ప్రధాన మంత్రి కార్యాలయం

కీర్తిశేషుడు శ్రీ హర్ మోహన్ సింహ్ యాదవ్ పదో వర్ధంతి సూచకం గా జులై 25న ఏర్పాటు చేసినకార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాన మంత్రి

Posted On: 24 JUL 2022 1:55PM by PIB Hyderabad

కీర్తి శేషుడు శ్రీ హర్ మోహన్ సింహ్ యాదవ్ పదో వర్ధంతి సూచకం గా జులై 25న ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆ రోజు న సాయంత్రం 4 గంటల 30 నిమిషాల కు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించనున్నారు.

 

శ్రీ హర్ మోహన్ సింహ్ యాదవ్ 18 అక్టోబర్, 1921 నుంచి 25 జులై 2012 మధ్య జీవించిన ఒక మహానుభావుడు ; అంతేకాక, యాదవ్ సముదాయం లో ఓ సమున్నత నాయకుడు కూడాను. రైతుల కు, వెనుకబడిన వర్గాల వారికి మరియు సమాజం లోని ఇతర వర్గాల వారికి కీర్తి శేషుడు శ్రీ హర్ మోహన్ సింహ్ యాదవ్ అందించిన తోడ్పాటు ను గౌరవించడం కోసం ఏర్పాటు చేస్తున్న ఈ కార్యక్రమం కావడం తో దీనిలో ప్రధాన మంత్రి పాలుపంచుకోనున్నారు.

 

శ్రీ హర్ మోహన్ సింహ్ యాదవ్ దీర్ఘ కాలం పాటు రాజకీయాల లో క్రియాశీలం గా ఉండడం తో పాటుగా ఎమ్ఎల్ సి గా, ఎమ్ఎల్ఎ గా, రాజ్య సభ లో సభ్యుని గా మరియు ‘అఖిల భారతీయ యాదవ్ మహాసభ’ కు చైర్ మన్ గా కూడా వివిధ హోదాల లో సేవల ను అందించారు. ఆయన తను కుమారుడు శ్రీ సుఖ్ రాం సింహ్ సహాయాన్ని తీసుకొని కాన్ పుర్ లో, కాన్ పుర్ చుట్టుపక్కల ప్రాంతాల లో అనేక విద్య బోధన సంస్థల ను ఏర్పాటు చేయడం లో సైతం ప్రముఖ పాత్ర ను పోషించారు.

 

శ్రీ హర్ మోహన్ సింహ్ యాదవ్ ను 1984 వ సంవత్సరం చెలరేగిన సిఖ్కు వ్యతిరేక అల్లర్ల లో అనేక మంది సిఖ్కుల ప్రాణాల ను కాపాడే క్రమం లో వీరత్వాన్ని ప్రదర్శించినందుకు గాను 1991వ సంవత్సరం లో శౌర్య చక్ర తో సమ్మానించడమైంది.

 

 

**



(Release ID: 1844488) Visitor Counter : 126