వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

దేశంలో 75,000 దాటిన గుర్తింపు పొందిన స్టార్టప్‌ల సంఖ్య


ఆవిష్కరణలు, అభివృద్ధి సాధించేందుకు దేశంలో ఉన్న శక్తి సామర్ధ్యాలకు స్టార్టప్‌ల సంఖ్య నిదర్శనం.. శ్రీ పీయూష్ గోయల్

156 రోజుల్లో 10000 స్టార్టప్‌ల ఏర్పాటు దేశంలో తొలి 10000 స్టార్టప్‌ల ఏర్పాటుకు 808 రోజులు పట్టింది

7.46 ఉపాధి అవకాశాలు కల్పించిన స్టార్టప్‌ల రంగం
తరగతిII, తరగతి III నగరాల్లో పనిచేస్తున్న 49% స్టార్టప్‌లు

Posted On: 03 AUG 2022 9:41AM by PIB Hyderabad

అంకుర సంస్థల (స్టార్టప్‌లు) రంగంలో దేశంలో అరుదైన మైలురాయిని చేరుకుందని కేంద్ర వాణిజ్యం, పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు, ప్రజా పంపిణీ, జౌళి శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ ఈ రోజు ప్రకటించారు. దేశంలో 75,000లకు పైగా గుర్తింపు పొందిన అంకుర సంస్థలు (స్టార్టప్‌లు) పనిచేస్తున్నాయని శ్రీ గోయల్ వెల్లడించారు. ఆవిష్కరణలు, అభివృద్ధి సాధించేందుకు దేశంలో ఉన్న శక్తి సామర్ధ్యాలకు  స్టార్టప్‌ల సంఖ్య నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు.అభివృద్ధి సాధన దిశలో సాగుతున్న ప్రయత్నాలకు అంకుర రంగం సహకరిస్తుందని శ్రీ గోయల్ అన్నారు.   పరిశ్రమల ప్రోత్సాహకఅంతర్గత వాణిజ్య మంత్రిత్వ శాఖ (డీపీఐఐటీ) గుర్తింపు లభించింది. దేశానికి స్వాతంత్ర్యం సిద్దించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ వేడుకల నేపథ్యంలో దేశంలో అంకుర సంస్థల రంగం నూతన చరిత్ర సృష్టించింది. ఆవిష్కరణలుఉత్సాహం మరియు వ్యవస్థాపక స్ఫూర్తికి  అంకుర సంస్థల రంగం నిదర్శనంగా నిలిచింది.

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 2015 ఆగస్టు 15న ఢిల్లీ ఎర్రకోట నుంచి ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ యువతలో నిగూఢంగా ఉన్న వ్యవస్థాపక శక్తిని వెలికి తీసి నవ భారత నిర్మాణం జరగాలని పిలుపు ఇచ్చారు. దీనిని స్ఫూర్తిగా తీసుకుని దేశంలో అంకుర సంస్థల రంగాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి దోహదపడే కార్యాచరణ ప్రణాళిక సిద్ధం అయ్యింది. దేశంలో ఆవిష్కరణలను ప్రోత్సహించి, అంకుర సంస్థల రంగ అభివృద్ధికి అవసరమైన పరిస్థితిని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కార్యాచరణ ప్రణాళిక రూపొందింది. 2016 జనవరి 16న ఈ ప్రణాళికను ప్రభుత్వం ప్రకటించింది. ప్రతి ఏడాది జనవరి 16ని అంకుర సంస్థల దినోత్సవంగా పాటించడం జరుగుతోంది. గత ఆరు సంవత్సరాలుగా విజయవంతంగా అమలు జరుగుతున్న కార్యాచరణ ప్రణాళిక దేశ అంకుర సంస్థల రంగం రూపురేఖలను పూర్తిగా మార్చేసింది. ప్రపంచంలో పెద్ద సంఖ్యలో అంకుర సంస్థలను కలిగి ఉన్న మూడో దేశంగా భారతదేశం అవతరించింది. దేశంలో తొలి 10వేల అంకుర సంస్థలు నమోదై గుర్తింపు పొందేందుకు 808 రోజులు పట్టింది. ప్రభుత్వ ప్రోత్సాహంతో అంకుర సంస్థల అభివృద్ధి వేగం పుంజుకుంది. తాజాగా కేవలం 156 రోజుల వ్యవధిలో 10వేల అంకుర సంస్థలు నమోదయి గుర్తింపు పొందడం గమనార్హం. దేశంలో సరాసరిన రోజుకు 80 కి పైగా అంకుర సంస్థలు నమోదు అవుతున్నాయి. ఇది పెద్ద సంఖ్యలో ప్రపంచంలో మరే దేశంలోను పెద్ద సంఖ్యలో అంకుర సంస్థలు నమోదు కావడం లేదు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం, సహాయ సహకారాలతో దేశంలో అంకుర సంస్థలకు ఉజ్వల భవిష్యత్తు ఎదురుచూస్తోంది. 

దేశంలో నమోదై గుర్తింపు పొందిన అంకుర సంస్థల్లో 12% సంస్థలు ఐటీ సేవల రంగంలో ఉన్నాయి . 9% సంస్థలు ఆరోగ్య రక్షణ, జీవన శాస్త్ర రంగంలో,7% సంస్థలు విద్యా రంగం,5% సంస్థలు వృత్తిపరమైన, వాణిజ్య  సేవలు,5% సంస్థలు వ్యవసాయ రంగంలో సేవలు అందిస్తున్నాయి. దేశ అంకుర సంస్థల రంగం 746 లక్షల వరకు ఉపాధి కల్పించాయి. గత ఆరు సంవత్సరాలుగా అంకుర సంస్థల రంగం 110% వార్షిక వృద్ధి నమోదు చేసింది. 40% అంకుర సంస్థలు తరగతి II ,తరగతి III గా గుర్తింపు పొందిన నగరాల్లో ఏర్పాటు కావడం విశేషం. దేశ యువత అపారమైన సామర్థ్యం కలిగి ఉందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం

***(Release ID: 1847750) Visitor Counter : 171