మంత్రిమండలి

ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డి ఫుట్‌బాల్ అసోసియేషన్ (ఫిఫా) అండర్ 17 ఉమెన్స్ వరల్డ్ కప్ 2022 భారతదేశంలో నిర్వహించడానికి హామీపై సంతకం చేయడానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

Posted On: 27 JUL 2022 5:23PM by PIB Hyderabad

ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డి ఫుట్‌బాల్ అసోసియేషన్ (ఫిఫా) అండర్ 17 ఉమెన్స్ వరల్డ్ కప్ 2022 భారతదేశంలో నిర్వహించడాని అవసరమైన గ్యారెంటీలపై సంతకం చేయడానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ భేటీ ఆమోదం తెలిపింది.

ఫిఫా అండర్-17 మహిళల ప్రపంచ కప్ 2022 అక్టోబర్ 11 నుండి 30 వరకూ భారతదేశంలో నిర్వహించబడుతోంది. ద్వైవార్షిక యూత్ టోర్నమెంట్ ఏడవ ఎడిషన్ భారతదేశం హోస్ట్ చేస్తున్న మొట్టమొదటి ఫిఫా మహిళల టోర్నమెంట్ అవుతుంది. ఫిఫా అండర్-17 పురుషుల ప్రపంచ కప్ 2017 నుండి సానుకూల వారసత్వాన్ని కొనసాగిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ యువ మహిళా ఫుట్‌బాల్ క్రీడాకారులు గౌరవనీయమైన ట్రోఫీని అందుకోవడంలో తమ నైపుణ్యాలను ప్రదర్శిస్తున్న నేపథ్యంలో దేశం మహిళల ఫుట్‌బాల్‌ నిర్వహించే క్షణం కోసం సిద్ధమవుతోంది.

ఆర్థిక వ్యయం:

ఫీల్డ్ ఆఫ్ ప్లే మెయింటెనెన్స్, స్టేడియం పవర్, ఎనర్జీ & కేబులింగ్, స్టేడియం & ట్రైనింగ్ సైట్ బ్రాండింగ్ మొదలైన వాటి కోసం ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్)కి ఆర్థిక వ్యయం రూ.10 కోట్ల సహాయం జాతీయ క్రీడా సమాఖ్యలకు (ఎన్‌ఎస్‌ఎఫ్‌స్‌) సహాయ పథకానికి బడ్జెట్ కేటాయింపు నుండి అందించబడుతుంది.

పథకం యొక్క లక్ష్యాలు:

  • ఫిఫా అండర్-17 మహిళల ప్రపంచ కప్ 2022  భారతదేశంలో మహిళల ఫుట్‌బాల్‌ను బలోపేతం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది.
  • ఫిఫా అండర్ 17 పురుషుల ప్రపంచ కప్ 2017 నుండి సానుకూల వారసత్వాన్ని కొనసాగిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ యువ మహిళా ఫుట్‌బాల్ క్రీడాకారులు గౌరవనీయమైన ట్రోఫీని అందుకోవడానికి తమ నైపుణ్యాలను ప్రదర్శించిన నేపథ్యంలో  మహిళల ఫుట్‌బాల్‌ను నిర్వహించే ముఖ్యమైన క్షణానికి దేశం సన్నద్ధమవుతోంది. సానుకూల వారసత్వాన్ని కొనసాగించడానికి క్రింది లక్ష్యాలు పరిగణించబడ్డాయి:
  • ఫుట్‌బాల్ నాయకత్వం మరియు నిర్ణయాధికార సంస్థలలో మహిళల ప్రాతినిధ్యం పెంచడం
  • భారతదేశంలో ఫుట్‌బాల్ ఆడేందుకు మరింత మంది అమ్మాయిలను ప్రేరేపించడం
  • చిన్న వయస్సు నుండే సమాన గేమ్ భావనను సాధారణీకరించడం ద్వారా  లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడం
  • భారతదేశంలోని మహిళలకు ఫుట్‌బాల్ ప్రమాణాలను మెరుగుపరచడానికి అవకాశం
  • మహిళల ఆట యొక్క వాణిజ్య విలువను మెరుగుపరచడం.


సమర్థన:
ఫిఫా అండర్-17 మహిళల ప్రపంచ కప్ ప్రతిష్టాత్మకమైన ఈవెంట్ మరియు భారతదేశంలో మొదటిసారి నిర్వహించబడుతుంది. ఇది మరింత మంది యువకులను క్రీడలలో పాల్గొనేలా ప్రోత్సహిస్తుంది మరియు భారతదేశంలో ఫుట్‌బాల్ క్రీడను అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది. ఈ ఈవెంట్ ఫుట్‌బాల్‌ను భారతీయ బాలికలలో ఎంపిక చేసే క్రీడగా ప్రోత్సహించడమే కాకుండా దేశంలోని బాలికలు మరియు మహిళలు సాధారణంగా ఫుట్‌బాల్ మరియు క్రీడలను స్వీకరించడానికి వీలు కల్పించే శాశ్వత వారసత్వాన్నికొనసాగించడానికి సిద్ధంగా ఉంది.

నేపథ్యం:
ఫిఫా అండర్-17 మహిళల ప్రపంచ కప్ అనేది 17 ఏళ్లలోపు లేదా అంతకంటే తక్కువ వయస్సు ఉన్న మహిళా క్రీడాకారిణుల కోసం ఫిఫా నిర్వహించే ప్రపంచ ఛాంపియన్‌షిప్. ఈవెంట్ 2008లో ప్రారంభమైంది. మరియు సాంప్రదాయకంగా సరి సంఖ్య సంవత్సరాలలో నిర్వహించబడుతుంది. ఈవెంట్ 6వ ఎడిషన్ ఉరుగ్వేలో 2018లో నవంబర్ 13 నుండి డిసెంబర్ 1 వరకు జరిగింది. ఫిఫా అండర్-17 మహిళల ప్రపంచ కప్‌లో స్పెయిన్ ప్రస్తుత ఛాంపియన్. ఫిఫా అండర్-17 మహిళల ప్రపంచ కప్ ఇండియా 2022 టోర్నమెంట్ 7వ ఎడిషన్. ఇందులో భారతదేశంతో సహా 16 జట్లు పాల్గొంటాయి. ఏఐఎఫ్ఎఫ్ ఈ టోర్నీ మ్యాచ్‌లను 3 వేదికలలో నిర్వహించాలని ప్రతిపాదించింది; అవి (ఎ) భువనేశ్వర్; (బి) నవీ ముంబై మరియు (సి) గోవా. భారతదేశం ఫిఫా అండర్-17 పురుషుల ప్రపంచ కప్ ఇండియా-2017ను దేశంలోని న్యూ ఢిల్లీ, గౌహతి, ముంబై, గోవా, కొచ్చి మరియు కోల్‌కతా వంటి 6 వేర్వేరు వేదికలలో అక్టోబర్ 6 నుండి 28, 2017 వరకు విజయవంతంగా నిర్వహించింది.


 

*****



(Release ID: 1845654) Visitor Counter : 177