ ప్రదేశ్‌లోని ఆది తెగకు చెందిన మత్మూర్ జమోహ్ బ్రిటిష్ వారి దురహంకారానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. వారి గ్రామాలను బ్రిటిష్ వారు తగలబెట్టడంతో  తన అనుచరులతో కలిసి  మరియు  బ్రిటిష్ వారికి మత్మూర్ జమోహ్ లొంగిపోయారు. వారిని సెల్యులార్ జైలుకు తరలించారు. ఆయన  అక్కడే చనిపోయారు.

xv. దైవిక దృష్టితో ప్రేరణ పొందిన  ఒరాన్ తెగకు చెందిన తానా భగత్ బ్రిటిష్ వారి దురాగతాలు, దోపిడీపై  తన ప్రజలకు  అవగాహన కల్పించడానికి కృషి చేశారు. బ్రిటిష్ వారు అతన్ని పట్టుకుని తీవ్రంగా హింసించారు. విడుదల అయిన తర్వాత  తానా భగత్ గాయాలతో మరణించారు. 

xvi . తేయాకు జాతికి చెందిన   మాలతి మేమ్ మహాత్మా గాంధీ సత్యాగ్రహ ఉద్యమంలో చేరడానికి ప్రేరణ పొందారు. ఆమె నల్లమందు పై  బ్రిటిష్ గుత్తాధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడారు.  నల్లమందు వ్యసనం వల్ల కలిగే  ప్రమాదాల గురించి  ప్రజలకు అవగాహన కల్పించారు.  పోలీసులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆమె ప్రాణాలు కోల్పోయారు. 
xvii . భుయాన్ తెగకు చెందిన లక్ష్మణ్ నాయక్ కూడా గాంధీ నుంచి  స్ఫూర్తి పొంది, స్వాతంత్య్ర ఉద్యమంలో గిరిజనులు చేరేలా విస్తృతంగా ప్రచారం చేశారు.  స్నేహితుడిని హత్య చేశాడన్న ఆరోపణతో బ్రిటిష్ వారు  అతనిని ఉరితీశారు.

xviii  లెప్చా తెగకు చెందిన హెలెన్ లెప్చా మహాత్మా గాంధీకి అత్యంత అనుచరురాలు.  ప్రజలపై ఆమె చూపించిన  ప్రభావం బ్రిటీష్ వారిని అశాంతికి గురి చేసింది. ఆమెపై కాల్పులు జరిపిన అధికారులు అరెస్ట్ చేసి జైలుకు పంపి వేధించారు.కానీ ఆమె ఎప్పుడూ ధైర్యం కోల్పోలేదు. 1941లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ గృహనిర్బంధం నుంచి తప్పించుకుని జర్మనీ వెళ్లేందుకు ఆమె సహాయం చేసింది. స్వాతంత్య్ర పోరాటంలో ఆమె చేసిన అమూల్యమైన కృషికి గాను ఆమెకు తామ్ర పత్రం లభించింది.
xviiii. పాఠశాలలో చదువుతున్న సమయంలో పులిమయా దేవి పోదర్ గాంధీజీ ప్రసంగాలు విని  స్వాతంత్ర్య పోరాటంలో చేరాలని అనుకున్నారు. కుటుంబ సభ్యుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైనప్పటికీ  చదువు ముగిసిన తర్వాత ఉద్యమంలో చేరారు.  తనతో పాటు ఉద్యమంలో చేరేలా  మహిళలను ప్రోత్సహించింది. నిరసనల్లో పాల్గొన్నందుకు ఆమె జైలు పాలైంది. స్వాతంత్ర్యం తరువాత ఆమె తన ప్రజలకు సేవ చేయడం కొనసాగించింది మరియు 'స్వతంత్ర సేనాని' బిరుదును పొందారు. 

***



(Release ID: 1848765) Visitor Counter : 935