కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

ప్రధానమంత్రి టెలికాం సంస్కరణలపై పరిశ్రమ నుండి గొప్ప స్పందన : 5జి స్పెక్ట్రమ్ వేలం రూ. 1,50 173 కోట్లు

Posted On: 02 AUG 2022 12:05PM by PIB Hyderabad

ప్రతిష్టాత్మకమైన 5జి వేలం లో వివిధ టెలికాం సంస్థల నుండి గొప్ప స్పందన వచ్చింది. కేంద్ర ప్రభుత్వం 72,098 మెగాహెట్జ్ స్పెక్ట్రమ్ వేలంకి వెళ్లగా 51,236 మెగా హెట్జ్ (మొత్తంలో 71 శాతం) విక్రయమయ్యాయి.. వీటికి రూ.1,50,173 కోట్ల రూపాయల బిడ్లు దాఖలయ్యాయి. 

ఎంఎం వేవ్ బ్యాండ్ (26 గిగా హెట్జ్)లో అదానీ డేటా నెట్వర్క్స్ లిమిటెడ్ 400 మెగా హెట్జ్ పొందింది. భారతీ ఎయిర్టెల్ లిమిటెడ్ 900, 1800,2100,3300 మెగాహెట్జ్, 25 గిగాహెట్జ్ బ్యాండ్ ను కైవసం చేసుకుంది. రిలియన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ 700, 800, 1800, 3300 మెగాహెట్జ్, 26 గిగాహెట్జ్ బ్యాండ్ లో 24,740 మెగాహెట్జ్ స్పెక్ట్రమ్ కొనుగోలు చేసింది. వోడాఫోన్ ఐడియా లిమిటెడ్ 1800, 2100, 2500, 3300మెగాహెట్జ్ లు, 26 గిగాహెట్జ్ల లో 6,228 మెగాహెట్జ్ స్పెక్ట్రమ్‌లను పొందింది. 

రూ. 1,50,173 కోట్ల బిడ్ మొత్తం వేలంలో అదానీ డేటా నెట్‌వర్క్స్ ద్వారా  రూ.212 కోట్లు, భారతి ఎయిర్‌టెల్ లిమిటెడ్ రూ. 43,048 కోట్లు, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ద్వారా రూ.88,078 కోట్లు, వోడాఫోన్ ఐడియా లిమిటెడ్ ద్వారా రూ.18,799 కోట్లు స్పెక్ట్రమ్ విక్రయం జరిగింది. పాల్గొనే వారందరూ చెల్లించాల్సిన వార్షిక వాయిదా రూ. 13,365 కోట్లు. 

వార్షిక వాయిదాల కంప్యూటింగ్‌లో వడ్డీ రేటు 7.2% గా ఉంటుంది. కొందరు  మరింత ముందస్తు చెల్లింపు చేయవచ్చు.

600మెగాహెట్జ్ బ్యాండ్‌ను మొదటిసారి వేలానికి ఉంచారు. ఈ బ్యాండ్‌కు బిడ్‌లు రాలేదు. 600 మెగాహెట్జ్   బ్యాండ్ ఇంకా పరికరాల పర్యావరణ వ్యవస్థకు తగ్గట్టుగా ఇప్పటికీ మొబైల్ టెలిఫోనీ కోసం అభివృద్ధిజరగలేదు. అయితే మరి కొన్ని సంవత్సరాలలో, ఈ బ్యాండ్ ముఖ్యమైనది కావచ్చు.

700 మెగాహెట్జ్ లో, 5జి పర్యావరణ వ్యవస్థ బాగా అభివృద్ధి జరిగింది. ఇది పెద్ద సెల్ పరిమాణాన్ని కలిగి ఉంది, మౌలిక సదుపాయాల అవసరం తక్కువగా ఉంటుంది. ఈ బ్యాండ్ విస్తృత పరిధిని, మంచి కవరేజీని అందిస్తుంది. రిలయన్స్ జియో దేశం మొత్తం 10  మెగాహెట్జ్   స్పెక్ట్రమ్‌ను పొందింది.

800 నుండి 2500 మధ్య బ్యాండ్‌ల కోసం, పాల్గొనేవారు ప్రాథమికంగా సామర్థ్యాన్ని పెంపొందించడానికి, 4జి కవరేజీని మెరుగుపరచడానికి స్పెక్ట్రమ్ కోసం బిడ్‌లు వేశారు. అధిక నిర్గమాంశను అందించడంలో మిడ్ బ్యాండ్ అంటే 3300 మెగాహెట్జ్   బ్యాండ్ కీలకం. ఇప్పటికే ఉన్న ముగ్గురు ఆపరేటర్లు ఈ బ్యాండ్‌లో స్పెక్ట్రమ్‌ను పొందారు. ఆపరేటర్లు ఇప్పటికే ఉన్న 4జి సామర్థ్యాన్ని పెంచి, 3300 మెగాహెట్జ్  బ్యాండ్‌లో 5జి సేవలను అందించే అవకాశం ఉంది.

ఎంఎం వేవ్ బ్యాండ్‌లో అంటే 26 గిగా హెట్జ్ అధిక నిర్గమాంశను కలిగి ఉంటుంది కానీ చాలా తక్కువ పరిధిని కలిగి ఉంటుంది. బ్యాండ్ క్యాప్టివ్ లేదా నాన్ పబ్లిక్ నెట్‌వర్క్ కోసం ఉపయోగించే అవకాశం ఉంది. ఫిక్స్‌డ్ వైర్‌లెస్ యాక్సెస్ (ఎఫ్డబ్ల్యూఏ) ప్రపంచవ్యాప్తంగా ఈ బ్యాండ్‌లో ప్రజాదరణ పొందుతోంది. అధిక సాంద్రత/ రద్దీగా ఉండే పట్టణ ప్రాంతాల్లో ఫైబర్‌కు ప్రత్యామ్నాయంగా ఎఫ్డబ్ల్యూఏని ఉపయోగించవచ్చు. వేలంలో పాల్గొన్న నాలుగు సంస్థలు ఈ బ్యాండ్‌లో స్పెక్ట్రమ్‌ని పొందారు.

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ  అయిన మెటల్ స్క్రాప్ ట్రేడింగ్ కార్పొరేషన్ (ఎంఎస్టిఎస్) వేలం వేసింది.

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన సంస్కరణలు, స్పష్టమైన విధానపరమైన దిశలో స్పెక్ట్రమ్ వేలం విజయవంతమైంది. టెలికాం రంగం వృద్ధి బాటలో పయనిస్తోందని కూడా ఇది తెలియజేస్తోంది.

స్పెక్ట్రమ్ కేటాయింపు ప్రక్రియ గడువులోపు పూర్తవుతుంది. సెప్టెంబర్/అక్టోబర్ నాటికి 5G సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

 

టెలికాం కనెక్టివిటీకి స్పెక్ట్రమ్ చాలా ముఖ్యం. స్పెక్ట్రమ్ మెరుగైన లభ్యతతో, సేవల నాణ్యత మెరుగుపడుతుందని భావిస్తున్నారు.

బిడ్డర్ వారీగా పొందిన స్పెక్ట్రమ్ పరిమాణం, చెల్లించవలసిన మొత్తాలు క్రింది విధంగా ఉన్నాయి.

 

 

ఆపరేటర్ 

700 మెగాహెట్జ్ 

800 మెగాహెట్జ్ 

900 మెగాహెట్జ్ 

1800 మెగాహెట్జ్ 

2100 మెగాహెట్జ్ 

2500 మెగాహెట్జ్ 

3300 మెగాహెట్జ్ 

26గిగాహెట్జ్ 

మొత్తం 

మొత్తం వేలం కి పెట్టిన స్పెక్ట్రమ్ 

550

136

74

267

160

230

7,260

62,700

72,098

అదానీ డేటా నెట్ వర్క్స్ లిమిటెడ్ 

0

0

0

0

0

0

0

400

400

భారతి ఎయిర్ టెల్ లిమిటెడ్ 

0

0

12.8

25

30

0

2,200

17,600

19,867.8

రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ 

220

20

0

60

0

0

2,440

22,000

24,740

వోడాఫోన్ ఐడియా లిమిటెడ్ 

0

0

0

3.4

5

20

850

5,350

6,228.4

మొత్తం 

220

20

12.8

88.4

35

20

5490

45,350

51,236.2

స్పెక్ట్రమ్ బిడ్ చేసిన శాతం ... 

40%

15%

17%

33%

22%

9%

76%

72%

71%

 

చెల్లించే బిడ్ మొత్తం (రూ.కోట్లలో) :

ఆపరేటర్ 

700 మెగాహెట్జ్ 

800 మెగాహెట్జ్ 

900 మెగాహెట్జ్  

1800 మెగాహెట్జ్ 

2100 మెగాహెట్జ్ 

2500 మెగాహెట్జ్ 

3300 మెగాహెట్జ్ 

26 గిగాహెట్జ్ 

Total

అదానీ డేటా నెట్ వర్క్స్ లిమిటెడ్

0

0

0

0

0

0

0

212

212

భారతి ఎయిర్ టెల్ లిమిటెడ్

0

0

349

2,763

2,680

0

31,700

5,592

43,084

రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్

39,270

1050

0

7,028

0

0

33,740

6,990

88,078

వోడాఫోన్ ఐడియా లిమిటెడ్

0

0

0

584

500

650

15,150

1,915

18,799

మొత్తం

39,270

1050

349

10,375

3,180

650

80,590

14,709

1,50,173

 

 



(Release ID: 1847526) Visitor Counter : 185