ప్రధాన మంత్రి కార్యాలయం
బర్మింగ్ హమ్ కామన్ వెల్థ్ గేమ్స్ లో వెండి పతకాన్ని గెలుచుకొన్నందుకు బాడ్మింటన్ జట్టు ను అభినందించిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
03 AUG 2022 9:11AM by PIB Hyderabad
బర్మింగ్ హమ్ కామన్ వెల్థ్ గేమ్స్ (సిడబ్ల్యుజి) 2022 లో రజత పతకాన్ని గెలుచుకొన్నందుకు బాడ్ మింటన్ జట్టు కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.
ప్రధాన మంత్రి అనేక ట్వీట్ లలో -
‘‘బర్మింగ్ హమ్ కామన్ వెల్థ్ గేమ్స్ (సిడబ్ల్యుజి) లో రజత పతకాన్ని గెలుచుకొన్నందుకు గాను @srikidambi, @satwiksairaj, @buss_reddy, @lakshya_sen, @Shettychirag04, తృషా జాలీ, ఆకర్షి కశ్యప్, @P9Ashwini, గాయత్రి గోపీచంద్ మరియు @Pvsindhu1 గారు లతో కూడిన భారతదేశం బాడ్ మింటన్ జట్టు కు ఇవే అభినందన లు. వారి సాఫల్యం పట్ల గర్వం గా ఉంది.’’
‘‘భారతదేశం లో అత్యధిక అభిమానపాత్రం అయినటువంటి క్రీడల లో బాడ్ మింటన్ ఒకటిగా ఉంది. కామన్ వెల్థ్ గేమ్స్ లో రజత పతకాన్ని గెలుచుకోవడం ఈ ఆట కు మరింత ప్రజాదరణ లభించేటట్టు చేయడం తో పాటు రాబోయే కాలం లో మరింత ఎక్కువ మంది ఈ క్రీడ ను ఎంపిక చేసుకోవడం లో కూడా తోడ్పడుతుంది.’’ అని పేర్కొన్నారు.
***
DS/SH
(रिलीज़ आईडी: 1847761)
आगंतुक पटल : 152
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam