యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

తొలి సీడ‌బ్ల్యుజీలో మెరిసిన టాప్ అథ్లెట్ మరియు శాయ్ ఎన్‌సీఓఈ ట్రైనీ బింద్యారాణి

Posted On: 31 JUL 2022 5:41PM by PIB Hyderabad

కామన్వెల్త్ గేమ్స్‌లో వెయిట్‌లిఫ్టర్ బింద్యారాణి దేవి మహిళల 55 కేజీల విభాగంలో రజత పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఆమె మొత్తం 202కిలోల (86కిలోలు+116కిలోలు) బరువు ఎత్తి ఈ ఘ‌న‌త‌ను సొంతం చేసుకున్నారు . దశాబ్దం కంటే కిందటే.మణిపూర్‌కు చెందిన బింద్యారాణి దేవి తన స్వస్థలమైన ఇంఫాల్‌లో వెయిట్‌లిఫ్టింగ్‌ను ప్రారంభించారు. క్రీడను ప్రారంభించిన 3 సంవత్సరాలలోపు ఆమె ఇంఫాల్‌లోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (శాయ్‌) నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (ఎన్‌సీఓఈ)లో శిక్షణ కోసం ఎంపికైంది. ఇక అక్కడ నుండి ఆమె వెనక్కి తిరిగి చూడ‌కుండా రాణిస్తూ వ‌స్తోంది. ఎన్‌సీఓఈ ఇంఫాల్‌లో 3 సంవత్సరాల నిరంతర శిక్షణ మరియు కృషి తర్వాత, ఆమె 2019 సంవత్సరంలో SAI యొక్క పాటియాలా ప్రాంతీయ కేంద్రం ద్వారా భారత జాతీయ శిబిరానికి ఎంపికైంది. గడిచిన కొన్నేళ్లులో ఆమె కామన్వెల్త్ సీనియర్ ఛాంపియన్‌షిప్ 2019లో బంగారు ప‌త‌కం, 2021లో జరిగిన అదే ఈవెంట్‌లో రజతం గెలుచుకోవ‌డంతో సహా అనేక అంతర్జాతీయ ఈవెంట్‌లకు అవ‌కాశం గెలుచుకుంది. జూలై 30 రాత్రి బర్మింగ్‌హామ్‌లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ 55 కేజీల ఈవెంట్‌లో ఆమె రజత పతకాన్ని గెలుచుకోవడం ద్వారా ఆమె అతిపెద్ద అంతర్జాతీయ విజయం సాధించింది.  మా కామన్వెల్త్ చాంప్ సీడ‌బ్ల్యుజీ  కోసం మేటిగా సిద్ధచేయ‌డానికి యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ (ఎంవైఏఎస్‌) వారి వార్షిక కాలండర్ ఫర్ ట్రైనింగ్ & కాంపిటీషన్స్ (ఏసీటీసీ) పథకం ద్వారా శాయ్‌ కింద మొత్తం రూ. 25,63,336 నిధులు సమకూర్చింది.  ఈవెంట్‌కు ఒక నెల ముందు ఇతర వెయిట్‌లిఫ్టర్‌లతో పాటు బింద్యారాణిని బర్మింగ్‌హామ్‌కు ఈ పథకంలో భాగంగా పంపింది, తద్వారా వారు పెద్ద ఈవెంట్‌కు ముందు పరిస్థితులకు అలవాటు పడేలా ఉండేదుకు ఇది దోహ‌దం చేస్తుంది.  టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ డెవలప్‌మెంట్ గ్రూప్‌లో కూడా బింద్యారాణి భాగం. దీని ద్వారా నెలకు రూ. 25,000 పాకెట్ అలవెన్స్‌తో పాటు తన శిక్షణ కోసం వ్యక్తిగతీకరించిన స‌హాయం పొందేందుకు దీని ద్వారావీలు కలుగుతుంది. 

***

 


(Release ID: 1847027) Visitor Counter : 131