ప్రధాన మంత్రి కార్యాలయం
కామన్ వెల్థ్ గేమ్స్ 2022 లో వెండి పతకాన్ని గెలుచుకొన్నందుకు వెయిట్లిఫ్టర్ శ్రీ వికాస్ ఠాకుర్ కు అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
02 AUG 2022 10:17PM by PIB Hyderabad
బర్మింగ్ హమ్ లో జరుగుతున్న కామన్ వెల్థ్ గేమ్స్ (సిడబ్ల్యుజి) 2022 లో రజత పతకాన్ని గెలుచుకొన్నందుకు వెయిట్ లిఫ్టర్ శ్రీ వికాస్ ఠాకుర్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘కామన్ వెల్థ్ గేమ్స్ (సిడబ్ల్యుజి) లో మరింత కీర్తి లభించింది, ఈ సారి వెయిట్ లిఫ్టింగ్ లో రజత పతకాన్ని గెలుచుకొని శ్రీ వికాస్ ఠాకుర్ ఈ యశస్సు ను సంపాదించి పెట్టారు. ఆయన సాఫల్యాన్ని చూసి, ఎంతో ఆనందం కలుగుతున్నది. క్రీడలంటే ఆయన కు ఉన్నటువంటి సమర్పణ భావం ప్రశంసనీయం. రాబోయే ప్రయత్నాల లోనూ ఆయన రాణించాలని ఆకాంక్షిస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.
***
DS/ST
(रिलीज़ आईडी: 1847760)
आगंतुक पटल : 155
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Bengali
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam