పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
వాతావరణ మార్పుపై ఐక్యరాజ్యసమితి ఫ్రేమ్‌వర్క్ కన్వెన్షన్‌కు తెలియజేయడానికి భారతదేశం యొక్క నవీకరించబడిన జాతీయంగా నిర్ణయించబడిన సహకారాన్ని మంత్రివర్గం ఆమోదించింది , COP 26లో ప్రకటించిన
ప్రధాన మంత్రి 'పంచామృతం'ను మెరుగైన వాతావరణ లక్ష్యాలుగా అనువదించింది
వాతావరణ మార్పులపై ఆమోదించిన జాతీయ విధానాన్ని ఐక్యరాజ్యసమితికి నివేదించేందుకు ఆమోదం తెలిపిన కేంద్ర మంత్రివర్గం
కాప్ 26 సమావేశంలో ప్రధానమంత్రి ప్రతిపాదించిన 'పంచామృతం' ప్రణాళిక కార్యరూపం దాల్చేందుకు వీలు కల్పించనున్న నిర్ణయం
2070 నాటికి ఉద్గారాలను పూర్తిగా నిర్మూలించాలన్న లక్ష్య సాధన దిశలో పెద్ద ముందడుగు
2030 నాటికి ఉద్గారాల తీవ్రత తన జీడీపీలో 45% తగ్గించాలన్న లక్ష్యానికి భారతదేశం కట్టుబడి ఉంది
పర్యావరణ పరిరక్షణలో కీలకం కానున్న ప్రధానమంత్రి ప్రతిపాదించిన "లైఫ్" ( పర్యావరణం కోసం జీవన శైలి) విధానం
Posted On:
03 AUG 2022 2:34PM by PIB Hyderabad
వాతావరణ మార్పులపై భారతదేశం అందించే సహకారంపై జాతీయ స్థాయిలో చర్చించి ఆమోదించిన తీర్మానాన్ని (ఎన్ డిసి ) వాతావరణ మార్పులపై ఏర్పాటైన ఐక్యరాజ్యసమితి ఫ్రేమ్‌వర్క్ కన్వెన్షన్ ( యూఎన్ ఎస్ సీసీసీ ) కి నివేదించే ప్రతిపాదనకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది.
పారిస్ ఒప్పందం ప్రకారం అంగీకరించిన విధంగా వాతావరణంలో వస్తున్న మార్పులను ఎదుర్కొనేందుకు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ప్రయత్నాలకు భారతదేశం తన వంతు సహకారాన్ని అందించేందుకు ఎన్ డిసి అవకాశం కలిగిస్తుంది. ఈ చర్యల వల్ల కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు భారతదేశం అమలు చేస్తున్న కార్యక్రమాలు మరింత పటిష్టంగా అమలు జరుగుతాయి. యూఎన్ ఎస్ సీసీసీ నిర్దేశించిన మార్గదర్శకాలు,
నిబంధనలకు లోబడి భారతదేశం తన ప్రయోజనాలను పరిరక్షించుకుని భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ప్రణాళిక రూపొందించి కునేందుకు వీలవుతుంది.
పర్యావరణ పరిరక్షణ కోసం యునైటెడ్ కింగ్‌డమ్‌లోని గ్లాస్గోలో జరిగిన యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్‌వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ (UNFCCC) 26 వ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ (కాప్ 26)లో భారతదేశం, ప్రపంచానికి ఐదు అమృత మూలకాలను (పంచామృతం) ప్రతిపాదించింది. పర్యావరణ పరిరక్షణ చర్యలను వేగవంతం చేయాలని కోరింది. కాప్ 26 లో ప్రతిపాదించిన ' పంచామృతం' విధానానికి ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేసి నూతన నవీన విధానాన్ని భారతదేశం సిద్ధం చేసింది. నూతన 'పంచామృతం' కార్యరూపం సల్చేందుకు అవకాశం కల్గిస్తుంది. దీని ద్వారా భారతదేశం తానూ నిర్దేశించుకున్న పర్యావరణ లక్ష్యాలను సాధించగలుగుతుంది. కర్బన ఉద్గారాలను 2070 నాటికి నికర-సున్నా స్థాయికి తగ్గించాలన్న భారతదేశ దీర్ఘకాలిక లక్ష్యాన్ని సాధించే దిశగా ఈ నవీకరణ కూడా ఒక అడుగుగా ఉంటుంది.
2015 అక్టోబర్ రెండున వాతావరణ మార్పులపై రూపొందించిన ప్రతిపాదనలను యూఎన్ ఎస్ సీసీసీ సమావేశంలో భారతదేశం ప్రవేశపెట్టింది. 2015 తీర్మానంలో ఎనిమిది లక్ష్యాలను చేర్చడం జరిగింది. 2030 నాటికి ఈ లక్ష్యాలను చేరుకోవాలని ప్రతిపాదించారు. మొత్తం విద్యుత్ అవసరాల్లో 40% అవసరాలను శిలాజ రహిత మూలాల నుంచి ఉత్పత్తి చేయడం, 2005 స్థాయిలతో పోలిస్తే జీడీపీ లో ఉద్గారాల తీవ్రతను 33 నుంచి 35 శాతానికి తగ్గించడం, అడవులు, చెట్లను ఎక్కువగా పెంచడం ద్వారా 2.5 నుండి 3 బిలియన్ టన్నుల బొగ్గు పులుసు వాయువు (CO2)కి సమానమైన అదనపు కార్బన్ సింక్‌ను సృష్టించడం లక్ష్యాలుగా నిర్దేశించడం జరిగింది.
సవరించి నవీకరించిన ప్రతిపాదన ప్రకారం భారతదేశం తన జీడీపీ లో ఉద్గారాల తీవ్రతను 2005 స్థాయి నుండి 2030 నాటికి 45 శాతానికి తగ్గించడానికి కట్టుబడి ఉంది. 2030 నాటికి శిలాజ ఇంధనం ఆధారిత ఇంధన వనరుల నుండి 50 శాతం సంచిత విద్యుత్ శక్తి స్థాపిత సామర్థ్యాన్ని సాధించాలని నిర్ణయించింది. వాతావరణ మార్పుల ప్రభావం వల్ల కలుగుతున్న నష్టాల నుంచి పేద, బలహీన వర్గాలను రక్షించి వారికి సుస్థిరమైన జీవన విధానాలను అందించాలన్న ప్రధానమంత్రి ఆకాంక్ష కార్యరూపం దాల్చేందుకు మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం సహకరిస్తుంది. వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో కీలక పాత్ర పోషించే 'లైఫ్'- 'లైఫ్‌స్టైల్ ఫర్ ఎన్విరాన్‌మెంట్' అమలు కోసం ప్రజా ఉద్యమం ప్రారంభించి సంప్రదాయాలు మరియు పరిరక్షణ మరియు నియంత్రణ విలువల ఆధారంగా ఆరోగ్యకరమైన మరియు స్థిరమైన జీవన విధానాన్ని రూపొందించేందుకు ప్రభుత్వ నిర్ణయం దోహదపడుతుంది. గ్రీన్ హౌస్ వాయువుల ప్రభావం లేని ఆర్థిక అభివృద్ధి సాధించాలన్న భారతదేశ లక్ష్యాన్ని ఈ తీర్మానం మరోసారి స్పష్టం చేస్తుంది.
విభిన్నమైన బాధ్యతలు మరియు సంబంధిత సామర్థ్యాల (CBDR-RC) సూత్రం ఆధారంగా జాతీయ పరిస్థితులను అధ్యయనం చేసిన అనంతరం ప్రతిపాదనలో మార్పు చేయడం జరిగింది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడంతో పటు కర్బన ఉద్గారాలను తగ్గించాలన్న లక్ష్యానికి భారతదేశం కట్టుబడి ఉంది.
వాతావరణ మార్పుల అంశంలో జీవన శైలి కీలకంగా ఉంటుంది. దీనిని గుర్తించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కాప్ 26 ఒక పదంతో కూడిన విధానాన్ని ప్రతిపాదించారు.పర్యావరణహిత జీవనశైలి ని శ్రీ మోదీ లైఫ్ (LIFE) గా వర్ణించారు. పర్యావరణానికి ఎటువంటి హాని కలిగించకుండా జీవించడమే పర్యావరణహిత జీవనశైలి విధానంగా ఉంటుంది. ప్రజా సంక్షేమం ధ్యేయంగా వాతావరణ మార్పులను ఎదుర్కునే వ్యూహాలను సిద్ధం చేయడానికి భారతదేశం ప్రతిపాదించిన నూతన విధానం సహకరిస్తుంది.
2021-30 మధ్య కాలంలో పరిశుద్ధ ఇంధన వనరుల వినియోగానికి భారతదేశం అమలు చేస్తున్న చర్యలను కూడా ప్రతిపాదనలో పొందుపరిచారు. పర్యావరణ పరిరక్షణ కోసం అందిస్తున్న పన్ను రాయితీలు, పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగానికి అందిస్తున్న ప్రోత్సాహకాలు, ఉత్పాదకత తో ముడి పడిన ప్రోత్సాహకాలు తదితర అంశాలను ప్రస్తావించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న చర్యల వల్ల ఉత్పత్తి పెరిగి, ఎగుమతులు ఎక్కువ అవుతాయి. పునరుత్పాదక ఇంధన వనరులు వినియోగించే పరిశ్రమలు, విద్యుత్ వాహనాల తయారీ,గ్రీన్ హైడ్రోజన్ లాంటి రంగాలలో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి . సవరించిన పర్యావరణ పరిరక్షణ ప్రణాళిక 2021-2030 మధ్య కాలంలో రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల సహకారంతో సంబంధిత మంత్రిత్వ శాఖలు/విభాగాలు అమలు చేసే కార్యక్రమాలు, పథకాల ద్వారా అమలు జరుగుతాయి.
నూతన విధానాల అమలుకు సంబంధించి ఇప్పటికే చర్యలు ప్రారంభించిన ప్రభుత్వం వీటివల్ల ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి ప్రణాళిక రూపొందించింది. నీరు, వ్యవసాయం, అటవీ, శక్తి మరియు సంస్థ, స్థిరమైన చలనశీలత మరియు గృహ నిర్మాణ, వ్యర్థాల నిర్వహణ, వృత్తాకార ఆర్థిక వ్యవస్థ మరియు వనరుల సామర్థ్యం మొదలైన అనేక రంగాలలో ఈ పథకాలు అమలు జరుగుతాయి. గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాల ప్రభావం లేని ఆర్థిక వృద్ధిని సాధించడం లక్ష్యంగా భారతదేశం కార్యక్రమాలు,పథకాలను అమలు చేస్తుంది. 2030 నాటికి ఉద్గారాలను పూర్తిగా తగ్గించడానికి అమలు జరుగుతున్న చర్యల్లో భారతీయ రైల్వే కీలక పాత్ర పోషిస్తుంది. నికర జీరో లక్ష్యం ఏటా 60 మిలియన్ టన్నుల ఉద్గారాలను తగ్గించడానికి భారతీయ రైల్వే ప్రణాళిక రూపొందించి అమలు చేస్తోంది. అదేవిధంగాఎల్ఈడీ బల్బుల వినియోగం వల్ల ఏటా 40 మిలియన్ టన్నుల ఉద్గారాల విడుదల తగ్గుతుంది.
భారతదేశం అమలు చేస్తున్న వాతావరణ చర్యలకు అవసరమైన నిధులను ఇప్పటివరకు దేశీయ వనరుల నుండి ఎక్కువగా సమకూర్చబడ్డాయి. అయితే, పారిస్ ఒప్పందం ప్రకారం వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు అమలు చేసే పథకాలు, కార్యక్రమాల అమలు,సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేయడం లాంటి అంశాలకు అవసరమయ్యే నిధులను అభివృద్ధి చెందిన దేశాలు అందించవలసి ఉంటుంది. అంతర్జాతీయ ఆర్థిక వనరులు మరియు సాంకేతిక సహకారం నుంచి తగిన వాటా పొందే హక్కును భారతదేశం కలిగి ఉంటుంది.
భారతదేశం రూపొందించిన నూతన విధానం ఏ రంగానికి సంబంధించిన నిర్దిష్ట ఉపశమన బాధ్యత లేదా చర్యకు కట్టుబడి ఉండదు. మొత్తం ఉద్గార తీవ్రతను తగ్గించడం మరియు కాలక్రమేణా ఆర్థిక వ్యవస్థ శక్తి సామర్థ్యాన్ని మెరుగుపరచడం అదే సమయంలో సమాజంలోని బలహీన బడుగు వర్గాల సంక్షేమానికి భారతదేశం కృషి చేస్తుంది.
***
(Release ID: 1848019)
Visitor Counter : 654