హోం మంత్రిత్వ శాఖ

త్రివర్ణ పతాకాన్ని సామాజిక మాధ్యమ ఖాతాల సంకేత చిత్రంగా మార్చాలని పౌరులకు కేంద్ర దేశీయాంగ - సహకారశాఖల మంత్రి అమిత్‌ షా సూచన


స్వాతంత్ర్య అమృత మహోత్సవాలు చేసుకోవాలన్న ప్రధాని పిలుపు మేరకు త్రివర్ణ
పతాకాన్ని తన సామాజిక మాధ్యమ ఖాతాల సంకేత చిత్రంగా మార్చుకున్న అమిత్‌ షా;

జాతీయ పతాకంపై గౌరవాభిమానాలు ప్రదర్శించే దిశగా త్రివర్ణ పతాకాన్ని సామాజిక
మాధ్యమ ఖాతాల సంకేత చిత్రంగా పెట్టుకోవాలని ప్రజలకు మంత్రిత్వ శాఖ విజ్ఞాపన

Posted On: 02 AUG 2022 1:25PM by PIB Hyderabad

   దేశ ప్రజలందరూ త్రివర్ణ పతాకాన్ని తమ సామాజిక మాధ్యమ ఖాతాల సంకేతచిత్రంగా ఏర్పాటు చేసుకోవాలని కేంద్రం దేశీయాంగ-సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్‌ షా విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ట్విట్టర్‌ ద్వారా పంపిన వరుస సందేశాల్లో- “స్వాతంత్ర్య అమృత మహోత్సవాలు నిర్వహించుకోవాలన్న ప్రధాని నరేంద్ర మోదీగారి పిలుపు మేరకు నా సామాజిక మాధ్యమ ఖాతాల సంకేత చిత్రంగా త్రివర్ణ పతాకాన్ని అమర్చుకున్నాను” అని పేర్కొన్నారు.

   అలాగే “జాతీయ పతాకంపై మీ గౌరవాభిమానాలను ప్రదర్శించడంలో భాగంగా మీ సామాజిక మాధ్యమ ఖాతాల సంకేత చిత్రంగా త్రివర్ణ పతాకాన్ని ఏర్పాటు చేసుకోవాలని పౌరులందరినీ కోరుతున్నాను.” అని ఆయన సూచించారు.

 

***(Release ID: 1847609) Visitor Counter : 152