ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

బారాబంకీ లో పూర్వాంచల్ ఎక్స్ ప్రెస్ వే పై జరిగిన ఒకరోడ్డు దుర్ఘటన లో ప్రాణనష్టం వాటిల్లినందుకు సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 25 JUL 2022 1:38PM by PIB Hyderabad

బారాబంకీ లో పూర్వాంచల్ ఎక్స్ ప్రెస్ వే పై జరిగిన ఒక రోడ్డు దుర్ఘటన లో ప్రాణనష్టం వాటిల్లినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన లో గాయపడిన వ్యక్తులు త్వరిత గతి న కోలుకోవాలంటూ ఆ ఈశ్వరుడి ని ఆయన ప్రార్థించారు. స్థానిక పాలన యంత్రాంగం చేతనైన అన్ని విధాలు గాను సహాయాన్ని అందిస్తోంది అని ప్రధాన మంత్రి అన్నారు.

ప్రధాన మంత్రి కార్యాలయం (పిఎమ్ఒ) ఒక ట్వీట్ లో -

‘‘బారాబంకీ లో పూర్వాంచల్ ఎక్స్ ప్రెస్ వే పై జరిగిన దుర్ఘటన అత్యంత దుఃఖదాయకం గా ఉంది. ఈ ప్రమాదం లో ప్రాణాల ను కోల్పోయిన వ్యక్తుల కు నేను నా శోకాన్ని మరియు సంవేదన ను వ్యక్తం చేస్తున్నాను. దీనితో పాటు గా క్షతగాత్రులందరూ శీఘ్రం గా పున:స్వస్థులు కావాలని ఆకాంక్షిస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం యొక్క పర్యవేక్షణ లో స్థానిక పాలన యంత్రాంగం చేతనైన అన్ని విధాలు గాను సహాయాన్ని అందించడం లో తలమునకలుగా ఉంది.’’ అని పేర్కొంది.

DS

 

 

 


(Release ID: 1844646)